BJP MLA

రాజాసింగ్‌ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా రచ్చరచ్చ

Submitted by arun on Wed, 06/13/2018 - 16:25

ప్రపంచమంతా ఇప్పుడు రంజాన్‌ సందడి సాగుతోంది. ముస్లిం సోదరుల ఉపవాస దీక్షలు, సాయంత్రం ఇఫ్తార్‌ విందులతో కోలాహలం నెలకొంది. మొన్న ఎల్బీ స్టేడియంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఏకంగా 66 కోట్లతో ఇఫ్తార్ పార్టీ ఇచ్చారు. కేసీఆర్‌ ఇఫ్తార్‌ విందును టార్గెట్‌ చేస్తూ, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌, ఫేస్‌బుక్‌ లైవ్‌ స్ట్రీమ్‌ వేదికగా, కాకరేపే కాంట్రవర్సియల్‌ కామెంట్లు చేశాడు. ఇఫ్తార్‌ విందులు పెట్టి, ఓట్లను అడుక్కుంటున్నారని అన్నాడు.  ముస్లింలతో కూర్చుని, విందు ఆరగించే నాయకులంతా బిచ్చగాళ్లని అభివర్ణించాడు.

ఉన్నావ్ రేప్ కేసులో బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్...

Submitted by arun on Fri, 04/13/2018 - 10:54

ఉన్నావ్  రేప్ ఘటనలో మరో అడుగు ముందుకు పడింది. మొత్తానికి నిందితుడు, అధికార పార్టీ ఎమ్మెల్యే కులదీప్ సెంగార్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ తెల్లవారుజామున నాలుగున్నర గంటల సమయంలో లక్నోలో అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు అతన్ని హజ్రత్ గంజ్ లోని సీబీఐ ఆఫీస్ కు తరలించారు. అతనిపై గతంలోనే పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. యోగి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆయన్ని అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. ఇవాళ కులదీప్‌ను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఎమ్మెల్యే రాజాసింగ్‌‌కు తప్పిన ప్రమాదం

Submitted by arun on Mon, 04/09/2018 - 11:14

గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌‌కు ప్రమాదం తప్పింది. ఔరంగాబాద్‌లో సభ ముగించుకొని హైదరాబాద్‌ వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టబోయింది. అయితే, డ్రైవర్‌ అప్రమత్తతో కారును తప్పించగా వెనక ఉన్న మరో కారును లారీ ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్‌ పారిపోగా క్లీనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంపై ఎమ్మెల్యే రాజాసింగ్‌ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

బీజేపీ ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు.. ఆవులను చంపితే.. మీరూ చస్తారు..!

Submitted by arun on Mon, 12/25/2017 - 13:29

రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్ దేవ్ అహుజా వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గోవులను అక్రమ రవాణా చేసేవారికి, గో మాంసం తినేవారికి చావే గతి అని, ఆవులను చంపితే.. మీరు కూడా చస్తారు అంటూ హెచ్చరించారు.