India vs South Africa

సౌత్ ఆఫ్రికాపై భార‌త్ ఘనవిజయం

Submitted by lakshman on Fri, 02/02/2018 - 03:33

సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో కోహ్లీ సేన ఘనవిజయం సాధించింది. ఛేజింగ్ వీరుడిగా పేరుగాంచిన టీం ఇండియా సారధి విరాట్ కోహ్లీ ఆ పేరుని మరోమారు సార్థకం చేసుకున్నాడు. ఓ వైపు టెస్టుల్లో పరాజయం, సఫారీలని సొంత గడ్డలో ఎదుర్కొనడం అంటే మామూలు విషయం కాదు. ఇలాంటి నేపథ్యంలో ఒత్తిడి మొత్తం టీం ఇండియా పైనే. కానీ ఒత్తిడి ఛాయలేవీ కనిపించకుండా కోహ్లీ అద్భుత సెంచరీతో భారత జట్టుని గెలుపు తీరాలకు చేర్చాడు. సఫారీలు భారత జట్టుకు విధించిన లక్ష్యం 270 పరుగులు.

టీమిండియా 'లుంగి' ఊడదీశాడు

Submitted by arun on Wed, 01/17/2018 - 16:24

సౌతాఫ్రికా యువఫాస్ట్ బౌలర్ లుంగీ ఎన్ గిడీ....అరంగేట్రం టెస్టులోనే అదరగొట్టాడు. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీతో సహా...మొత్తం ఆరుగురు బ్యాట్స్ మన్ ను అవుట్ చేసి...వారేవ్వా! అనిపించుకొన్నాడు. 21 ఏళ్ల వయసులోనే టెస్ట్ అరంగేట్రం చేసిన 99వ సఫారీ క్రికెటర్ గా రికార్డుల్లో చేరిన ఎన్ గిడి..గంటకు 140 కిలోమీటర్ల సగటు వేగంతో...ఇన్ స్వింగర్లు వేసి....టాప్ ర్యాంకర్ టీమిండియా...టాపార్డర్ ను తన తొలిటెస్ట్ మ్యాచ్ లోనే టపటపలాడించాడు. ఓపెనర్ రాహుల్, కెప్టెన్ కొహ్లీ, హార్థిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, బుమ్రాలను... ఎన్ గిడీ అవుట్ చేశాడు.

ఊహించని రికార్డు సాధించిన పుజారా!

Submitted by arun on Wed, 01/17/2018 - 15:00

టెస్టుల్లో మంచి రికార్డు ఉన్న టీమిండియా బ్యాట్స్‌మన్‌ చతేశ్వర్‌ పుజారా.. దక్షిణాఫ్రికా సిరీస్‌లో నిరాశపరిచాడు. సెంచూరియన్‌లో సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌ల్లో పుజారా రనౌటయ్యాడు. ఇలా ఒక టెస్టులో రెండుసార్లు రనౌటైన తొలి ఇండియన్ బ్యాట్స్‌మన్‌గా పుజారా నిలిచాడు. దీంతో ఊహించని రికార్డు అతని పేరిట నమోదైంది. ఓవరాల్‌గా టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇలా రెండు ఇన్నింగ్స్‌ల్లో రనౌటైన 25వ బ్యాట్స్‌మన్ పుజారా. ఇక 21వ శ‌తాబ్దంలో ఇలా రెండు ఇన్నింగ్స్‌ల్లో ర‌నౌటైన తొలి బ్యాట్స్‌మ‌న్ కూడా పుజారానే కావ‌డం విశేషం. తొలి ఇన్నింగ్స్ తొలి బంతికే అతడు రనౌటైన విషయం తెలిసిందే.

పుజారా ర‌నౌట్ పై సెహ్వాగ్ సెటైర్

Submitted by lakshman on Mon, 01/15/2018 - 02:13

ద‌క్షిణాఫ్రికా - భార‌త్ ల మ‌ధ్య జ‌రిగే టెస్ట్ మ్యాచ్ పూజారా బ్యాంటింగ్ పై సెహ్వాగ్ కౌంట‌ర్ ఇచ్చాడు. ఈ మ్యాచ్  తొలి ఇన్నింగ్స్ 335 ప‌రుగుల‌కే ఆలౌట్ అయ్యింది. అనంత‌రం బ్యాటింగ్ కు దిగిన భార‌త్ అనుకున్న‌తంగా రాణించ‌లేక‌పోయింది.  ఓపెనర్లు మురళీ విజయ్‌ 46;లోకేశ్‌ రాహుల్ 10 ప‌రుగుల వ‌ద్ద ఔట్ అయ్యాడు. ఆ వెంటనే బ్యాటింగ్‌కు వచ్చిన నయావాల్‌ ఛెతేశ్వర్‌ పుజారా (0) అత్యంత ఘోరంగా రనౌట్‌ అయ్యాడు. 
భారత్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా మోర్నీమోర్కెల్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌ నాల్గో బంతిని ఎదుర్కొన్న పుజారా మిడాన్‌ మీదుగా ఆడాడు.

కెప్టెన్ గా విరాట్ కొహ్లీకి భలే చాన్స్

Submitted by arun on Mon, 01/08/2018 - 17:17

కేప్ టౌన్ టెస్ట్ రసపట్టుగా మారింది. రెండో ఇన్నింగ్స్ లో సైతం టీమిండియా బౌలర్లు చెలరేగిపోడంతో విరాట్ సేనను విజయం ఊరిస్తోంది. మ్యాచ్ నెగ్గాలంటే టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 208 పరుగులు

సౌతాఫ్రికా జైత్రయాత్రకు బయలుదేరిన విరాట్ సేన

Submitted by arun on Thu, 12/28/2017 - 17:24

టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్ టీమిండియా కొత్త సంవత్సరంలో సరికొత్త సవాలుకు సిద్ధమయ్యింది. సౌతాఫ్రికాలో రెండుమాసాల జైత్రయాత్ర కోసం సఫారీకోటలో పాగావేసింది. 2017 సీజన్లో ఇంట్లో పులిగా సత్తా చాటుకొన్న విరాట్ సేన 2018 సీజన్లో రచ్చగెలవడం ద్వారా విదేశీ గడ్డపైనా పులినేనని చాటుకోడం కోసం తహతహలాడుతోంది. టీమిండియా సఫారీవేట పై..HMTV స్పెషల్ ఫోకస్....