Visakhapatnam

కలర్ ఫుల్‌గా భీమిలి ఉత్సవ్..

Submitted by chandram on Sun, 11/11/2018 - 11:28

భీమిలి ఉత్సవ్‌ కలర్ ఫుల్ గా సాగుతోంది. రెండు రోజుల పాటు నిర్వహించే భీమిలి ఉత్సవ్‌లో తొలిరోజు గిరిజన థింసా నృత్యాలతోపాటు మోడ్రన్ మ్యూజిక్ డ్యాన్సులు, డీజేలు, వైశాఖీయుల సంస్కృతి, సంప్రదాయాలకు భీమిలి ఉత్సవ్ వేదికైంది. దీంతో భీమిలి తీరం కొత్త ఉత్సాహంతో పర్యాటకు వెల్కమ్ చెబుతోంది.17 వ శతాబ్దపు డచ్ టౌన్షిప్ పర్యాటక ప్రదేశాలు జనరంజకీకరణకు ఉద్దేశించిన రెండు రోజుల కార్నివాల్ భీమిలి ఉత్సవ్ -2018 శనివారం భారీ సంఖ్యలో ప్రజలు, ప్రత్యేకించి యువకులు మరియు విద్యార్థులతో ప్రతి ఒక్కరు పెద్ద సంఖ్యలో పండుగలో పాల్గోంటారు. పండుగ ప్రారంభమై, భీమిల పాత్రదారుల వెంట దొరతోటా నుండి భారీ ఊరేగింపు జరుగుతుంది.

విశాఖ కింగ్ జార్జ్ ఆస్పత్రిలో తిష్ట వేసిన సమస్యలు

Submitted by arun on Thu, 11/08/2018 - 11:12

ఉత్తరాంధ్రుల ఆరోగ్య ప్రదాయనిగా పేరుగాంచిన కింగ్ జార్జ్ ఆస్పత్రిలో సమస్యలు తిష్ట వేశాయి. నిధుల కొరతతో శస్త్రచికిత్సలకు అవరోధంగా మారింది. ఆస్పత్రి అభివృద్ధి నిధులతో ఇంతకాలం నెట్టుకొచ్చినా ప్రభుత్వం సత్వరం స్పందించకపోతే రోగుల ప్రాణాలకు భరోసా లేకుండా పోయే పరిస్థితి దాపురించింది. విశాఖ కింగ్ జార్జ్ ఆస్పత్రి ఉత్తరాంధ్రుల‌తో పాటు పోరుగు రాష్ట్రాలు అయిన ఒడిశా, చత్తీస్‌ఘడ్ లకు వైద్య సేవలు అందిస్తుంది.

విశాకపట్టణం లోని కురుపాం మార్కెట్

Submitted by arun on Fri, 11/02/2018 - 16:04

విశాకపట్టణం లోని కురుపాం మార్కెట్ యొక్క ప్రత్యేకత మీకు తెలుసా... మొదటి నుంచి ఈ ప్రాంతం బంగారం, వెండి వ్యాపారానికి ప్రసిద్ధి. విశాఖపట్నంలో మొట్ట మొదటి బంగారం, వెండి వ్యాపార కేంద్రం. కురౌపాం రాజులు,వారి పాలనా కాలంలో ఈ మార్కెట్టును కట్టించారు. ఇప్పటికీ, కురుపాం మార్కెట్టు లోనికి వెళ్ళే ద్వారం మీద వారి పేరు వుంటుంది. ఈ ప్రాంతంలో దొరకని ఆయుర్వేద మూలిక వుండదు. అలగే, యజ్ఞాలు చేసే సమయంలో వేసే పూర్ణాహుతి సామాన్లు కోసం, పెళ్ళి చేసుకునే సమయంలో వేసే కర్పూరం దండలు వగైరా సామాన్లు కోసం కురుపాం మార్కెట్ కి రాక తప్పదు. వైజాగ్ వెళ్ళినప్పుడు ఈ ప్రాంతాన్ని చుడండి. శ్రీ.కో.

మాజీ స్పీకర్‌ ప్రతిభా భారతికి గుండెపోటు

Submitted by arun on Fri, 10/26/2018 - 14:02

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ ప్రతిభా భారతి గుండె పోటుకు గురయ్యారు. విశాఖలోని పినాకిని ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రి జస్టిస్ పున్నయ్య (92)ను చూసేందుకు ప్రతిభా భారతి ఆసుపత్రికి వచ్చారు. ఆయన్ని చూసేందుకు శుక్రవారం ఆస్పత్రికి వచ్చిన ఆమెకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను అదే ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ప్రతిభా భారతి పరిస్థితి విషమంగా ఉందని, షుగర్‌ లెవల్స్‌ బాగా తగ్గిపోయాయని వైద్యులు చెబుతున్నారు. ప్రతిభా భారతికి తండ్రితో అనుబంధం ఎక్కువని..

