trivikram

ఎన్టీఆర్ కొంచెం కొత్త‌గా

Submitted by lakshman on Fri, 03/02/2018 - 17:36

వరుస విజయాలతో మంచి దూకుడు మీదున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ క్రమంలో త్రివిక్రమ్ తో తన తదుపరి సినిమాను మొదలుపెట్టబోతున్నాడు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే మొదలుకావాల్సివుంది. కానీ ఆలస్యమవుతూ వస్తోంది. దీంతో ఈసినిమా ప్రారంభం కాకుండానే ఈ సినిమా పై ఇప్పటికే అనేక గాసిప్పులు హడావిడి  చేసాయి. వాస్తవానికి త్రివిక్రమ్ ఇప్పటివరకు జూనియర్ ఏసినిమాలోను కనిపించని విధంగా    ఎన్టీఆర్ లుక్ ఉండాలని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ప్రముఖ ఫిట్ నెస్ ట్రైనర్ స్టీవెన్స్ సమక్షంలో ఎన్టీఆర్ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లుంది

Submitted by arun on Thu, 02/22/2018 - 14:15

టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్. ఇండస్ట్రీలో అభిమానుల్లో విపరీతమైన క్రేజ్. కాని కాని ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమాతో అంతా తారుమారైంది. దీంతో తారక్ తో చేసే సినిమాలో కాస్టింగ్ స్టోరీ ఇలా ప్రతి దాంట్లోనూ కాంప్రమైజ్. వీటికి దర్శకధీరుడు రాజమౌళి టెన్షన్ పెడుతున్నాడు. ఇన్ని రకాల టెన్సన్స్ తో తారక్ సినిమా త్రివిక్రమ్ కిఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లవుతోంది.

అయ్యా..మీరు దేవుడ‌య్యా

Submitted by lakshman on Sun, 01/14/2018 - 22:45

క‌ష్టాల్లో ఉన్నార‌ని తెలిస్తే ముందువెనుక ఆలోచించ‌కుండా సాయం చేసే గొప్ప‌గుణం ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఉంద‌నే చెప్పుకోవాలి. అలా బ‌య‌టే కాదు సినిమాల్లో కూడా అంతే ఔదార్య‌న్ని ప్ర‌ద‌ర్శిస్తారు. ప్ర‌తీనిర్మాత‌కు మంచి హిట్ అవ్వాల‌నే గుణం ఉన్న జ‌న‌సేనాని అందుకు చేయాల్సిన ప్ర‌య‌త్నాల‌న్నీ చేస్తాడు. ఒక్కోసారి ఆ ప్ర‌య‌త్నాల‌న్నీ బెడిసికొట్టి ప్లాపులు మూట‌గ‌ట్టుకోవాల్సి వ‌స్తుంది. అయినా నిర్మాత‌ను సేఫ్ చేసేందుకు రెమ్యూన‌రేష‌న్ త‌గ్గించేస్తాడు.

త్రివిక్ర‌మ్ విష‌యంలో హ్యాపీగా ఉన్న ఎన్టీఆర్

Submitted by lakshman on Sun, 01/14/2018 - 13:24

త్రివిక్రమ్ శ్రీనివాస్ - యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో కొత్త సినిమా షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులు ఆందోళ‌న‌లో ఉన్నట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. కొద్దిరోజుల క్రితం ఎన్నో అంచ‌నాల న‌డుమ‌ త్రివిక్ర‌మ్ డైర‌క్ష‌న్ లో   అజ్ఞాతవాసి సినిమా విడుద‌లై డిజాస్ట‌ర్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ ల సినిమా అంటే అనేక సందేహాలు వ‌చ్చిప‌డుతున్నాయి. కానీ ఎన్టీఆర్ మాత్రం పిచ్చ హ్యాపీగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఎన్టీఆర్  గ‌తంలో ఫ్లాపులు మూట‌గ‌ట్టుకున్న పూరిజ‌గన్నాథ్  కు అవ‌కాశం ఇస్తే  టెంప‌ర్ సినిమా తీసి  హిట్ ఇచ్చాడు.

త్రివిక్ర‌మ్ పై ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆగ్ర‌హం

Submitted by arun on Fri, 01/12/2018 - 12:55

పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి ఇండస్ట్రీ కొడుతుందునుకున్నారు. సినిమాను ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఊహించుకున్నారు. కానీ డైరెక్టర్ త్రివిక్రమ్ మాత్రం అందరి అంచనాలను తలక్రిందులు చేశాడు. సినిమాను ఆకాశానికెత్తేస్తాడనుకుంటే..పాతానికి పడేశాడు. దీంతో ఫ్యాన్స్ త్రివిక్రమ్ పై తీవ్ర ఆగ్రహాంతో ఉన్నారు. అసలు అజ్ఞాతవాసి ఇలా కావడానికి త్రివిక్రమ్ చేసిన తప్పేంటి.

