CM Chandrababu Naidu

నాకు హైదరాబాద్‌లో ఏం పనుందో ప్రజలే చెబుతారు: చంద్రబాబు

Submitted by chandram on Sun, 12/02/2018 - 17:42

మహాకూటమి అభ్యర్ధుల పక్షాన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు కూడా ప్రచారం సాగించారు. మలక్‌పేట అభ్యర్ధికి మద్ధతుగా రోడ్‌షో నిర్వహించిన ఆయన టీఆర్ఎస్‌, ఎంఐఎం, బీజేపీ ఒక్కటై ప్రజలను మోసం చేస్తున్నాయంటూ ఆరోపించారు.  మైనార్టీలకు నష్టం కలిగించే ట్రిపుల్ తలాక్ బిల్లును టీడీపీ వ్యతిరేకిస్తే ఎంఐఎం, టీఆర్ఎస్‌లు కనీసం స్పందించలేదంటూ విమర్శించారు. కేంద్రంలో సీనియర్‌ మోడీ, తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ మోడీ ప్రశ్నించిన వారిపై బెదిరింపులకు దిగుతున్నారంటూ చంద్రబాబు ఆరోపించారు . ఈ ఎన్నికల్లో మహాకూటమి విజయం తథ్యమని చంద్రబాబు నాయుడు థీమా వ్యక్తం చేశారు.

ఖమ్మం సభలో కేసీఆర్‌కు బాబు సవాల్‌...మోడీతో ఉంటావా..?

Submitted by arun on Wed, 11/28/2018 - 17:15

ఖమ్మం సభలో చంద్రబాబు కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు. మోడీతో ఉంటావో ఎన్డీఏ వ్యతిరేక కూటమితో కలిసి వస్తారో తేల్చుకోవాలన్నారు. దేశంలో రెండే రెండు ఫ్రంట్‌లు ఉన్నాయని.. ఒకటి ఎన్డీయే ఫ్రంట్‌, రెండోది ఎన్డీయే వ్యతిరేక ఫ్రంట్‌ అని, ఎవరు ఎటువైపు ఉన్నారో తేల్చుకోవాల్సిన సమయం ఆసననమైందని, కేసీఆర్‌ ఎక్కడుంటారో చెప్పాలని, ఎంఐఎం ఎక్కడుంటుందో తెలపాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. డిసెంబర్‌ 10న ఢిల్లీలో ఎన్డీఏ వ్యతిరేక పక్షాలతో సమావేశముందని చెప్పిన చంద్రబాబు దేశవ్యాప్త కూటమి ఏర్పాటుపై ఆ సమావేశం లో నిర్ణయం తీసుకుంటామన్నారు.

డిసెంబర్‌ మొదటివారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Submitted by chandram on Thu, 11/22/2018 - 14:06

డిసెంబర్ మొదటి వారంలో  ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మంత్రి వర్గ విస్తరణ అనంతరం తొలిసారిగా శాసనసభ సమావేశం కానుంది.  ఈ సందర్భంగా కొత్తగా మంత్రివర్గంలో చేరిన మంత్రులు కిడారి శ్రవణ్‌, ఎన్‌ఎండీ ఫరూక్‌లను సీఎం చంద్రబాబు సభకు పరిచయం చేయనున్నారు. ఎన్‌ఎఫ్‌డీ ఫరూక్ మంత్రి వర్గంలోకి రావడంతో ఖాళీ ఏర్పడిన మండలి ఛైర్మన్‌‌ను ఇదే సమావేశంలో ఎన్నుకోనున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ  షరీఫ్‌‌ను మండలి ఛైర్మన్‌గా ప్రకటించినా సభలోని ఎంపిక జరగాల్సి ఉంది. ఇదే సమావేశాల్లోనే శాసనమండలి ఛైర్మన్‌ను కూడా ఎంపిక చేయనున్నారు.

నేడు కోల్‌కతాకు ఏపీ సీఎం చంద్రబాబు

Submitted by arun on Mon, 11/19/2018 - 12:54

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ కోల్‌కతా వెళ్లనున్నారు. బీజేపీయేతర పార్టీలను ఏక తాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తున్న చంద్రబాబు ఇప్పటికే పలువురు జాతీయ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఇప్పుడు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిసేందుకు వెళ్లనున్నారు. కాంగ్రెస్, ఇతర పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు, సానుకూలతపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. జనవరిలో తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరగనున్న భారీ ర్యాలీ, ఢిల్లీలో ఈనెల 22న నిర్వహించనున్న బీజేపీయేతర పక్షాల విందు సమావేశంపైనా భేటీలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. 

మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ జేసీ ...అనంతపురంలో ఐదుగురు ఎమ్మెల్యేలను...

