karunanidhi

కరుణానిధి వేషంలో పార్లమెంట్‌కు వచ్చిన ఎంపీ శివప్రసాద్‌

Submitted by arun on Fri, 12/14/2018 - 13:18

ప్రదాని మోడీపై మరోసారి నిప్పులు చెరిగారు చిత్తూరు ఎంపీ శివప్రసాద్. రోజుకో వేషంతో కేంద్రానికి నిరసనలు తెలుపుతున్న శివప్రసాద్ ఇవాళ కరుణానిధి వేషంలో పార్లమెంటుకు వెళ్లారు. మోడీ ఏపీకి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలంటూ కరుణానిధి మాదిరిగా డైలాగ్‌లు విసిరారు. స్నేహంలో కర్ణుడిలా, సత్యవాక్కు పాలనలో హరిశ్చంద్రుడిలా మెలగాలంటూ నరేంద్రమోడీకి సూచించారు. మాటలు చెప్పి చంద్రబాబుని మోసగించారని, ఏపీ ప్రజలు అందుకు తగిన శాస్తి చేస్తారని మోడీపై మండిపడ్డారు ఎంపీ శివప్రసాద్. ప్రధాని మోడీ టైటానిక్‌ షిప్‌లాంటి వారని ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ముంచేశారని ఎంపీ శివప్రసాద్‌ ఆరోపించారు. 

కరుణానిధి చనిపోయినట్లు రెండో భార్యకు తెలియదు!

Submitted by arun on Thu, 08/09/2018 - 10:21

తన భాగస్వామి తిరుగురాని లోకాలకు చేరుకున్న విషయం, ఆ జీవనసహచరికి తెలియదు. కళ్లముందే భర్త ఆఖరి మజిలీ మొదలవుతున్నా.. ఏమాత్రం గుర్తించలేని స్థితి ఆమెది. డీఎంకే అధినేత కరుణానిధి కన్నుమూత, తీవ్ర అస్వస్థతతో ఉన్న ఆయన రెండవ భార్య దయాళు అమ్మాళ్‌కు తెలియదు. 2016 నుంచే ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. కళ్ల ముందు ఏం జరుగుతుందో గ్రహించలేని స్థితిలో ఉన్న ఆమెకు, జ్ఞాపకశక్తి కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. కరుణ ఆరోగ్యం విషమించిన నేపథ్యంలో.. మూడు రోజుల క్రితం పెద్ద కుమారుడు అళగిరి ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చి కరుణ వద్ద కొంతసేపు వుంచి ఇంటికి తీసుకెళ్లారు.

కరుణానిధి అంత్యక్రియలు పూర్తి

Submitted by arun on Wed, 08/08/2018 - 19:01

కరుణానిధి అంత్యక్రియలు మెరీనా బీచ్‌లో అన్నా మెమోరియల్ హాల్‌ ముగిశాయ్‌. ఆశ్రునయనాల మధ్య ద్రవిడ ఉద్యమ నేతకు కన్నీటితో వీడ్కోలు పలికారు. ప్రభుత్వలాంఛనాలతో కరుణానిధి అంత్యక్రియలు జరిగాయ్. చివరిసారి కరుణ భౌతిక కాయాన్ని చూసి స్టాలిన్‌, అళగిరి, కనిమొళి, ఇతర కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మెరీనా బీచ్‌‌లోని జరిగిన అంత్యక్రియలకు పలువురు ముఖ్యమంత్రులు, జాతీయ స్థాయి రాజకీయ నేతలు హాజరయ్యారు. 

అత్యంత సుదీర్ఘమైన సీరియల్

Submitted by arun on Wed, 08/08/2018 - 17:11

ప్రపంచంలో అత్యంత సుదీర్ఘమైన సీరియల్ ఎవరు రాసింది అని మీరు వెతికితే, ఒక ఆశ్చర్యం అనిపించే విషయమేమీ అంటే, మన తమిళ నాయకుడు కరుణానిధిగారికే ఆ అవకాశం దక్కింది.  తన పార్టీ అధికారిక పత్రిక 'మురసోలి'లో రాసాడు. శ్రీ.కో
 

జయలలిత సమాధి పక్కనే..

Submitted by arun on Wed, 08/08/2018 - 16:56

కరుణానిధి-జయలలిత. తమిళ రాజకీయాల్లో బద్ద శత్రువులు. ఒకరిపై ఒకరు కుట్రలు పన్నుకున్న నాయకులు. వాళ్లిద్దరూ అసెంబ్లీలో ఉన్నారంటే, అదొక యుద్ధం. శాసన సభ రణక్షేత్రాన్ని తలపిస్తుంది. మాటల తూటాలు, ఎత్తుకుపైఎత్తులు, వాగ్దానాలపై వాగ్భాణాలు. తమిళ రాజకీయాల్లో ఇద్దరి శత్రుత్వం ఒక చెరగని పేజి. అలాంటిది ఇప్పుడు ఆ జయలలిత సమాధి పక్కనే కరుణానిధి కూడా శాశ్వతంగా విశ్రాంతి తీసుకోబోతున్నారు. డీఎంకే పార్టీ దగ్గర ఉన్న ప్లాన్ ప్రకారం కరుణానిధిని ఖననం చేసే చోటు ఆయన గురువు అన్నాదురై, జయలలిత సమాధుల మధ్య ఉంది. మొదట్లో మరీనా బీచ్‌లో కరుణానిధి ఖననానికి తమిళనాడు ప్రభుత్వం అంగీకరించని విషయం తెలిసిందే.

