Tweet

చంద్రబాబుకు జగన్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు

Submitted by arun on Fri, 04/20/2018 - 11:41

సీఎం చంద్రబాబు 68 ఏట అడుగుపెట్టారు. చంద్రబాబుకు పుట్టిన రోజు సందర్భంగా ప్రతిపక్ష నేత జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుడ్ని మనసారా కోరుకుంటున్నానని ట్విట్‌ చేశారు.

శేఖర్ కమ్ములకు శ్రీరెడ్డి వార్నింగ్

Submitted by arun on Wed, 04/04/2018 - 12:44

శేఖర్ కమ్ముల అని పేరేమీ పెట్టకుండా ఆయన పేరు ధ్వనించేలా ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి. ఇలాంటి వ్యాఖ్యల్ని ఇగ్నోర్ చేస్తే పోయేదేమో? కానీ మాట్లాడకుండా సైలెంటుగా ఉంటే జనాలు ఇందులో నిజం ఉందని భ్రమిస్తారేమో అని కమ్ముల కొంచెం ఘాటుగానే స్పందించాడు. క్షమాపణ చెప్పు లేదా లీగల్ యాక్షన్ కు రెడీగా ఉండు అంటూ హెచ్చరించాడు కమ్ముల. దీంతో శ్రీరెడ్డి డౌన్ అవుతుందనుకున్నారు చాలామంది. కానీ ఆమె మాత్రం ఘాటుగానే స్పందించింది. అయితే శేఖర్ కమ్ముల ఫేస్‌బుక్‌లో తనను ఉద్దేశించి పెట్టిన పోస్ట్‌పై శ్రీరెడ్డి ఘాటైన కౌంటర్ ఇచ్చింది.

శ్రీదేవి ఆఖరి ట్వీట్‌ ఇదే

Submitted by arun on Sun, 02/25/2018 - 11:25

అతిలోక సుందరి శ్రీదేవి దివంగతులయ్యారు. భర్త, చిన్న కుమార్తెతో కలిసి ఓ వివాహ నిమిత్తం దుబాయి వెళ్లిన శ్రీదేవి.. అక్కడే గుండెపోటుతో మృత్యు ఒడికి చేరిపోయారు. ఆమె మృతితో ఇండియన్ సినిమా శోకసంద్రంలో మునిగిపోయింది. బోనీ కపూర్‌తో వివాహమయ్యాక ఆమె సినిమాలకు దూరమవడంతో అభిమానులు నిరాశ చెందారు. ఆ తరువాత 2012లో వచ్చిన ‘ఇంగ్లిష్‌ వింగ్లిష్’ చిత్రంతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టారు. 2017లో వచ్చిన ‘మామ్‌’ చిత్రం ఆమె నటించిన అద్భుత చిత్రాల్లో ఒకటి అని చెప్పాలి. ఈ సినిమాలో అమ్మ అంటే శ్రీదేవిలా ఉండాలి అన్నంతగా ఆ పాత్రలో లీనమై నటించారు.

యాంకర్ ప్రదీప్ ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ రీట్వీట్..

Submitted by arun on Sat, 02/10/2018 - 10:47

ఇటీవల డ్రంకన్ డ్రైవ్ కేసులో పట్టుబడి వార్తల్లోకెక్కిన యాంకర్ ప్రదీప్.. తన మంచి మనసు చాటుకున్నాడు. స్కూళ్లలో చదువుకుంటున్న విద్యార్థులు, ముఖ్యంగా అమ్మాయిలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని కేటీఆర్‌కు ఒక అభ్యర్థన పెట్టాడు. ఈ అంశంపై స్పందించిన కేటీఆర్.. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని మేడ్చల్ కలెక్టర్‌కు సూచించారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సమస్యలను పరిష్కరించి తనకు తెలియజేయాలని కలెక్టర్‌కు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. చర్లపల్లి ప్రాథమిక పాఠ‌శాల‌లో బాత్రూమ్ లేదని, మంచి నీటి సౌకర్యం లేదని యాంకర్ ప్రదీప్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.

బాలుడి ఫోన్ పగలగొట్టిన ఉదంతంపై స్పందించిన అనసూయ

Submitted by arun on Tue, 02/06/2018 - 18:02

జబర్దస్త్ యాంకర్ అనసూయపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అనసూయ తన కుమారుడి ఫోన్‌ పగలగొట్టి, దూర్భాషలాడిందని బాధిత బాలుడి తల్లి ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్‌‌స్టేషన్‌లో కంప్లైంట్‌ ఇచ్చింది. తార్నాక విజయపురికాలనీకి జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ రావడంతో ఫొటో తీస్తుండగా ఫోన్‌ లాక్కుని పగలగొట్టిందని ఫిర్యాదుచేసిన మహిళ అనసూయపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది. యాంకర్‌ అనసూయ ఏదో పని నిమిత్తం తార్నాక విజయపురికాలనీకి వచ్చింది. తన తల్లితో కలిసి అటుగా వెళ్తోన్న బాలుడు రోడ్డుపక్కన అనసూయ కనిపించగానే అభిమానంతో ఆమెతో సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు.

