pawan kalyan

జనసేనలోకి చిరంజీవి ఎంట్రీ ...?

Submitted by arun on Sat, 07/14/2018 - 12:23

గత కొద్దికాలంగా పొలిటికల్ స్క్రీన్ పై సైలెంట్ గా ఉంటున్న చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీకి సిధ్దమవుతున్నారా జనసేనలో చిరు కీ రోల్ ప్లే చేయబోతున్నారా ఇప్పటికే మెగా అబిమానులను జనసేనలోనికి పంపిన మెగాస్టార్ తాను కూడా జనసేన స్ర్కీన్ పై కన్పించబోతున్నారా.

పవన్ వ్యూహంపై విశ్లేషకుల్లో నెలకొన్న ఆసక్తి

Submitted by arun on Sat, 07/14/2018 - 11:00

ఉత్తరాంధ్రలో పర్యటించి అక్కడి ప్రజల్లో జోష్ నింపిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఇప్పుడు గోదావరి జిల్లాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం కంటికి శస్త్ర చికిత్స చేయించుకోవడంతో రెస్ట్‌లో ఉన్న పవన్ ఈ నెల 22 నుంచి తన యాత్రను తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభించబోతున్నారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తన రాజకీయ పోరాట యాత్రను తిరిగి ప్రారంభించపోతున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలో యాత్రను పూర్తి చేసిన పవన్ నెక్ట్ గోదావరి జిల్లాల్లో యాత్ర కొనసాగించనున్నారు. 

పవన్‌ కోరితే టీడీపీకి రాజీనామా చేయిస్తా: జనసేన నేత

Submitted by arun on Thu, 07/12/2018 - 13:06

తాను జనసేనలో ఉన్నానని, తన భార్య మాత్రం టీడీపీ తరఫున గెలిచి జడ్పీటీసీ పదవిలో ఉందని చెప్పిన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నేత బర్రె జయరాజు, పవన్ కోరితే తన భార్యను టీడీపీ నుంచి రాజీనామా చేయించేందుకు సిద్ధమని అన్నారు. ఇదే విషయాన్ని పవన్ కల్యాణ్ కు సైతం చెప్పానని ఆయన మీడియాతో అన్నారు. బుధవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పార్టీ టిక్కెట్‌ ఇస్తే తాను జనసేన తరుపున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. జనసేన అధినేత ఎవరికి అవకాశం కల్పించినా వారి విజయానికి కృషి చేస్తానన్నారు. టిక్కెట్‌ ఆశించి పార్టీలో చేరలేదన్నారు. పవన్‌ సిద్ధాంతాలు, అభిమానం మీద ఆ పార్టీలో చేరానన్నారు.

పవన్ యాత్రను డిసైడ్ చేసిన జగన్.!

Submitted by arun on Thu, 07/12/2018 - 12:03

ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లాలో సాగుతుండగా, అదే జిల్లాలో తన యాత్రను తలపెట్టిన పవన్ ను పోలీసులు వారించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో యాత్రను ముగించుకున్న పవన్ కల్యాణ్, తూర్పు గోదావరి జిల్లాలో యాత్రను ప్రారంభించాలని భావించి పోలీసులకు సమాచారం అందించాడు. జగన్ యాత్ర సాగుతున్నందున పూర్తి భద్రతను అందిచలేమని పోలీసులు స్పష్టం చేయడంతో, తన నిర్ణయాన్ని మార్చుకున్న పవన్, తొలుత పశ్చిమ గోదావరి జిల్లాలో యాత్రను తలపెట్టినట్టు తెలుస్తోంది. ఈ నెల 16వ తేదీ నుంచి ఆయన యాత్ర ప్రారంభమవుతుందని సమాచారం.

ఉత్తరాంధ్రలో సేనాని మైలేజీ ఎంత?

Submitted by arun on Wed, 07/11/2018 - 14:36

ప్రభుత్వాన్ని ఎండగడుతూ విపక్షాన్ని తూలనాడుతూ స్థానిక సమస్యలపై దృష్టి పెడుతూ మాంచి జోరుగా పవన్ ఉత్తరాంధ్ర టూర్ ముగిసింది. జనసేన లోకి ఇప్పుడిప్పుడే చేరికలూ మొదలయ్యాయి..పవన్ ఉత్తరాంధ్ర టూర్ ఏం చెబుతోంది? పవర్ స్టార్ బలమెంత పెరిగింది?

నిజంగా జనసేనపై కులముద్ర వేసే కుట్ర జరుగుతోందా?

