nellore

గొంతులో పెన్ను

Submitted by arun on Fri, 08/10/2018 - 12:29

పెన్ను క్యాప్ ఓ చిన్నారి ప్రాణాలు తీసింది. స్కూల్లో పెన్ను క్యాప్‌తో ఆడుకొంటున్న బాలుడు దానిని పొరపాటున మింగి మృత్యువాత పడ్డాడు. ఈ విషాద ఘటన నెల్లూరు జిల్లా సీతారామపురంలో జరిగింది. నెల్లూరు జిల్లా సీతారామపురానికి చెందిన వినయ్ మూడో తరగతి చదువుతున్నాడు. ఉదయం స్కూలుకు వెళ్ళిన వినయ్ గ్రౌండ్‌లో ఆడుకొనే సమయంలో పెన్ను క్యాప్‌‌ను నోట్లు పెట్టుకున్నాడు. అది పొరపాటున గొంతులో ఇరుక్కుపోవడంతో వినయ్ ఊపిరాడక చాలాసేపు ఇబ్బంది పడ్డాడు. విషయం గమనించిన ఉఫాద్యాయులు వినయ్ గొంతులో ఉన్న పెన్ను క్యాప్ తీయడానికి విఫల యత్నం చేశారు. తర్వాత ఆ బాలుణ్ణి ఆస్పత్రికి తరలించగా అతను చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు.

వివాహేతర సంబంధం...నాలుగేళ‌్ల బాలుడిని గొంతు నులిమి చంపిన మహిళ

Submitted by arun on Wed, 08/01/2018 - 10:56

నెల్లూరు జిల్లాలో మానవత్వం మంటగలిసింది. పెద్దల మధ్య ఏర్పడిన అనాలోచిత వివాహేతర సంబంధం ముచ్చుపచ్చలారని చిన్నారి ప్రాణాలను బలిగొంది. బాలాజీరావుపేటకు చెందిన రత్నమ్మ అనే మహిళ నాలుగేళ్ల బాలుడిని గొంతు నులిమి దారుణంగా హత్య చేసింది.  బాలుడి తండ్రితో గతంలో రత్నమ్మకు వివాహేతర సంబంధం ఉండేది. అయితే ఈ విషయం ఇంట్లో తెలియడంతో గత కొద్ది కాలంగా రత్నమ్మకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. దీంతో కాలనీలో ఎవరూ లేని సమయంలో బాలుడిని ఇంట్లోకి తీసుకెళ్లి గొంతు నులిమి చంపిన రత్నమ్మ  ఇంట్లోనే గోనె సంచిలో దాచి ఉంచింది. బాలుడు కనిపించకపోవడంతో పోలీసులు తల్లిదండ్రులు ఆశ్రయించారు.

ఇంతకీ ఆనం కుటుంబంలో ఏం జరుగుతోంది..?

Submitted by arun on Tue, 07/24/2018 - 11:26

నెల్లూరు రాజకీయాలను శాసించిన ఆనం కుటుంబం వివేకా మరణం తర్వాత సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు ఎన్నికల ఏడాది కావడంతో  ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న ఆనం కుటుంబం మళ్లీ రాజకీ యంగా క్రియాశీలకంగా మారుతోంది. వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్న ఆనం వెంట ఆయన కుటుంబం మొత్తం నడుస్తుందా? ఆనం వివేకా కుటుంబం కూడా తమ్ముడి వెంట ఉంటుందా? ఇంతకీ ఆనం కుటుంబంలో ఏం జరుగుతోంది..?

తారాస్థాయికి చేరిన కలెక్టర్ ఎమ్మెల్యేల వివాదం

Submitted by arun on Fri, 07/13/2018 - 11:15

నెల్లూరు జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు ఎమ్మెల్యే కాకాణి వివాదం తారా స్ధాయికి చేరింది. కలెక్టర్‌తో కాకాణి వ్యవహరించిన తీరును నిరసిస్తూ ఉద్యోగులు సామూహిక సెలవులో వెళ్లారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు మూతబడ్డాయి. గత వారం రోజులుగా చోటు చేసుకున్న ఘటనలను తెలియజేస్తూ కలెక్టర్ ముత్యాలరాజు సమగ్ర నివేదకను సిద్ధం చేశారు. అయితే ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించినందుకే తనపై దాడి చేస్తున్నారంటూ ఎమ్మెల్యే కాకాణి ఆరోపించారు. ఉద్యోగుల, కుల సంఘాలను రెచ్చగొట్టి తనపై ఆరోపణలు చేయిస్తున్నారంటూ విమర్శించారు.  

ఆనం పార్టీ మారడం ఖాయం...జూలై 8న...?