ఏపీలో మరోసారి ఐటీ దాడులు

Submitted by arun on Thu, 10/25/2018 - 10:18

మొన్న నెల్లూరు, నిన్న  విజయవాడ తాజాగా విశాఖలో ఐటీ దాడుల కలకలం రేగింది. ఐటీ దాడులు జరుగుతాయంటూ నిన్నటి నుంచి వినిపిస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ ఈ తెల్లవారుజాము నుంచే  విశాఖలోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు ప్రారంభించారు. దువ్వాడ ప్రత్యేక ఆర్ధిక మండలి పరిధిలోని పలు కార్యాలయాల్లో అధికారులు సోదాలు జరుపుతున్నారు. TGI కంపెనీలో సోదాలు చేపట్టిన అధికారులు రికార్డులను స్వాధీనం  చేసుకున్నారు. సుమారు 50 బృందాలు ఈ దాడులు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఐటీ రైడ్స్ సందర్భంగా ఎలాంటి ఘటనలు జరగకుండా ఎస్‌ఈజెడ్ పరిధిలో భారీగా పోలీసులను మోహరించారు .  

నిన్న అదృశ్యం...నేడు పొదల్లో శవమైన చిన్నారి

Submitted by arun on Tue, 10/09/2018 - 12:23

విశాఖ దువ్వాడ  సెక్టర్ 1లో దారుణం జరిగింది. మూడేళ్ల అలేఖ్యను గుర్తుతెలియన వ్యక్తులు హత్యచేసి ముళ్లపొదళ్లోకి పడేశారు. నిన్నసాయంత్రం నుంచి అలేఖ్య కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు దువ్వాడ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

వణికిస్తున్న వాయుగుండం...భారీ వర్షాలు పడే ఛాన్స్

Submitted by arun on Thu, 09/20/2018 - 15:00

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇది ఇవాళ్టి సాయంత్రంలోగా తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపారు. వాయుగుండంతో పాటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుందని దీని ప్రభావంతో ఒడిశాతో పాటు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడుతాయని తెలిపారు. రాగల 48 గంటల్లో పూరీ, కళింగపట్నం మధ్య వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని చెప్పారు. గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పిడుగులు కూడా పడే అవకాశం ఉందని తీర ప్రాంత ప్రజలతో పాటు ముఖ్యంగా జాలర్లు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. 

ఐటి ఉద్యోగాల ఉప్పెన వస్తోంది

Submitted by arun on Fri, 08/10/2018 - 16:30

విశాఖపట్టణం ఇక మునుముందు కాబోతోందట,

ఎందరికో ఐటి ఉద్యోగాల సముద్ర పట్టణమట,

మంత్రిగారి ప్రకారం 2019లోగా లక్ష ఐటీ ఉద్యోగాలట 

2024కి ఏపీలో నిరుద్యోగులు వెతికినా వుండరట. శ్రీ.కో
 

విశాఖలో పోటీకి అభ్యర్దులే కరువు

Submitted by arun on Wed, 08/01/2018 - 13:51

విశాఖ లో పొలిటికల్ పార్టీలకు విచిత్ర పరిస్థితులు ఎదురవుతున్నాయి ఎన్నికల వేడి మొదలవుతున్నా పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్ధులు మాత్రం కరువుతున్నారు. ఢీల్లి లో నలుగురిలో ఒకరిలా వుండేకన్నా అసెంబ్లీస్థానం కుపోటీ చేసి నియోజకవర్గం లో పట్టుసాధించుకోవాలని నేతలు ఉబలాటపడుతున్నారు. దీంతో ఈ సారి కూడా విశాఖ ఎంపీ స్థానం స్థానికేతరులనే వరించే పరిస్థితి కనిపిస్తుంది.

రైలు ముచ్చట "తూచ్చు"

Submitted by arun on Mon, 07/30/2018 - 13:37

ఆంధ్రప్రదేశ్లో రైల్వేజోన్ కదలిక,

ఇక లేదని తెలిపిన హోంశాఖ,
 
తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి,
 
పెట్టను మెలిక, ఆ"హోమ్" శాఖ. శ్రీ.కో