chiranjeevi

చిరు, రాజమౌళి సినిమా ?

Submitted by arun on Wed, 11/14/2018 - 13:10

మెగస్టార్ చిరంజీవి స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా రాబోతుందా ఫిలిమ్ నగర్ లో ఈ విషయాం పై చర్చలు జరుగుతున్నాయి ప్రస్తుతం చిరు సైరా నరసంహారెడ్డి సినిమా చేస్తున్నాడు. ఇది దాదాపు సినిమా లాస్ట్ స్టేజ్ లో వుంది దీని తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో చిరు ఓ సినిమా చేస్తున్నారు. అది ఈ డిసెంబర్ చివరిలో ప్రారంభం అవుతుంది. అయితే చిరు మరో పెద్ద ప్రాజెక్ట్ చేయబోతున్నాడని తెలుస్తుంది రాజమౌళి ఆర్ ఆర్ ఆర్  సినిమా కంప్లీట్ అయ్యాక  చిరు రాజమౌళి కాంబినేషన్ స్టార్ట్ అవుతుందంటున్నారు ఓ మంచి సోషల్ మెసేజ్ కథతో మెగస్టార్ ,రాజమౌళి కలసి చేయబోతున్నారంటున్నారు.

మన వూరి పాండవులు

Submitted by arun on Tue, 10/30/2018 - 17:03

కొన్ని సినిమాలు కలకాలం అలా నిలిచిపోతాయి..అలా నిలిచిపోయిన మరో చిత్రమే.. మన వూరి పాండవులు .మన వూరి పాండవులు బాపు దర్శకత్వంలో, ముళ్ళపూడి వెంకటరమణ రచయితగా కృష్ణంరాజు, మురళీమోహన్, చిరంజీవి, ప్రసాద్ బాబు, రావుగోపాలరావు ప్రధానపాత్రల్లో నటించిన 1978 నాటి తెలుగు చలనచిత్రం. ఈ సినిమా మహాభారతానికి ఆధునిక కథనం. మొదట ఈ సినిమాను పుట్టణ్ణ కణగాల్ కన్నడలో పడువారళ్ళి పాండవరు పేరుతో తీశాడు. బాపు ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో సంజీవ్ కుమార్, మిథున్ చక్రవర్తి మొదలైన వారితో హమ్‌ పాంచ్ పేరుతో పునఃసృష్టించాడు. శ్రీ.కో.

ఆ డాన్స్ మాస్టర్ చిరుని ఇంప్రెస్ చేయలేకపోతున్నాడంటా ?

Submitted by arun on Tue, 10/30/2018 - 10:37

మెగస్టార్ చిరంజీవిని ఓ డ్యాన్స్ మాస్టర్ కొరియోగ్రఫి బాగా నిరాశ పరిచిందంటా..డ్యాన్స్ల్ లకు కేరఫ్ అడ్రస్ మెగస్టార్ చిరంజీవి. నిన్నటి తరం హీరోల నుండి నేటి తరం హీరోల వరకు చిరు డ్యాన్స్ చూసి నేర్చుకోవాలసిందే. ఆయన స్టెప్ వేస్తే చాలు కుర్ర కారు గెంతులు వేయాలసిందే ఎలాంటి డ్యాన్స్ స్టెప్ప్ అయిన చిరు చాలా ఈజీగా వేస్తుంటారు. ఖైదీ నెంబర్ 150 లో చిరు వేసిన అమ్మడు లెట్స్ కుమ్ముడు లో షూ లెస్ స్టెప్ ఇంకా మెగ అభిమానుల గుండెల్లో అలా మెదులుతునే వుంది.

ఇక క్లాప్ కొట్టడమే

Submitted by arun on Mon, 10/29/2018 - 14:41

‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తర్వాత మెగస్టార్ చిరంజీవి చేయబోయ్యే సినిమా పై అప్పుడే మెగా అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో చర్చ మొదలైంది. ఠాగూర్, స్టాలిన్, శంకర్ దాదా, ఇంద్ర లాంటి కమర్సియల్ సందేశత్మాక చిత్రాల్లో నటించి మెగా అభిమానులనే కాదు టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసారు చిరు. ఇప్పుడు మరో  సందేశత్మాక చిత్రాల్లో నటించబోతున్నారు.. దర్శకుడు కొరటాల శివ కూడా చిరంజీవి కోసం అటువంటి కథను సిద్ధం చేసారు. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్‌’, ‘భరత్‌ అనే నేను’... కొరటాల దర్శకత్వం వహించిన చిత్రాలు నాలుగంటే నాలుగే. కానీ, ఇటు సందేశం, అటు కమర్షియల్ జోడించి ప్రేక్షకులు మెచ్చే విధంగా  తీసారు కొరటాల.

