TRS

టీఆర్ఎస్‌ ఓటమే లక్ష్యంగా ముందుకెళ్దాం ..

Submitted by arun on Mon, 10/22/2018 - 14:08

మహాకూటమి పొత్తులుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సీట్ల కోసం టీజేఎస్‌, సీపీఐ కాంగ్రెస్‌ను బద్నాం చేస్తున్నాయంటూ ఆరోపించారు. కాంగ్రెస్‌తో పొత్తును జాతీయ దృష్టితో చూడాలంటూ పార్టీ నేతలకు సూచించారు. కాంగ్రెస్ తక్కువ సీట్లు ఆఫర్ చేసిన భవిష్యత్ అవసరాలు, కేసీఆర్‌ను ఎదుర్కొనే వ్యూహంతో ముందుకు వెళదామంటూ చెప్పారు. టీఆర్ఎస్ పరాజయమే లక్ష్యంగా కేడర్ పని చేయాలని బలం, విజయావకాశాలు ఉన్న చోటే పోటీ చేద్దామంటూ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

మరో రెండు సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్

Submitted by arun on Mon, 10/22/2018 - 11:19

మరో రెండు నియోజకవర్గాల అభ్యర్థులను టీఆర్ఎస్ ప్రకటించింది. జహీరాబాద్ అభ్యర్థిగా కె. మాణిక్ రావు, మలక్ పేట్ క్యాండెట్ గా చెవ్వా సతీష్ ల పేర్లను ఖరారు చేసింది. ఇప్పటికే 105 మంది అభ్యర్థుల ప్రకటించిన కేసీఆర్ ..తాజా ప్రకటనతో అభ్యర్థుల సంఖ్య 107కు చేరుకుంది. 

అభ్యర్థులకు ప్రచార వ్యూహాన్ని దిశానిర్దేశం చేసిన కేసీఆర్‌ ...అలసత్వం వీడితే...

Submitted by arun on Mon, 10/22/2018 - 10:04

విజయదశమి వెళ్లిపోయింది.. ఇక విజయతీరాలను అందుకోవడమే మిగిలి ఉందని.. టీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌.. అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. ప్రచారంలో ఎక్కడా అలసత్వం వద్దంటూ సూచనలు చేశారు. నిర్లక్ష్యం వహించకుంటే ఈ సారి కూడా అధికారంలోకి రావడం ఖాయమని భరోసా ఇచ్చారు. 

టీఆర్ఎస్‌ అభ్యర్థికి నిరసనల సెగ

Submitted by arun on Tue, 10/16/2018 - 16:16

ప్రజల్లోకి వెళ్తున్న ప్రజా ప్రతినిధులకు జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మునుగోడు టీఆర్ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి.. గత నాలుగు రోజులుగా భువనగిరి జిల్లా ప్రభాకర్‌రెడ్డిని.. ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించి 4 యేళ్లు గడుస్తున్నా.. ఇప్పటివరకు నిర్మాణాన్ని పూర్తి చేయలేదంటూ ప్రశ్నించారు. మౌలిక సదుపాయాలు కల్పించడంలో.. పూర్తిగా విఫలమయ్యారంటూ.. ఏకంగా ప్రభాకర్‌ రెడ్డితోటే వాగ్వాదానికి దిగారు. దీంతో టీఆర్ఎస్‌ కార్యకర్తలకు, గ్రామస్తులకు మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

Tags

కాంగ్రెస్‌ దగ్గర గులాబీని కట్‌ చేసే కత్తెర ఉందా?

Submitted by santosh on Tue, 10/16/2018 - 13:06

తెలంగాణలో అధికారపార్టీకి భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్. టీఆర్ఎస్ నుంచి కీలక నేతలను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు హస్తం నేతలు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. గులాబీ పార్టీలోని పలువురు అసమ్మతి నేతలు త్వరలోనే హస్తం గూటికి చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నెల రాహుల్ పర్యటన సందర్భంగా.. టీఆర్ఎస్‌లోని పలువురు నేతలను, కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్‌ను ఎదుర్కునేందుకు కలిసివచ్చే అన్ని అవకాశాలను తమకు అనుకూలంగా మార్చుకుంటోంది కాంగ్రెస్. తమకు బలమైన అభ్యర్ధులు లేని ప్రాంతాల్లో.. టీఆర్ఎస్ లోని అసమ్మతి నాయకులకు గాలం వేస్తోంది హస్తం పార్టీ.