కరుణానిధి శవపేటిక మీద ఏం రాశారు?

Submitted by arun on Wed, 08/08/2018 - 16:43

కరుణానిధిని ఉంచే శవపేటిక మీద తమిళంలో రాసి ఉన్న మాటలు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. బంగారంతో పోత పోసిన శవపేటిక మీద ఇలా రాసి ఉంది. ‘విరామమన్నది ఎరుగక, నిరంతరం కృషి చేసిన వ్యక్తి ఇక్కడ విశ్రమిస్తున్నాడు’.. ఈ మాటలు కరుణానిధికి వర్తించినంత బాగా ఇంక ఎవరికి వర్తించవేమో. అందుకే శాశ్వత నిద్రలోకి జారుకుని విశ్రమిస్తోన్న ‘కలైజ్ఞర్‌’ శవపేటిక మీద ఈ మాటలనే చెక్కించారు. ఒకానొక సందర్భంలో కరుణానిధి తన కుమారుడు స్టాలిన్‌తో ‘మన సమాధి చూసిన జనాలు విశ్రాంతి అన్నది ఎరగకుండా పనిచేసిన వ్యక్తి ప్రస్తుతం ఇక్కడ సేద తీరుతున్నారని’ అనుకోవాలని చెప్పారట. ఈ మాటలు కరుణానిధికి సరిగ్గా సరిపోతాయి.

ఇదీ కరుణానిధి... చక్రాల కుర్చీ కథ

Submitted by arun on Wed, 08/08/2018 - 16:28

డీఎంకె చీఫ్ కరుణానిధికి నల్ల కళ్లజోళ్లతో ఎలా విడదీయరాని బంధం ఉందో.... చక్రాల కుర్చీతో కూడ అంతే బంధం ఉంది. ఆసుపత్రిలో చేరాల్సి వస్తోందని భావించి వెన్నునొప్పిని నిర్లక్ష్యం చేయడంతో  కరుణానిధి చక్రాల కుర్చీకే పరిమితం కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.చక్రాల కుర్చీకే పరిమితమైన  ఆసుపత్రి నుండే ఆయన పాలనను సాగించారు. 2008 డిసెంబరు నుంచి కరుణానిధికి వెన్నునొప్పి ఇబ్బంది పెట్టింది. అయితే ఆస్పత్రికి వెళ్తే అడ్మిట్‌ చేస్తారనే అభిప్రాయంతో ఎవరితోనూ చెప్పకుండా దానిని భరిస్తూనే వచ్చారు.

కరుణ పార్థివదేహం వద్ద పిడికిలి బిగించిన కేసీఆర్!

Submitted by arun on Wed, 08/08/2018 - 15:57

రాజాజీ హాల్‌లో పోరాట యోధుడు, ద్రవిడ ఉద్యమ సారథి, డీఎంకే అధ్యక్షుడు ముత్తువేల్ కరుణానిధి(94) భౌతికకాయానికి తెలంగాణ‌ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు నివాళులర్పించారు. సీఎం వెంట ఎంపీ కవిత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. నివాళి అర్పించిన అనంతరం... జోహార్ కరుణానిధి అంటూ పిడికిలి బిగించారు కేసీఆర్. అనంతరం కరుణానిధి కుటుంబసభ్యులను కేసీఆర్ పరామర్శించారు. అంత‌కుముందు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం నుంచి సీఎం కేసీఆర్ చెన్నై చేరుకున్నారు. రాజాజీ హాల్ నుంచి సాయంత్రం 4 గంటల నుంచి అంతిమయాత్ర ప్రారంభంకానుంది.

ఎన్నో రాజకీయ పరిణామాలకు సజీవ సాక్ష్యం.. ఆ బిల్డింగ్‌

Submitted by arun on Wed, 08/08/2018 - 15:46

చెన్నైలోని గోపాలపురం డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి ఉండే నివాసం. ఎన్నో పరిణామాలకు సజీవ సాక్ష్యంగా నిలిచిన ఆయన ఇళ్లు ప్రస్తుతం మూగబోయింది. కరుణానిధి లేని ఆయన గృహం నిశ్శబ్దంగా మారింది. తన ఇంటిపై మమకారాన్ని పెంచుకున్న ఈ రాజకీయ కురవృద్ధుడు తన తదనంతరం నిరుపేదలకు ఉపయోగపడేలా ఆస్పత్రిగా మార్చాలని సంకల్పించారు. తన తల్లి పేరుపై ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి దానిని దానం చేశారు.