marriage

భారత్‌లో మరోసారి ‘విరుష్క’ వివాహం?

Submitted by arun on Sun, 01/14/2018 - 10:55

మొన్నామధ్యే ఇటలీలో విరాట్ కోహ్లీ, అనుష్కలు పెళ్లి చేసుకుకుని, ఇండియాలో ఘనంగా విందు కూడా ఇచ్చారుగా? వీరి మధ్య మళ్లీ పెళ్లేంటని అనుకుంటున్నారా? నిజమేనంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఇటలీలో పెళ్లి చేసుకోవడంతో, వీరికి మ్యారేజ్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు అధికారులు నిరాకరించినట్టు సమాచారం. దీంతో పెళ్లి ధ్రువీకరణ కోసం వీరు ఇండియాలో మళ్లీ పెళ్లి చేసుకోనున్నారని తెలుస్తోంది. ఇటలీలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఆ తరువాత సామాజిక మాధ్యమాల ద్వారా తమ పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆ తరువాత దిల్లీ, ముంబయిలో వివాహ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

విజ‌య్ ఇంత‌కీ ఆ వ‌రంగల్ అమ్మాయి ఎవ‌రు

Submitted by lakshman on Sat, 01/13/2018 - 16:20

గీతాఆర్ట్స్ నిర్మాణంలో సినిమాచేస్తున్న యంగ్ సెన్సేషన్  విజయ్ దేవరకొండ వ‌రంగ‌ల్ లో సంద‌డి చేశాడు. హనుమకొండలో ఓ షోరూమ్ ఓపెనింగ్ కు వ‌చ్చిన విజయ్ అభిమానుల‌తో స‌ర‌ద‌గా గ‌డిపాడు. ఈ సంద‌ర్భంగా  తాను చేసుకుంటే వ‌రంగ‌ల్ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పాడు. దీంతో అభిమానులు కేరింతలు కొట్టారు. ఇక విజ‌య్ పెళ్లి గురించి ఎందుకు మాట్లాడాడు.  విజయ్ మనసులో వరంగల్ అమ్మాయి ఉందా? ఉంటే ఆమె ఎవరు? అని టాలీవుడ్ స‌ర్కిల్ ల్లో చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. కాగా త్వ‌ర‌లో విజ‌య్ షార్ట్ ఫిల్మింలో యాక్ట్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు నేరాల‌ప‌ట్ల అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఓ షార్ట్ ఫిల్మిం రెడీ అయ్యింది.

శ్రీనివాస్‌రెడ్డికి మళ్లీ పెళ్లి

Submitted by arun on Sat, 01/06/2018 - 17:22

క‌మెడియ‌న్ శ్రీనివాస్‌రెడ్డికి మ‌ళ్లీ పెళ్లి. ఇప్పుడు ఈ వార్త వైర‌ల్ అవుతోంది. ఇటీవ‌ల రెండో బిడ్డ ఫొటోను ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశాడు శ్రీనివాస్‌రెడ్డి . మళ్లీ పెళ్లి ఏంటి అని ఈఫొటో చూసిన వాళ్లు అంద‌రూ అడుగుతున్నారు. అయితే ఈ ఫొటో వెనుక అస‌లు క‌థ వేరే ఉంది. ఈ విషయాన్ని శ్రీనివాస్ రెడ్డి తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అయితే నిజం పెళ్లి కాదులెండి. శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం జంబ లకిడి పంబ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో సంచలన విజయం సాధించిన జంబ లకిడి పంబ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా అదే జానర్ లో తెరకెక్కనుంది.

బలవంతపు పెళ్లి.. అబ్బాయిని ఎత్తుకెళ్లి బలవంతంగా పెళ్లి చేసిన అమ్మాయి తరఫువాళ్లు

Submitted by arun on Sat, 01/06/2018 - 13:07

ఇప్పటివరకు అమ్మాయిలను బలవంతంగా ఎత్తుకెళ్లి.. పెళ్లి చేసుకున్న ఘటనలే చూశాం. కానీ.. బీహార్‌లో సీన్ రివర్స్ అయ్యింది. అబ్బాయిని.. అమ్మాయి తరఫు వాళ్లు బలవంతంగా ఎత్తుకెళ్లి.. పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి మరీ పెళ్లికూతురికి తాళి కట్టించారు. ఈ ఘటనపై పెళ్లి కొడుకు వినోద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయని తెలిపాడు. 

పెళ్లి గురించి ప్రభాస్ క్లారిటీ

Submitted by arun on Wed, 01/03/2018 - 12:42

ప్ర‌భాస్ పెళ్లి వ్య‌వ‌హారంపై రోజుకో రూమ‌ర్ నెట్టింట్లో హడావిడి చేస్తున్న విష‌యం తెలిసిందే. గ‌తంలో భీమ‌వ‌రానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకుంటార‌ని వార్త‌లు రాగా..అదేంలేద‌ని పెద్ద‌నాన్న కృష్ణంరాజు కొట్టిపారేశారు. ఆ త‌రువాత‌ హీరోయిన్ అనుష్క‌ను వివాహం చేసుకుంటార‌ని ఇలాపుకారు షికార్లు చేశాయి. ఈనేప‌థ్యంలో రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ త‌న పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. హీరోయిన్ అనుష్క‌ను ప్రేమిస్తున్నార‌నే  ఓ మ్యాగ‌జైన్ ఇంట‌ర్వ్యూలో  ఒకే జంట వ‌రుస సినిమాలు చేస్తే ఇలాంటి రూమ‌ర్లు రావ‌డం కామ‌న్ అని అన్నారు.

చైతూ, సమంత పెళ్లి విషయంలో క్లారిటీ

Submitted by lakshman on Thu, 09/14/2017 - 16:00
టాలీవుడ్‌లో నాగచైతన్య, సమంత జంట ఎంత ప్రత్యేకమో చెప్పనక్కర్లేదు. ఏ మాయ చేసావే సినిమాతో మొదలైన వారి ప్రేమ పయనం త్వరలో పెళ్లి వైపు అడుగులు వేయబోతోంది. ఇప్పటికే వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అప్పుడెప్పుడో మహేశ్ బాబు తన సినిమాలో నటించిన నమ్రతను ప్రేమించి..

చెల్లి పెళ్లైన రెండురోజులకే బావను చంపేశాడు

Submitted by lakshman on Wed, 09/13/2017 - 18:35
నగరంలో దారుణ ఘటన జరిగింది. పెద్దల అంగీకారం లేకుండా తన చెల్లిని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడనే కోపంతో బావమరిదే బావను హతమార్చిన ఘటన వెలుగులోకొచ్చింది. మంగళ్‌హట్ పోలీస్ స్టేషన్ పరిధిలో...