Tags

నేడు టీఆర్‌ఎస్ పాక్షిక మ్యానిఫెస్టో...పెన్షన్ల పెంపు, నిరుద్యోగ భృతి...

Submitted by arun on Tue, 10/16/2018 - 10:45

ఎన్నికల ప్రచారంలో జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతున్న గులాబీ దళం మేనిఫెస్టో రూపకల్పనపై దృష్టిపెట్టింది. ఇప్పటికే పలు వర్గాల నుంచి విజ్ఞప్తులు, సలహాలు, సూచనలు సేకరించిన కమిటీ ఈరోజు సమావేశం కావాలని నిర్ణయించింది. ఈ మీటింగ్‌కి గులాబీ బాస్‌ కేసీఆర్‌ కూడా హాజరుకానుండటంతో కీలక నిర్ణయాలు తీసుకుంటారనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగులు, రైతులు, బడుగు బలహీనవర్గాలను ఆకట్టుకునేలా మేనిఫెస్టో రూపకల్పన ఉండనున్నట్లు తెలుస్తోంది.

కంటతడి పెట్టిని రాములు నాయక్‌

Submitted by arun on Mon, 10/15/2018 - 16:53

టీఆర్‌ఎస్ లో ప్రజాస్వామ్యం, ఆత్మగౌరవం లేదని, అదో ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీగా తయారైపోయిందని ఎమ్మెల్సీ రాములు నాయక్‌ ఆరోపించారు. టీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత రాములు నాయక్‌ మీడియాతో మాట్లాడారు. తన సస్పెన్షన్‌పై ఆయన కన్నీటి పర్యతమయ్యారు. షోకాజ్‌ నోటీసు ఇవ్వకుండానే తనను సస్పెండ్‌ చేశారని మండిపడ్డారు.  నాటి తెలంగాణ ద్రోహులు ప్రస్తుత కేసీఆర్ క్యాబినేట్ లో  ఉన్నారని విమర్శించారు. వచ్చేఎన్నికల్లో టీఆర్ఎస్‌కు గిరిజనులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 
 

టీఆర్ఎస్‌కు భారీ షాక్ ఇవ్వనున్న కాంగ్రెస్?

Submitted by arun on Mon, 10/15/2018 - 16:46

టీఆర్ఎస్‌కు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్ పార్టీ. అధికార పార్టీ నుంచి కీలక నేతలను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు హస్తం నేతలు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ కు చెందిన పలువురు సీనియర్లు.. కారు దిగి, కాంగ్రెస్ గూటికి చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నెల రాహుల్ పర్యటన సందర్భంగా.. టీఆర్ఎస్‌లోని పలువురు నేతలను, కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

Tags

టీఆర్‌ఎస్‌కు ఊహించని షాక్‌...పార్టీ మారేందుకు సిద్ధమైన ఎమ్మెల్సీ...

Submitted by arun on Mon, 10/15/2018 - 10:58

ఎన్నికల వేళ కారు జోరుకు సొంత పార్టీ నేతలే బ్రేకులు వేస్తున్నారు. రోజుకోకరు పార్టీకి బై కొట్టి కాంగ్రెస్‌కు జై కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ .. పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటన సమయంలో కాంగ్రెస్‌లో ఆయన చేరనున్నారు. పార్టీని వీడేందుకు గల కారణాలు వివరించేందుకు మధ్యాహ్నం మూడు గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.  
 

కాంగ్రెస్‌లోకి గడ్డం బ్రదర్స్ ?

Submitted by arun on Mon, 10/15/2018 - 10:50

జి. వెంకట స్వామి కుటుంబం మళ్ళీ కాంగ్రెస్ పంచన చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ నేత గడ్డం వినోద్‌ కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైనట్లు సమాచారం. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ సమక్షంలో రెండ్రోజుల్లో ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిన్న తన అనుచరులతో సమావేశమైన వినోద్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చెన్నూర్‌ టికెట్‌ ఇవ్వకపోవడంతో అలకబూనిన వినోద్ మాజీ మంత్రినైన తనకు టీఆర్ఎస్‌లో కనీస గౌరవం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Tags