నాకు అమ్మాయి దొరికింది : సల్మాన్‌

Submitted by arun on Tue, 02/06/2018 - 14:07

యాభై ఏళ్ల వయసు దాటినా ఇప్పటికీ బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖానే. సల్మాన్ కు సంబంధించిన ఎలాంటి చిన్న వార్త అయినా పతాక శీర్షికల్లోనే ఉంటుంది. తాజాగా ఓ ట్వీట్ ద్వారా సల్మన్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. 'నాకు ఒక అమ్మాయి దొరికింది' అంటూ ఆయన ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ సల్మాన్ పెళ్లికి సంబంధించిందేనా? అనే ఆసక్తి ఇప్పుడు అందర్లో నెలకొంది.

టచ్ చేసి చూడు అర్థపర్థంలేని యాక్షన్ డ్రామా: కత్తి

Submitted by arun on Fri, 02/02/2018 - 16:14

రెండేళ్ల గ్యాప్ త‌రువాత రాజా ది గ్రేట్ తో హిట్ కొట్టిన మాసామ‌హ‌రాజ త‌నకు అచ్చొచ్చిన పోలీస్ పాత్రల‌తో అల‌రిస్తున్నాడు. అయితే విక్ర‌మ్ సిరికొండ డైర‌క్ష‌న్ లో ప‌వ‌ర్ ఫుల్ ఆఫీస‌ర్ పాత్ర‌లో ట‌చ్ చేసి చూడు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. విక్రమ్ సిరికొండ ద‌ర్శక‌త్వం వ‌హించిన ఈ సినిమాలో రవితేజ సరసన రాశీఖ‌న్నా, సీర‌త్ క‌పూర్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా నేడు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కత్తి మహేష్ ఈ సినిమాపై రివ్యూ ఇచ్చేశారు. సినిమా చాలా దారుణంగా ఉందంటూ మహేష్ రివ్యూలో పేర్కొన్నారు.
 

తంత్రం లేని సేనాని.. యుద్ధం లేని సైన్యం: కత్తి మహేష్

Submitted by arun on Mon, 01/29/2018 - 14:29

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చలో రే చల్ అంటూ ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలపై దృష్టి పెడుతున్నారు. 2019 వరకూ సినిమాలను సైతం పక్కనపెట్టాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పర్యటనకు పవన్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు హాజరై ఘన స్వాగతం పలుకుతున్నారు. ” తంత్రం లేని సేనాని, యుద్ధం లేని సైన్యం…సమస్య ఇంకా బేసిక్ లేవెల్లోనే ఉంది..ఇప్పటికీ ఆలస్యం కాలేదు. ఏదో ఒకటి చేయొచ్చు. కరువు యాత్ర దాటి పచ్చటి పొలాల వైపు వచ్చేలోగా ఎంతో కొంత మార్చొచ్చు ” అంటూ ట్వీట్ చేశాడు.

పూనమ్ ట్వీట్ ఎవ‌రిని ఉద్దేశించి..?

Submitted by arun on Mon, 01/29/2018 - 11:42

ఎవరి గురించి మాట్లాడిందో తెలియదుగానీ, నటి పూనం కౌర్ సంచలన వ్యాఖ్యలనే చేసింది. "డబ్బుల కోసం మారిపోయిన సిద్ధాంతాలు... మీ అస్తిత్వం ఏంటి? అవసరాల కోసం మారిపోయిన నిజాయతీ... నీ గుణం ఏంటి?" అని ప్రశ్నించింది. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల వ‌ల్ల క‌త్తి మ‌హేష్‌.. అత‌ని వ‌ల్ల హీరోయిన్ పూన‌మ్ కౌర్ ఒక్క‌సారిగా లైమ్‌లైట్‌లోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ప‌వ‌న్‌, పూన‌మ్ గురించి క‌త్తి మ‌హేష్ సంధించిన ప్ర‌శ్న‌లు, వాటికి స్పంద‌న‌గా పూన‌మ్ చేసిన ట్వీట్లు సంచ‌ల‌నం సృష్టించాయి. ఆ వివాదం ఎలాగోలా స‌ద్దుమ‌ణిగింది. తాజాగా పూన‌మ్ చేసిన ఓ ట్వీట్ సంచ‌ల‌నంగా మారింది.