delete

సోష‌ల్ మీడియాకు ఆద‌ర‌ణ క‌రువు

Submitted by lakshman on Sat, 03/10/2018 - 21:32

సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ కు ఆద‌ర‌ణ రోజు రోజుకు త‌గ్గుతుంది. సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ దిగ్గ‌జఆలైన ఫెస్ బుక్, ట్విట్ట‌ర్ కు ఆద‌ర‌ణ క‌రువైపోతోంది. ఎక్కువ శాతం యువ‌త వాటికి దూరంగానే ఉంటున్నార‌ట‌. ఈ నేపథ్యంలో సోష‌ల్ మీడియాకు చాలా మంది గుడ్ బై చెబుతున్న‌ట్లు ఓ స‌ర్వే వెల్ల‌డించింది. బోస్టన్‌ కు చెందిన మార్కెట్‌ రీసెర్చ్‌ ఏజెన్సీ సంస్థ ఓరిజిన్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెయ్యి మందిపై అధ్యయనం చేసింది. 

ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆప్షన్ రాబోతోంది

Submitted by lakshman on Wed, 09/13/2017 - 19:06

వాట్సాప్‌ యూజర్స్‌కు ఇది నిజంగా పండగ లాంటి వార్తే. చాలామంది వాట్సాప్ వినియోగదారులు ఎప్పటి నుంచో ఓ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పొరపాటున మెసేజ్ కానీ, మల్టీమీడియా ఫైల్ కానీ పంపిస్తే దాన్ని నిరోధించే అవకాశం ఇన్నాళ్లూ ఉండేది కాదు. ఒక్కసారి పంపితే మనకు డిలీట్ చేసే అవకాశమే ఉండదు. మనం ఎవరికి పంపామో.. వాళ్లు కచ్చితంగా దాన్ని చూస్తారు. కొన్ని సందర్భాల్లో మెసేజ్ లేదా ఫొటోను పంపించిన తర్వాత చాలామంది అనవసరంగా పంపించానే అని ఫీలవుతుంటారు. ఇలాంటి పరిస్థితి ఇకపై వాట్సాప్ యూజర్లకు ఉండదు. మనం పంపించిన టెక్ట్స్ మెసేజ్‌ను, ఫైల్స్‌ను డిలీట్ చేసే ఆప్షన్ త్వరలో అందుబాటులోకి రానుంది.