ప‌వ‌న్ క‌ల్యాణ్ ను కొంప‌ముంచింది ఆ ఒక్క‌టే

Submitted by arun on Thu, 01/11/2018 - 16:33

ఎక్స్ పెక్టేషన్స్..ఈ పదానికి చాలా పవర్ ఉంది. సినిమాను నిలెబెట్టాలన్నా..పడగొట్టాలన్నా దీనికే సాధ్యం. అంచనాలను అందుకుంటే బ్లాక్ బస్టర్ చేస్తోంది. అదే ఎక్స్ పెక్టేషన్స్ ను రీచ్ కాకపోతే నిట్ట నిలువునా ముంచేస్తోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసికి అలాంటి షాకింగ్ న్యూసే ఎదురైంది. సినిమాకు నెగిటీవ్ టాక్ రావడానికి కారణమేంటో ఓసారి చూడండి.

రాజ‌మౌళికి పోటీగా కొర‌టాల శివ‌

Submitted by arun on Thu, 01/11/2018 - 16:00

కొరటాల శివ కూడా త్రివిక్రమ్ లానే సింగిల్ ఎజెండాతో పనిచేస్తున్నాడు. కొడితే ఏనుగు కుంభస్థలమే కొట్టాలనుకునే ,తను, ఇప్పుడా పనిలోనే ఉన్నాడు రాజమౌలికే పోటీగా తయారయ్యేలా ఉన్నాడు. వందల కోట్ల వసూళ్ల కి కేరాఫ్ అడ్రస్ అయిన, తనకు, ఒకే ఒక మిషన్ తో ముందుకుపోతున్నాడు. కాకపోతే, అదే జరిగే పనేనా అనే అనుమానాలు పెరిగాయ్ ఓ స్థాయి మూవీల వరకు ఓకే కాని, రాజమౌళిలా నెక్ట్స్ లెవల్ కి వెళ్లే సత్తా ఉందా అనే ప్రశ్నలే వస్తున్నాయ్. 

రాజమౌళికి పోటీ ఇవ్వబోయిన త్రివిక్రమ్..అజ్ఞాతవాసి నిరాశపరచడంతో డీలా పడ్డ త్రివిక్రమ్

Submitted by arun on Thu, 01/11/2018 - 15:41

త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటేనే సక్సెస్ మినిమమ్ గ్యారెంటీ. ప్రాసలు, పంచ్ లతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసే సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ఇంతవరకు ఫ్లాప్ రాలేదు సక్సెస్ తప్ప మరొకటి తెలియదన్నారు కాని ఇప్పుడు అది అత్యేశా అని తేలింది...అగ్నాతవాసి కి పంచ్ పడటంతో తొలి ఫ్లాప్ ని ఫేస్ చేసినట్టైంది.

exclusive: మ‌హేష్ సంధించిన ఒక ప్ర‌శ్న‌కు స‌మాధానం దొరికింది

Submitted by arun on Sun, 01/07/2018 - 18:31


పూనమ్ కౌర్ తన 6 ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు కత్తి మహేష్. సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో ప్రెస్‌మీట్ పెట్టిన ఆయన.. పవన్ ఫ్యాన్స్ తనపై సామాజిక దాడి చేశారన్నారు. ఈసంద‌ర్భంగా ప‌వ‌న్ -తాంత్రిక పూజ‌లు ఎందుకు నిర్వ‌హించారోనంటూ ఆరు ప్ర‌శ్న‌లు సంధించారు. వాటిలో ఒక ప్ర‌శ్న‌కు సమాధానం దొరికినట్లు తెలుస్తోంది.  

పూనమ్ కౌర్ కు  సంధించిన  ఆ ఆరు ప్ర‌శ్నలలో    

1. మీకు ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ పదవి ఎవరి వల్ల వచ్చింది?

2. తిరుమలలో పవన్ పక్కనే నిల్చొని ఒకే గోత్రనామాలతో ఎందుకు పూజ చేయించుకున్నారు?

ఎన్టీఆర్ కు ప‌రీక్ష‌పెట్టిన డైర‌క్ట‌ర్ త్రివిక్ర‌మ్

Submitted by arun on Wed, 01/03/2018 - 13:04

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఈ ఏడాది ఓ కొత్త సవాల్ విసిరింది. అదే స్లిమ్ గా మారడం..ప్రస్తుతం కాస్త బొద్దుగా ఉన్న ఎన్టీఆర్ ,త్రివిక్రమ్ మూవీలో లావు తగ్గి మ్యాచో లుక్ లో దర్శనం ఇవ్వనున్నాడు. అందుకోసం ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలెట్టాడు. కండలు పెంచేందుకు వర్కౌట్లు స్టార్ట్ చేశాడు. దానికి ఓ ట్రైయినర్ సాహయం తీసుకుంటున్నాడు. అది కూడా మామూలు ట్రైయినర్ కాదు బాలీవుడ్ స్టార్ హీరోలను కండల వీరుడిగా చూపించిన ట్రైయినర్ తో..