mahabubabad

పొలంలో జులుం...ఇద్దరు మహిళలు కుస్తీపట్లు

Submitted by arun on Fri, 08/10/2018 - 17:38

పొలం విషయంలో ఇద్దరు మహిళలు కుస్తీపట్లు పట్టుకున్నారు. తన పొలం తనకు అప్పగించాలని యజమానురాలు కోరితే ముందు తమ అప్పు తీర్చాలంటూ కౌలుదారులు ఎదురు తిరిగారు. దీంతో పొలం యజమాని కౌలు మహిళ ఘర్షణ పడ్డారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం వావిలాలలో జరిగింది.

నిప్పులపై నడిచిన ఎమ్మెల్యే.. చిన్నారులు నిప్పుల్లో నడవడంపై విమర్శలు

Submitted by arun on Thu, 12/28/2017 - 12:08

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అయ్యప్ప స్వామి వేడుకలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ నిప్పులపై నడిచారు. ఇతర భక్తులతో పాటు పిల్లలు కూడా నిప్పులపై నడిచారు. అయితే, నిప్పులపై పిల్లలు నడవడం కలకలం రేగింది. మహబూబాబాద్ లో అయ్యప్ప స్వాముల సంకీర్తనతో వీధులు మారుమ్రోగాయి. అయ్యప్ప స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే శంకర్ నాయక్ స్వామివారి రథాన్నిలాగి ఊరేగింపును ప్రారంభించారు. మిగతా స్వాములతో కలిసి ఆయన ఊరేగింపులో పాల్గొన్నారు. ఉత్సవ వేడుక చివర్లో అయ్యప్పస్వామికి ప్రధాన అర్చకుడు ప్రత్యేక పూజ చేశారు. ఒంటిపై  ఇ‌ష్టానుసారం నిప్పులు చల్లుకున్నారు. తర్వాత నిప్పులపై ఎమ్మెల్యే శంకర్ నాయక్ నడిచారు.