andhra pradesh

విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Mon, 06/18/2018 - 15:57

విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రం మళ్లీ పాత పాటే పాడింది. రైల్వే జోన్‌ ఇవ్వడం ఇష్టం లేదన్నట్టుగా రైల్వే మంత్రి పీయూష్ గోయల్ వింత వ్యాఖ్యలు చేశారు. రైల్వే జోన్ కావాలని అడిగే వారు చట్టంలో ఏముందో చూడాలన్నారు. విభజన చట్టంలో రైల్వే జోన్‌ అంశం పరిశీలించాలని మాత్రమే ఉందని, పరిశీలిస్తూనే ఉన్నామని చెప్పారు. ఇదే విషయాన్ని పార్లమెంట్‌లో కూడా చెప్పామని పీయూష్ సమర్ధించుకున్నారు.

ఎంపీలు, మంత్రుల భేటీలో చంద్రబాబు కీలక నిర్ణయాలు

Submitted by arun on Sat, 06/16/2018 - 11:42

విభజన హామీలపై పోరుకు టీడీపీ మళ్ళీ సిద్ధమౌతోంది.వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో మరోసారి కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలని పార్లమెంట్‌ను స్తంభింపజేయాలని నిర్ణయించింది. ఎంపీలు, మంత్రులతో భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

ఏపీ హోంగార్డులకు శుభవార్త

Submitted by arun on Fri, 06/15/2018 - 16:10

హోంగార్డుల దినసరి వేతనం మూడు వందల నుంచి ఆరు వందల రూపాయలకు పెంచుతున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. హోంగార్డుల మెటర్నిటీ సెలవులను మూడు నెలలకు పెంచుతునట్లు తెలిపారు. అమరావతిలో సీఎం చంద్రబాబును కలిసి హోంగార్డులు తమ సమస్యలను చెప్పుకున్నారు. ఇందుకు స్పందించిన ముఖ్యమంత్రి.. వెంటనే పలు నిర్ణయాలను ప్రకటించారు. హోంగార్డులకు జీతం పెంపుతో పాటు..రెండున్నర లక్షల రూపాయల వైద్య సేవలు అందిస్తామన్నారు. గృహనిర్మాణ పథకంలో హోంగార్డులకు ఇళ్ల కేటాయింపు విషయం పరిశీలించాలని సీఎం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. 

2019 నాటికి పోలవరం పూర్తిచేస్తాం: చంద్రబాబు

Submitted by arun on Mon, 06/11/2018 - 16:55

2019 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన డయాఫ్రంవాల్‌ పూర్తయిన సందర్భంగా చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా పైలాన్‌ను ఆవిష్కరించారు. పోలవరం నిర్మాణంలో డయాఫ్రంవాల్‌ పూర్తిచేయడం ఓ చరిత్ర అని.... పోలవరం పూర్తయితే 7 లక్షల ఎకరాలకు నీరందుతుంది తెలిపారు. ఎవరెన్ని అడ్డంకులు పెట్టినా సకాలంలో ప్రాజెక్టు పూర్తి చేస్తామని సీఎం స్పష్టం చేశారు. నిర్మాణంలో పాలుపంచుకుంటున్న కార్మికులు, ఇంజినీర్లు, కాంట్రాక్టర్లను అభినందించారు.

చంద్రబాబును ఓడించడం ఈజీ కాదు : బీజేపీ

Submitted by arun on Sat, 06/09/2018 - 14:49

‘చంద్రబాబును ఓడించడం మామూలు విషయం కాదు. ఆయన్ని ఓడించడానికి ముందు చాలా శక్తులను ఓడించాలి. ఇంకా ఎన్నో ప్రణాళికలు వేయాల్సి ఉంది. ఆయనను మళ్లీ ముఖ్యమంత్రి కానివ్వకుండా చేయడమే మా ధ్యేయం’’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు పేర్కొన్నారు. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే తన అస్తిత్వానికే ముప్పువుంటుందని, అందుకే తనదైన శైలిలో రాజకీయ క్రీడను చంద్రబాబు మొదలుపెట్టారని అన్నారు. ఎన్నికలను ఆరునెలల ముందు ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వస్తుందని తాము అనుకున్నామని, కానీ, తమ అంచనాలకు భిన్నంగా ఏడాదికి ముందే చంద్రబాబు బయటకువచ్చారని తెలిపారు.