Submitted by arun on Thu, 06/14/2018 - 17:39

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి త్వరలో టీడీపీని వీడనున్నట్లు సమాచారం. వైసీపీలో చేరేందుకు ఆయన దాదాపు రంగం సిద్ధం చేసుకున్నారు. జూలై 8న వైఎస్‌ జయంతి సందర్భంగా ఆ పార్టీలో చేరతారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. టీడీపీలో రామనారాయణను కొనసాగించేందుకు టీడీపీ నేతలు జరిపిన బుజ్జగింపులు ఫలించలేదు. గత రెండు, మూడు రోజులుగా అభిమానులు, సన్నిహితులతో ఆయన సమావేశాలు నిర్వహించారు. పార్టీ మారాలనుకోవడానికి కారణాలు వివరిస్తూ, వారి మద్దతును కూడగట్టుకునే ప్రయత్నం చేశారు.

ప్రొఫెసర్‌ పాడుపని

Submitted by arun on Thu, 06/14/2018 - 16:40

నెల్లూరు మెడికల్ కాలేజీ మరోసారి వార్తల్లో నిలిచింది..  ర్యాంగింగ్.. విధుల్లో నిర్లక్ష్యం.. అవినీతి ఆరోపణలతో జిల్లా పరువు పోగొట్టిన వైద్యులు తాజాగా  మరో వివాదంలో నిలిచారు.. మెడికల్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్న ఎంబీబీఎస్ విద్యార్ధిని పట్ల అసోసియేట్  ప్రొఫెసర్ చంద్రశేఖర్ లైంగిక వేధింపులకు గురిచస్తున్నాడని విద్యార్దిని కుటుంబ సభ్యులు అతనిపై దాడి చేశారు.. మెడికల్ కాలేజీలో హెచ్.వో.డీల సమావేశం జరుగుతున్న సమయంలో మీటింగ్ హాల్లోకి వెళ్ళిన  విద్యార్దిని సోదరుడు ప్రొఫెసర్ పై చేయి చేసుకున్నాడు. 

టీడీపీకి మాజీ మంత్రి ఆనం గుడ్ బై..?

Submitted by arun on Mon, 06/04/2018 - 11:19

నెల్లూరు జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎప్పుడు ఎవరు ఏ గట్టుకి చేరతారో తెలియని పరిస్థితి. తాజాగా ఆనం రాంనారాయణ రెడ్డి కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ఆయన టీడీపీని వీడటం ఖాయమని విశ్వసనీయ సమాచారం. అనుచరులు కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతున్న ఆనం ఇప్పటికే రాజీనామా లేఖను కూడా సిద్ధం చేసుకున్నట్టు సమాచారం.  

దివాళా తీసిన మేయర్ అబ్దుల్ అజీజ్ స్టార్ అగ్రో సంస్థ

Submitted by arun on Sat, 02/10/2018 - 14:19

నెల్లూరు కార్పొరేషన్ మేయర్‌ అబ్దుల్ అజీజ్‌‌కు చెందిన స్టార్ అగ్రో మెరైన్‌ ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్‌ సంస్థ దివాళా తీసింది. స్టార్ అగ్రో సంస్థ దివాళా తీసినట్లు నేషనల్ కంపెనీస్‌ లా ట్రిబ్యునల్‌ సంస్థ ప్రకటించింది. దీంతో అబ్దుల్ అజీజ్‌ కంపెనీ ఆర్థిక వ్యవహరాలు హాట్‌ టాపిక్‌గా మారాయ్.

నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం

Submitted by arun on Sun, 01/14/2018 - 12:11

పండగపూట  పొగమంచు ఓ ఇంట విషాదాన్ని నింపింది. నెల్లూరు జిల్లాలో ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. టీపీ గూడూరు మండలం వెంకన్నపాలెం గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు కారులో తమిళనాడు రాష్ట్రంలోని వేళంగిని దేవాలయానికి వెళ్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న కారు ఎన్టీఆర్ నగర్ దగ్గర హైవేపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురు మృతిచెందారు. కాగా... సమాచారమందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకున్నారు. 

మద్యం మత్తులో రెచ్చిపోయిన హోంగార్డ్

Submitted by arun on Sun, 12/17/2017 - 15:28

నెల్లూరు జిల్లాలో ఓ హోంగార్డు మద్యం మత్తులో రెచ్చిపోయాడు. ఫూటుగా మద్యం సేవించి కానిస్టేబుల్‌నంటూ ఓ వ్యక్తిని చితక్కొట్టేశాడు. బాధితుడు కాళ్లు పట్టుకున్నా వదల్లేదు. బండ బూతులు తిడుతూ బస్టాండ్‌లో పరిగెత్తించి కొట్టాడు. దూరదర్శన్‌లో హోంగార్డ్‌‌గా పని చేస్తున్న నరేశ్‌ అల్లూరు నుంచి నెల్లూరు వస్తుండగా బస్సులో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీన్ని ప్రశ్నించిన ఓ వ్యక్తిని నా జోలికి వస్తావా ? నేను కానిస్టేబుల్‌నంటూ బూతు పురాణం అందుకున్నాడు. బస్టాండ్‌లోని షాపులోకి సదరు వ్యక్తి వెళ్లడంతో వెంటపడి కొట్టాడు. కాళ్లు పట్టుకోమని చితక్కొట్టాడు. బాధితుడు కాళ్లు పట్టుకున్నా వదిలిపెట్టలేదు.