Submitted by arun on Sat, 11/17/2018 - 17:28

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. 2019 ఎన్నికల్లో రాష్ర్టంలో టిడిపి గెలవాలన్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగాలన్న 40 శాతం ఎమ్మెల్యేలను మార్చాలన్నారు జేసీ. 
అనంతపురం జిల్లాలో ఐదుగురు ఎమ్మెల్యేలను మార్చకుంటే పరిస్థితి కష్టంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఎంపీలకు ఎటువంటి పవర్ లేకుండా పోయిందన్నారు. ఎంపీలకు ఉండాల్సిన పవర్ మొత్తం సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకే కట్టబెట్టారన్నారు. 
 

రేపు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు ..

Submitted by arun on Wed, 10/31/2018 - 10:33

సీఎం చంద్రబాబు జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారా..? వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా మోడీ మరోసారి ప్రధాని పీఠం ఎక్కకుండా చేయాలనే పట్టుదలతో ఉన్నారా..? బీజేపీ యేతర పార్టీలను ఏక తాటిపైకి తెచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేశారా..? బీజేపీ వ్యతిరేక పక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడమే అజెండాగా చంద్రబాబు రేపటి ఢిల్లీ పర్యటన జరగబోతోందా..? 

ఏపీలో ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్రలు జరుగుతున్నాయి

Submitted by arun on Sat, 10/27/2018 - 17:34

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ వేదికగా గర్జించారు. ప్రధాని మోడీతోపాటు బీజేపీపై నిప్పులు చెరిగారు. విభజన హామీలు నెరవేర్చకుండా ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నాన్‌ బీజేపీ, నాన్‌ కాంగ్రెస్‌... జాతీయ నేతలకు వివరించిన చంద్రబాబు ప్రధాని మోడీ విధానాలను ఎండగట్టారు. దేశంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్న చంద్రబాబు అన్ని వ్యవస్థలను కేంద్రం బలహీనపరుస్తోందని ఆరోపించారు. నల్లధనం వెనక్కి తెస్తానన్నారు ఏమైందని ప్రశ్నించారు. నోట్ల రద్దు, జీఎస్టీతో వృద్ధిరేటు ఆగిపోయిందన్న చంద్రబాబు దేశంలో బ్యాంకులన్నీ దివాలా తీసే పరిస్థితి వచ్చిందన్నారు.

జగన్‌పై దాడి జరిగిన తీరు చూస్తే అనుమానం: సీఎం చంద్రబాబు

Submitted by arun on Fri, 10/26/2018 - 10:56

ప్రతిపక్ష నేత జగన్‌పై జరిగిన దాడి  తీరు చూస్తే అనుమానం కలుగుతుందన్నారు సీఎం చంద్రబాబు. ఎయిర్‌పోర్టు లోపల జరిగితే బాధ్యత ఎవరిదని ఆయన ప్రశ్నించారు. ఈ దాడిని రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి జరిగిన వెంటనే గాయపడిన వ్యక్తి హైదరాబాద్ వెళ్లిపోయారని, ప్రతిపక్ష నాయకుడు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఈ ఘటనపై గవర్నర్ ఫోన్ చేసి డీజీపీని నివేదిక ఎలా అడుగుతారు ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పనిచేయకుండా కేంద్ర సర్కార్ కుట్రలు పన్నుతోందని సీఎం ఆరోపించారు. 

మహారాష్ట్ర పోలీసులు ఏం చేయబోతున్నారు?

Submitted by arun on Sat, 09/15/2018 - 09:39

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహారాష్ట్ర ధర్మాబాద్‌ కోర్టుకు హాజరవుతారా? నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ నోటీసులపై మొదటిసారి స్పందించిన చంద్రబాబు ఏం చెప్పారు? కోర్టు నోటీసుల్ని తనకు అనుకూలంగా మార్చుకోబోతున్నారా? అసలు చంద్రబాబు ముందున్న ఆప్షన్స్ ఏంటి?

చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

Submitted by arun on Fri, 09/14/2018 - 09:49

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ కావడంతో తీవ్ర సంచలనమైంది. ఎనిమిదేళ్ల క్రితం కేసులో సడన్‌‌గా ఎన్బీడబ్ల్యూ ఇష్యూ చేయడంపై తెలుగుదేశం శ్రేణులు అవాక్కయ్యాయి. ఇదంతా కుట్ర అంటూ కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. 

టీడీపీ బాబ్లీ ఉద్యమం కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యింది. చంద్రబాబుతోపాటు మొత్తం 16మందికి నోటీసులు జారీ చేసిన మహారాష్ట్ర ధర్మాబాద్‌ కోర్టు ఈనెల 21న విచారణకు హాజరుకావాలంటూ ఆదేశించింది.