kamal haasan

బాహుబలి - 2ని బీట్ చేసిన.. విశ్వరూపం 2...!  

Submitted by arun on Sat, 08/11/2018 - 18:05

భారీ అంచనాల మధ్య ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ’విశ్వరూపం -2‘. లోక నాయకుడు కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్లు చెన్నైలో దుమ్మురేపాయి. టాక్ తో సంబంధం లేకుండా బాహుబలి 2 రికార్డును కమల్ సినిమా బద్దలు కొట్టింది. ’బాహుబలి 2‘ చెన్నైలో మొదటి రోజు రూ.92లక్షల వసూళ్లు రాబట్టగా... విశ్వరూపం 2 మొదటి రోజు రూ.93లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. చెన్నైలో ఫస్ట్ డే కలెక్షన్లలో ఈ సినిమా ఆరో స్థానంలో నిలిచింది. కాలా, వివేగం,కబాలి, తేరి లాంటి సినిమాల తర్వాత విశ్వరూపం 2 ఉంది.

‘విశ్వరూపం 2‌’ మూవీ రివ్యూ

Submitted by arun on Fri, 08/10/2018 - 14:37

చిత్రం: విశ్వరూపం2
న‌టీన‌టులు: కమల్‌హాసన్‌, రాహుల్‌ బోస్‌, పూజా కుమార్‌, ఆండ్రియా, శేఖర్‌ కపూర్‌, వహీదా రెహమాన్‌ తదితరులు.
సంగీతం: మహమ్మద్‌ గిబ్రాన్‌
పాటలు: రామజోగయ్యశాస్త్రి
ఛాయాగ్ర‌హ‌ణం: శ్యాం ‌దత్, షైనుదీన్‌, షను జాన్‌ వర్గీస్
కూర్పు: మహేష్‌ నారాయణన్‌, విజయ్‌ శంకర్‌
మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి
సమర్పణ: వి.రవిచంద్రన్‌
నిర్మాతలు: ఎస్‌.చంద్రహాసన్‌, కమల్‌హాసన్
రచన, దర్శకత్వం: కమల్‌హాసన్‌
సంస్థ: రాజ్‌కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ 
విడుదల: 10-08-2018

కమలేశ్వారూపం వస్తుందోచ్

Submitted by arun on Thu, 08/02/2018 - 17:20

మరోసారి తన నటనా విశ్వరూపాన్ని
చూపాలని కమల్ పార్ట్ 2 తో సిద్ధం,
తహతహ లాడే అభిమానులంతా,
విడుదలకై నూరు కనులతో సన్నద్ధం. శ్రీ.కో

రజనీ.. కమల్ కు పోటీగా కొత్త పార్టీ

Submitted by arun on Mon, 03/12/2018 - 12:36

తమిళనాడు రాజకీయం ఇప్పుడు రంజుమీదుంది. ఓ వైపు రాజకీయాల్లో అడుగులు వేసేందుకు రజనీకాంత్ ఎత్తులు వేస్తుంటే.. అంతకు ముందే మేల్కొన్న కమల్ హసన్ మక్కల్ నీది మయ్యం అంటూ పార్టీని పెట్టి.. జనాల్లోకి వెళ్తున్నారు. ఇప్పుడు.. ఈ ఇద్దరికీ పోటీగా.. నేనున్నా అంటూ వచ్చేస్తున్నారు.. తమిళనాడు రాజకీయాలను మలుపు తిప్పిన శశికళ మేనల్లుడు దినకరన్.

మహిళలపై కమల్ హసన్ సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Fri, 03/09/2018 - 15:22

మక్కళ్ నీది మయ్యం పార్టీ పెట్టిన తర్వాత.. కమల్ హసన్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. అన్ని వర్గాల వారిని ఆకర్షించేందుకు ఆచితూచి మాట్లాడుతున్నారు. తాజాగా.. అంతర్జాతీయ మహిళా దితనోత్సవం సందర్భంగా.. చెన్నై శివారులోని ఓ ప్రయివేట్ కాలేజీ స్టుడెంట్స్ తో కమల్ ఇష్టాగోష్టి చర్చకు హాజరయ్యారు. విద్యార్థినీ విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నా హీరో : కమల్‌

Submitted by arun on Wed, 02/21/2018 - 12:41

తమిళ సీనియర్ నటుడు కమల్‌ హాసన్‌ రాజకీయ యాత్ర షురూ అయ్యింది. ఉదయం రామేశ్వరంలోని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం ఇంటికి వెళ్ళిన కమల్...కలాం సోదరుడు మహమ్మద్‌ ముతుమీర లెబ్బాయ్‌ ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయనకు చేతి గడియారం కానుకగా ఇచ్చారు. తొలిసారి కలాం ఊరికి వచ్చిన కలామ్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. కలాం కుటుంబ సభ్యుల్ని కలిశాక కమల్ హాసన్... రామేశ్వరంలో మత్య్సకారులతో సమావేశమయ్యారు. కలాం వంటి గొప్ప వ్యక్తి పుట్టిన రామేశ్వరం నుంచి రాజకీయ యాత్ర ప్రారంభించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా కమల్‌ అన్నారు.

ఒకే వేదికపై దర్శనమిచ్చిన కమల్,రజనీ

Submitted by arun on Wed, 01/17/2018 - 17:55

తమిళ సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్‌ హాసన్‌లో ఒకే వేదికపైకి వచ్చారు. ఫిబ్రవరి 21న రాజకీయ పార్టీ పేరును ప్రకటిస్తానంటూ కమల్ క్లారిటీ ఇచ్చారు. ఇది జరిగిన కొన్ని గంటలకే లోకనాయకుడు కమల్, దళపతి రజనీకాంత్‌లు ఒకే వేదికపై దర్శనమిచ్చారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌ 101 జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. రజనీకాంత్...రాజకీయ ఆరంగేట్రానికి మరికొంత సమయం పట్టేలా ఉంది. రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారని మీడియా...ప్రశ్నకు వెయిట్ అండ్ సీ అంటూ సమాధానం ఇచ్చారు. కమల్‌ హాసన్‌ రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతించారు. అంతేకాదు రాష్ట్రవ్యాప్త పర్యటనలు కూడా రాజకీయాల్లో భాగమేనన్నారు. 
 

ఇద్దరు మిత్రుల రాజకీయం తమిళనాడును ఎటు తీసుకెళ్తుంది?

Submitted by arun on Thu, 12/28/2017 - 13:26

ఇప్పుడు తమిళనాడులో కప్పల తక్కెడ రాజకీయం నడుస్తున్నది. ఆర్కేనగర్ ఉప ఎన్నికలో దినకరన్ అమ్మ జయలలితకంటే అత్యధిక మెజార్టీతో గెలవటంతో జయలలిత వారసత్వ రాజకీయం మరింత జటిలమైంది. దీంతో అన్నాడీఎంకే భవిష్యత్ ఏమిటన్నది ఎవరికీ అంతుపట్టని విషయంగా మారింది. అన్నాడీఎంకేను చింపిన విస్తరి చేయడం ద్వారా తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించాలనుకొని డీఎంకే తిరుగులేని ఎత్తుగడ వేసింది. తమ పార్టీ పత్రికకు ఆర్కే నగర్ బీట్ చూసే ఓ విలేఖరి (గణేశ్)కు టిక్కెట్ ఇవ్వటంతోనే డీఎంకే ఎత్తుగడ స్పష్టమైంది.