పసివాడి ప్రాణం.. చిరంజీవి

Submitted by arun on Mon, 10/22/2018 - 13:44

పసివాడి ప్రాణం.. చిరంజీవి కెరీర్ లో ఒక బ్లాక్ బస్టర్ చిత్రం. ఈ చిత్రం ద్వారా తెలుగు తెరపై మొట్టమొదటి సారిగా బ్రేక్ డ్యాన్స్ చేసిన ఘనత చిరంజీవికి దక్కింది. చక్కని చుక్కల సందిట బ్రేక్ డ్యాన్స్ అనే పాట అప్పట్లో అందరిని చిందేయించింది.. మలయాళంలో మమ్ముట్టి నటించిన పూవిన్ను పుదియ పూంతెన్నాల్ ఈ చిత్రానికి మూలం.

కాంగ్రెస్‌ పార్టీకి దూరంగా చిరంజీవి

Submitted by arun on Tue, 10/16/2018 - 12:27

మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని చిరంజీవి పునరుద్ధరించుకోలేదు. పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాల వల్లే కాంగ్రెస్‌కు చిరు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ కాలపరిమితి ముగియగా.. దాన్ని పునరుద్ధరించుకోలేదు. దీంతో ఆయన ఆ పార్టీకి దూరమైనట్లేనని తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున పార్టీలో క్రియాశీలకంగా ఉండాలని ఇటీవల రాహుల్‌గాంధీ.. చిరంజీవిని కోరినట్లు తెలుస్తోంది. దీనికి ఆయన నుంచి స్పందన లేనట్లు సమాచారం. దీంతో ఆయన కాంగ్రెస్‌ పార్టీకి ఇక దూరమైనట్లేనని భావిస్తున్నారు.
 

ఎన్టీఆర్, చిరంజీవి కలిసి నటించిన ఏకైక చిత్రం

Submitted by arun on Tue, 10/02/2018 - 16:54

మహా నటుడు ఎన్టీఆర్ గారు మరియు మెగాస్టార్  చిరంజీవి కలిసి నటించిన ఏకైక చిత్రం ఏదో మీరు విన్నారా! ఆ చిత్రం “తిరుగులేనిమనిషి” అనే చిత్రం. ఈ సినిమా దేవీఫిలింప్రొడక్షన్స్ లో దర్శకుడు కే.రాఘవేంద్రరావుగారి దర్శకత్వంలో వచ్చింది...ఇందులో ఇంకా ఫటాఫట్ జయలక్ష్మి, సత్యనారాయణ, జగ్గయ్య, ముక్కామల,అల్లు రామలింగయ్య, అత్తిలి లక్ష్మి, జయలక్ష్మి. శ్రీలక్ష్మి, శ్యామల, బాబ్ క్రిస్టో, మాస్టర్ ప్రసాద్ వీరందరు కుడా నటించారు. శ్రీ.కో.

చిరంజీవి గోలిమార్ పాట

Submitted by arun on Fri, 09/28/2018 - 14:51

మైఖల్ జాక్సన్ పాట... డాన్స్ అంటే ప్రపంచంలో చాలామందికి ఇష్టం...అతని వల్ల ప్రబావితం అయి చాలామంది.. డాన్స్ నేర్చుకున్నారు.. అలా డాన్స్ తో ప్రబావితం అయినవారిలో మన మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు.. అయితే.. మన చిరంజీవి నటించిన “దొంగ” తెలుగు సినిమాలోని గోలిమార్ పాటని ల్యాటిన్ అమెరికా, ఐరోపా దేశస్థులు చాల ఇష్ట పడతారట. మన చిరు చిందేస్తే..ఎవ్వరైనా కదిలిపోవల్సిదే. శ్రీ.కో.
 

చిరంజీవి అసలు పేరు

Submitted by arun on Fri, 09/14/2018 - 12:34

మెగాస్టార్ చిరు గా పిలుచుకునే చిరంజీవి అసలు పేరు మీకు తెలుసా? చిరు అసలు పేరు “శివ శంకర వర ప్రసాద్” గా ఆయన పేరు పెట్టారు. తను  ఆగస్టు 22, 1955 న మోగుల్టోరులో జన్మించాడు. తను ఒన్గోల్ జూనియర్ కాలేజీలో తన ఇంటర్మీడియట్ అధ్యయనాలు చేశాడు. ఆ తర్వాత  నార్సాపూర్ వైయస్ ఆర్ కాలేజీలో తన B.Com చేశాడు. అక్కడి నుండి సైరా వరకు పెద్ద ప్రయాణమే చేసారు. ఇక సైర విడుదల కోసం అభిమానులు ఎదురు చుస్తున్నారు. శ్రీ.కో.