Parliament

‘ఈ జోకర్లు పరువు తీస్తున్నారే!’

Submitted by arun on Mon, 02/12/2018 - 10:24

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈసారి టీడీపీ ఎంపీలను లక్ష్యం చేసుకున్నాడు. వివిధ అంశాలపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసే వర్మ... పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కోసం ఆందోళన చేస్తున్న టీడీపీ ఎంపీలను జోకర్లుగా అభివర్ణించాడు. టీడీపీ ఎంపీల ఫొటో ఒకటి పోస్టు చేసిన వర్మ...రెండు పోస్టులు పెట్టాడు. 

పార్లమెంట్‌లో ఆందోళన ఉదృతం చేసిన టీడీపీ ఎంపీలు

Submitted by arun on Fri, 02/09/2018 - 11:38

పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట టీడీపీ ఎంపీలు ఆందోళన నిర్వహించారు. నేటితో పార్లమెంటు బడ్జెట్ మొదటి విడత సమావేశాలు ముగుస్తున్నందున ఆందోళన మరింత ఉధృతం చేయాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన సూచన మేరకు ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట ధర్నాకు దిగారు. విభజన హామీలు నెరవేర్చాలంటూ వారు డిమాండ్ చేశారు. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. టీడీపీకి చెందిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్ విచిత్ర వేషంతో ఆందోళనలో పాల్గొన్నారు.

చెవిలో పాత పువ్వు

Submitted by arun on Fri, 02/09/2018 - 10:02

ఆంధ్రా ఎంపీల ఆందోళనలతో కేంద్రం కొత్త వార్త వినిపిస్తుందేమోనని అంతా అనుకున్నారు. అయితే అలాంటిదేమీ జరగలేదు. మూడు రోజులపాటు పార్లమెంట్లో ఒత్తిడి చేసినా.. ఏపీలో బంద్ నిర్వహించినా.. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మనసు కరగలేదు. ఏపీకి సాయం అందిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని, సాయం కొనసాగుతుందంటూ పాత పొడిపొడి మాటల్నే రిపీట్ చేశారు. 

విభజన హామీల అమలయ్యే వరకు పోరాటం కొనసాగుతుంది: వైసీపీ ఎంపీలు

Submitted by arun on Thu, 02/08/2018 - 12:30

విభజన హామీల అమలయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వైసీపీ ఎంపీలు స్పష్టం చేశారు. టీడీపీ స్వార్థ రాజకీయాల కోసం డ్రామాలు ఆడుతోందన్నారు. చంద్రబాబు నాయుడు డబుల్‌ గేమ్‌ ఆడుతున్నారని, మంత్రివర్గంలో ఉంటూ నిరసనలు చేయడం ప్రజలను మభ్యపెట్టడమే అని మండిపడ్డారు. బడ్జెట్‌ సమావేశాలు ముగిసే వరకూ నిరసన కొనసాగిస్తామని అన్నారు. రాష్ట్ర విభజన హామీల అమలు చేయాలని కోరుతూ మూడో రోజు కూడా వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీలు పార్లమెంట్‌ ప్రధాన ద్వారం దగ్గర ధర్నాకు దిగారు. ఏపీకి ప్రత్యేక హోదాతో, రాష్ట్రానికి న్యాయం చేయలంటూ ఎంపీలు ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ, పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 

ఆత్మగౌరవం దెబ్బతిన్నందుకే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి..: మోదీ

Submitted by arun on Wed, 02/07/2018 - 13:15

పార్లమెంట్‌లో ప్రధాని మోడీ చెలరేగిపోయారు. దేశంలో ఇన్ని సమస్యలకు కారణం కాంగ్రెస్సే అంటూ ఆ పార్టీని తూర్పారపట్టారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించిన మోడీ... కాంగ్రెస్‌కు ప్రజాస్వామ్యంపై మాట్లాడే అర్హత లేదంటూ మండిపడ్డారు. తెలుగువారిని తీవ్రంగా అవమానించింది కాంగ్రెస్సే అంటూ దుయ్యాబట్టారు. ఆ అవమానాల నుంచే తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీకి జీవం పోశారని పార్లమెంట్‌లో ప్రస్తావించారు. ఈ సందర్భంగా సభలో ఉన్న తెలుగుదేశం ఎంపీలు లేచి చప్పట్లు కొట్టారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ దళిత ముఖ్యమంత్రిని రాజీవ్‌గాంధీ అందరి ముందు అవమానించారని మోదీ అన్నారు.

పార్లమెంట్ ముందు వైసీపీ ఎంపీల ఆందోళన

Submitted by arun on Tue, 02/06/2018 - 11:22

అటు  విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాలపై వైసీపీ పోరాటాన్ని కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీలు పార్లమెంట్‌ గేట్‌-1 దగ్గర నిరసన తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ ఫ్లకార్డులు ప‍్రదర్శించారు.  ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు పోలవరం ప్రాజెక్ట్‌, విశాఖకు రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలంటూ నినాదాలు చేశారు. కడప స్టీల్‌ ప్లాంట్‌, దుగరాజపట్నం పోర్టుతో పాటు పోలవరం ప్రాజెక్ట్‌ను 2019 కల్లా పూర్తి చేయాలంటూ డిమాండ్‌ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, లోక్‌సభ ఎంపీలు మిథున్‌ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్‌, వైఎస్‌ అవినాష్‌ రెడ్డి పాల్గొన్నారు.
 

ఎంపీలే కాదు.. ఎమ్మెల్యేలదీ అదేమాట

Submitted by arun on Mon, 12/25/2017 - 16:16

ఎంపీలేకాదు.. ఎమ్మెల్యేల జీతాలూ పెంచాలన్న వాదనలు అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి పెరుగుతున్న ఖర్చులు, జీవన ప్రమాణాల నేపధ్యంలో ప్రస్తుతం వస్తున్న జీతం ఏ మాత్రం సరిపోదని మన ప్రజాప్రతినిధులంటున్నారు అసలు మన ప్రజా ప్రతినిధుల జీత భత్యాలు, అలవెన్సులు ఎలా ఉంటాయ్?

జీతాలు పెంచాలంటూ ఎంపీల వేడుకోలు

Submitted by arun on Mon, 12/25/2017 - 16:13

వారు తలుచుకుంటే తిమ్మిని బమ్మి చేయగలరు ఏ ప్రాజెక్టునైనా పట్టాలెక్కించగలరు.. లెక్క తప్పితే.. అటకెక్కించగలరు.. అధికారం అనే మంత్ర దండానికి అపరిమితమైన పవరుంటుంది. అభివృద్ధి రథం పగ్గాలు ఉండేది వారి చేతిలోనే.. తాము చెప్పిందే.. వేదం.. చేసిందే శాసనం.. ఇది మన పార్లమెంటు ప్రతినిధుల విశ్వరూపం.. ఇన్ని తిరుగులేని అధికారాలతో అద్భుతంగా పనిచేయాల్సిన వీరు జీతాలు పెంచాలంటూ ఇప్పుడు కొత్త డిమాండ్ లేవనెత్తుతున్నారు.. ఈ డిమాండ్ సరైనదేనా?