కృష్ణాజిల్లాకు పిడుగుల హెచ్చరిక

Submitted by arun on Sat, 06/02/2018 - 15:42

ఆంధ్ర ప్రదేశ్‌కు మరోసారి పిడుగు ముప్పు పొంచి ఉంది. కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాలకు పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. చాట్రాయి, విసన్నపేట, తిరువూరు, ఎ.కొండూరు, వత్సవాయి, ఆగిరిపల్లి, విజయవాడ రూరల్ మండలాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 

చిత్తూరు జిల్లా చంద్రగిరిలో శ్రీకృష్ణదేవరాయల వారి కోటపై పిడుగు పడింది. పిడుగు ధాటికి....రాజగోపురం పెచ్చులూడిపోయింది. ఎత్తయిన రాజగోపురంపై పిడుగులు పడకుండా అధికారులు చర్యలు తీసుకోకపోవడం వల్లే అపురూప కట్టడం పాడవుతోందని పర్యాటకులు విమర్శించారు.

సెల్ఫీ కోసం గూడ్స్ రైలు ఎక్కిన యువకుడు

Submitted by arun on Wed, 05/30/2018 - 16:53

ట్రైన్‌‌తో సెల్ఫీ దిగుతూ మరో యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట శివారులో చోటు చేసుకుంది. పట్టాలపై గూడ్స్ రైలు ఆగి ఉండడంతో ట్రైన్ ఎక్కి సాయి అనే యువకుడు సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. ప్రమాదవశాత్తూ హైటెన్షన్‌ విద్యుత్ తీగలు తగలడంతో సాయికి తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటినా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. 

ఇది మహానాడు చరిత్రలో మరో రికార్డు: మంత్రి లోకేష్

Submitted by arun on Tue, 05/29/2018 - 17:22

బీజేపీ, వైసీపీ కుమ్మక్కయ్యాయని తాను ఎప్పటి నుంచో చెప్తున్నానన్నారు ఏపీ మంత్రి లోకేశ్. బీజేపీని శత్రువని ముందే చెప్పానని తెలిపారు. మహానాడుకు గతేడాది కంటే 33 శాతం ఎక్కువగా వచ్చారన్న ఆయన.. ఇది మహానాడు చరిత్రలోనే మరో రికార్డు అన్నారు. టీడీపీకి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందన్న భయం.. కార్యకర్తల్లో కనిపిస్తోందని.. మంత్రి లోకేశ్ మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో చెప్పారు. పార్టీని రక్షించుకోవాలన్న తపన కార్యకర్తల్లో ఉందని.. నేతల్లో ఉన్న నిరుత్సాహం తొలగిస్తున్నామని చెప్పారు లోకేశ్.

ఇక సీఎం పదవి చాలు, ఇకపై

Submitted by arun on Tue, 05/29/2018 - 15:32

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఉన్నంత దూరదృష్టి ఎవరికీ లేదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఈరోజు విజయవాడలో జరుగుతోన్న మహానాడులో ఆయన మాట్లాడుతూ... "చంద్రబాబు మాట్లాడితే నేనిక్కడే ఉంటానని అంటారు.. ఏంది సర్ నాకు అర్థం కాదు. ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా పని చేశారు.. ఇక చాలదా మీకు? ఇంకా ఆశ ఉందా? వద్దు.. మీరు ఇంకా పైకి రావాలి.. దేశానికి ప్రధానమంత్రి కావాలి.. మేమంతా సంతోషిస్తాం.చాలామంది కుటుంబ పాలన అంటూ మాట్లాడుతున్నారని, టీడీపీని చంద్రబాబే ఈ స్థాయికి తీసుకొచ్చారని ఒక్క ముక్కలో తేల్చేశారు. రేపటి రోజున లోకేశ్‌ సీఎం అయితే ఏమవుతుంది? ఆయన సమర్థుడే కదా?

మరికొన్ని గంటల్లో తేలిపోనున్న వైసీపీ ఎంపీల రాజీనామాల వ్యవహారం

Submitted by arun on Tue, 05/29/2018 - 11:05

రాజీనామాల విషయంలో.. వైసీపీ ఎంపీలకు లోక్‌సభ స్పీకర్ ఆఫీస్ నుంచి పిలుపొచ్చింది. స్పీకర్ సుమిత్ర మహాజన్‌.. ఎంపీల రాజీనామాలను ఆమోదిస్తారా.. లేదా.. అన్నది నేడు సాయంత్రానికి తేలిపోతుంది. మరి.. వైసీపీ ఎంపీలు రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్‌పై  ఒత్తిడి తెస్తారా.. సైలెంట్‌గానే ఉంటారా.. అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.