gang rape

దివ్యాంగురాలు అని కూడా చూడకుండా దారుణం...

Submitted by arun on Mon, 04/16/2018 - 12:51

కథువా, ఉన్నావ్ అత్యాచారాల ఘటనలు మరువకముందే విజయనగరంలో మరో దారుణం జరిగింది. ఓ దివ్వాంగురాలిని  గ్యాంగ్ రేప్ చేశారు. నెల్లిమర్ల మండలం సారిపల్లిలో సోదరి ఇంటికి వెళుతున్న దివ్యాంగురాలిపై ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్ చేశారు. తర్వాత ఆమెను నిర్మానుష్యప్రాంతంలో పడేసి పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని విజయనగరం ఆసుపత్రికి తరలించారు. 

వర్ధమాన నటిపై గ్యాంగ్‌ రేప్‌

Submitted by arun on Thu, 12/28/2017 - 17:00

దేశంలో మహిళలపై అఘాయిత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలోనే మహిళలపై అఘాయిత్యాలకు అడ్డాగా మారిన దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి కామాంధులు విరుచుకుపడ్డారు.  పలు టీవీ సీరియళ్లలో సహాయక పాత్రల్లో నటించిన మోడల్‌(23) గ్యాంగ్‌ రేప్‌కి గురైంది. పోలీసుల కథనం ప్రకారం... బిహార్‌కు చెందిన సదరు యువతి మోడలింగ్‌ కోసం ఢిల్లీకి వచ్చి స్థిరపడింది. ఈ క్రమంలో పలు సీరియళ్లలో చిన్న చిన్న పాత్రలు చేసింది. అయితే ఓ ముగ్గురు వ్యక్తులు ఆమెను కలిసి సినిమాల్లో అవకాశం ఇప్పిస్తామని ఆమెతో నమ్మబలికారు. ముంబైలో ఉన్న ఓ స్టార్‌ డైరెక్టర్‌ కొత్త వాళ్ల కోసం అన్వేషణ ప్రారంభించాడని..

ఆదివాసీ మహిళపై గ్యాంగ్ రేప్

Submitted by arun on Thu, 12/28/2017 - 11:07

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. ఆదివాసీ మహిళను కొందరు దుండగులు గ్యాంగ్ రేప్‌ చేశారు. అడవిలో కట్టెల కోసం వెళ్ళిన మహిళను చెరపట్టి అఘాయిత్యానికి పాల్పడ్డారు. బూర్గంపహాడ్ మండలం కృష్ణసాగర్ అటవీ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. నిస్సహాయురాలైన ఆమె రెండు గంటలపాటు అడవిలోనే రోదించింది. సాయంత్రం ఏడుస్తూ ఇంటికి చేరింది. కుటుంబసభ్యులు, గ్రామస్తులతో కలసి కృష్ణసాగర్‌ గ్రామానికి వచ్చి స్థానిక పెద్దల దృష్టికి తీసుకెళ్లింది. స్థానికులు అంబులెన్స్‌ సహాయంతో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. సుమారు ఇరవై ఐదేళ్ల వయసున్న బాధితురాలికి ఇద్దరు చిన్నపిల్లలు, భర్త ఉన్నారు.