Submitted by arun on Sat, 07/07/2018 - 09:27

జనసేన అధినేత పవన్ కల్యాణ్, పోరాట యాత్ర పేరుతో ఆంధ్రప్రదేశ్‌ అంతా తిరుగుతున్నారు. భారీగా జనం తరలివస్తున్నారు. పట్టణాలు, గ్రామాలు, కొండాకోనల్లోని గిరిజనుల దగ్గరకూ వెళ్లి అందర్నీ పలకరిస్తున్నారు పవన్. తెలుగుదేశం ప్రభుత్వమే లక్ష్యంగా విమర్శల బాణాలు సంధిస్తున్నారు. ఎన్నికల హామీలు ఏమయ్యాయి అవినీతి పాలన సాగుతోందంటూ చెలరేగిపోయి మాట్లాడారు. దీంతో తెలుగుదేశం నాయకులు కూడా పవన్‌పై విరుచుకుపడుతున్నారు. జనసేన, టీడీపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.

చంద్రబాబు, జగన్‌కు పవన్ కల్యాణ్ ఓపెన్ చాలెంజ్

Submitted by arun on Sat, 07/07/2018 - 08:06

సీఎం చంద్రబాబుకు, ప్రతిపక్ష నేత జగన్‌కు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓపెన్ చాలెంజ్ విసిరారు. విశాఖ రైల్వే జోన్ కోసం.. ముగ్గురం కలిసి రైల్ రోకో చేద్దాం.. అప్పుడెందుకు రైల్వే జోన్ రాదో చూద్దామన్నారు. విశాఖ రైల్వే జోన్‌పై తనకు చిత్తశుద్ధి ఉందని.. తెలుగుదేశం నాయకులకు చిత్తశుద్ధి ఉంటే.. రాజీనామాలు చేసి ముందుకు రావాలన్నారు పవన్. విశాఖ జిల్లా తగరపువలసలో.. టీడీపీ, బీజేపీపై పవన్ విమర్శలు గుప్పించారు.
 

ఏడో తరగతిలో ఏమైందంటే..: పవన్‌

Submitted by arun on Fri, 07/06/2018 - 11:06

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉత్తరాంధ్ర పర్యటనలో బిజీగా ఉన్నారు. గురువారం విశాఖలో సభ నిర్వహించి ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించిన పవన్, సాయంత్రానికి ఆటవిడుపా అన్నట్టు ఒక సరదా పిక్‌ను పోస్ట్ చేశారు. తాను నెల్లూరులో ఏడవతరగతి చదువుతున్నప్పుడు తన అన్నయ్యలు, అక్కాచెల్లెళ్లతో దిగిన ఫొటో ఇది. అది ఆయన ఏడో తరగతిలో ఉండగా తీసుకున్న నలుపు, తెలుపు చిత్రం. అందులో ఆయన అన్నయ్యలు మెగాస్టార్‌ చిరంజీవి, నాగబాబులు ఉన్నారు. పవన్‌, అక్కా చెల్లెళ్లూ ఉన్నారు. ‘అప్పుడు మేము నెల్లూరులో ఉన్నాం. నేను ఏడో తరగతి చదువుతున్నా. చాలా కాలం బ్రాంకైటిస్‌తో బాధపడ్డా.

టీడీపీ ఎమ్మెల్యేలకు వార్నింగ్.. పిచ్చిపిచ్చి వేషాలొద్దు: పవన్

Submitted by arun on Thu, 07/05/2018 - 16:18

టీడీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పిచ్చిపిచ్చి వేషాలు వేయవద్దని టీడీపీ నేతలను హెచ్చరించారు. టీడీపీ ఎమ్మెల్యేలంటే ఏమైనా పైనుంచి దిగొచ్చారా? వాళ్లకు మేమేమైనా బానిసలమా? అని ప్రశ్నించారు. ప్రజాసేవ కోసం వచ్చినవారు, రాజ్యాంగ పరిధికి లోబడి ఉండాలని అన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్యే కొడుకు, ఎమ్మెల్యే అల్లుడు ఎవరైనా సరే పరిధికి లోబడే ఉండాలని చెప్పారు. ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేస్తామంటే చేతులు కట్టుకుని కూర్చోబోమని హెచ్చరించారు. అన్నీ వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానని పోతే ప్రాణాలే పోతాయని ధైర్యంగా అడుగువేశానని పవన్ చెప్పారు.

మాజీ మంత్రి ఇంటికి వెళ్లిన పవన్ కల్యాణ్ !

Submitted by arun on Tue, 07/03/2018 - 16:59

విశాఖ జిల్లా పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మాజీ మంత్రి దాడి వీరభద్రరావుతో భేటీ అయ్యారు. ఈ మధ్యాహ్నం అనకాపల్లిలోని దాడి నివాసానికి వెళ్లిన పవన్‌.. ఆయన ఇచ్చిన విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై వీరిద్దరూ చర్చించినట్టు సమాచారం. పవన్‌కళ్యాణ్‌కు  దాడి వీరభద్రరావు శాలువా కప్పి  ఘనంగా సత్కరించారు. వీరి భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.