New Year

లేడీస్ హాస్టల్ ముందు మందుబాబుల వీరంగం

Submitted by arun on Mon, 01/01/2018 - 11:51

హైదరాబాద్ దిల్‌షుక్‌నగర్‌లో ఆకతాయిలు వీరంగం సృష‌్టించారు. గత అర్ధరాత్రి మద్యం తాగి రచ్చ రచ్చ చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా రోడ్లపై వచ్చిన పోకిరీలు లేడిస్ హాస్టల్స్ పై రాళ్లు విసిరారు. లేడిస్ హాస్టల్స్ నుంచి అమ్మాయిలు బయటకు రావాలంటూ గట్టిగా అరిచారు. మరికొందరు వాహనాలు కిందకు పడేశారు. పోకిరీల హంగామాను స్థానికులు సెల్ ఫోన్ ద్వారా వీడియో తీశారు. దాదాపు అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు అందుబాటులో లేకపోవడంతో అక్కడికి చేరుకోవడానికి సమయం పట్టింది. ఈలోగా ఆకతాయిలను అక్కడి స్థానికుల చెదరగొట్టారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు అందింది.

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

Submitted by arun on Sat, 12/23/2017 - 13:07

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జనవరి ఒకటిన ఆలయాల్లో కొత్త సంవత్సర వేడుకలను నిషేధిస్తూ దేవాదాయ శాఖ సర్యులర్ జారీ చేసింది. జనవరి 1 న దేవాలయాల్లో పండుగ వాతావరణం సృష్టించొద్దని దేవాదాయశాఖ తేల్చిచెప్పింది. భక్తులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపొద్దని ఆలయ ద్వారాలను స్వాగత తోరణాలు కట్టడం వంటివే చేయవద్దని స్పష్టం చేసింది. తెలుగు సంవత్సరాది అయిన ఉగాది రోజు మాత్రమే దేవాలయాల్లో వేడుకలు, ప్రత్యేక కార్యక్రమాలు, పూజలు నిర్వహించాలని దేవాదాయ శాఖ అనుబంధ సంస్ధ ధర్మపరిరక్షణ ట్రస్ట్ కార్యదర్శి ఆదేశించారు.