Anasuya Bharadwaj

ఇద్దరు బిడ్డల తల్లినైతే నటించకూడదా?: అనసూయ

Submitted by arun on Mon, 04/16/2018 - 13:37

బుల్లితెరపై యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సినీ ప్రేక్షకులకు ‘రంగమ్మత్త’ అయిపోయారు. ‘రంగస్థలం’ సినిమాలో ఆమె చేసిన రంగమ్మత్త పాత్రకు మంచి స్పందన వస్తోంది. అయితే అనసూయను ఇద్దరు బిడ్డలకు తల్లివి... హాట్‌ యాంకర్‌‌లా టీవీల్లో కనిపించడం, ఐటమ్‌ సాంగ్స్‌ చెయ్యడం నీకు అవసరమా అని చాలామంది నెటిజన్లు నన్ను విమర్శిస్తున్నారట. ఇద్దరు బిడ్డల తల్లినైతే ఏంటి? వైవిధ్యభరితమైన పాత్రలు వచ్చినపుడు నటించకూడదా? అంటూ ప్రశ్నిస్తోంది. బాలీవుడ్‌లో పెళ్లై పిల్లలున్న తారలు ఇప్పటికీ తెరపై అలరిస్తున్నారు. ఒక్క తెలుగు కథానాయికలపైనే ఈ విమర్శలు.

ఆ అఫైర్ పై రంగమ్మ‌త్త భ‌ర్త ఏమ‌న్నాడంటే

Submitted by lakshman on Thu, 04/05/2018 - 21:08

మీడియాలో హెచ్ ఆర్ ఉద్యోగిగా జాయిన్ అయిన అన‌సూయకు అదృష్టం త‌లుపు త‌ట్టి వెండితెర‌పై అవ‌కాశాలు వ‌చ్చాయి. ఆ అవ‌కాశాల్ని స‌ద్వినియోగం చేసుకుంటున్న అన‌సూయ తాజాగా సుకుమార్ - రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ లో రంగ‌స్థ‌లంలో యాక్ట్ చేసింది. ప్రస్తుతం రంగస్థలం సినిమాలో అనసూయ నటించిన రంగమ్మత్త పాత్రకు ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు. రంగస్థలం చిత్రం దూసుకుపోతున్న నేపథ్యంలో ఆమె ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని మీడియాతో పంచుకున్నారు.  

సోషల్ మీడియాకు అనసూయ గుడ్‌ బై

Submitted by arun on Wed, 02/07/2018 - 12:36

ప్రముఖ యాంకర్‌ అనసూయ సోషల్ మీడియాకు గుడ్‌ బై చెప్పేసింది. రీసెంట్‌గా ఓ కుర్రాడు అన‌సూయతో సెల్ఫీ దిగేందుకు ప్ర‌యత్నించ‌గా, ఆమె సెల్ ప‌గ‌ల‌గొట్టింద‌ట‌. దీనిపై పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా బుక్ అయింది. ఈ నేప‌ధ్యంలో అన‌సూయ‌కి భారీ ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. నెటిజ‌న్స్ త‌మ‌కి న‌చ్చిన స్టైల్‌లో అన‌సూయ‌కి క్లాస్ పీకారు. క్లారిటీ ఇచ్చేందుకు ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికి వారు శాంతించక‌పోవ‌డంతో సోష‌ల్ సైట్స్ నుండి అన‌సూయ త‌ప్పుకున్న‌ట్టు తెలుస్తుంది. ట్వీటర్‌తో పాటు ఫేస్‌ బుక్‌లో కూడా అనసూయ అకౌంట్ కనిపించటం లేదు. నెటిజెన్ల నుంచి విమర్శలు రావటం వల్లే అనసూయ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

అసభ్యకరమైన ఫోన్‌ కాల్స్ వస్తున్నాయి

Submitted by arun on Fri, 01/26/2018 - 17:23

ప్రముఖ యాంకర్‌, నటి అనసూయకు కొంతకాలంగా అసభ్యకరమైన ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయట. భారతదేశంలో ఓ మహిళకున్న స్వేచ్ఛ ఇదేనా? అంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. భారతదేశంలో మహిళలకు ఎలాంటి భద్రత, గౌరవం లేదంటూ ట్విటర్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు.

అజ్ఞాత‌వాసి పాట‌కి అన‌సూయ డబ్ స్మాష్..

Submitted by arun on Sat, 12/23/2017 - 11:06

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా రూపొందిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం త్వరలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. పవన్ సినిమా విడుదల కోసం అటు పవన్ అభిమానులతో పాటు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలోని ఓ పాటకు బుల్లితెరపై యాంకర్‌గా పాపులరైన అందాల నటి అనసూయ డబ్ స్మాష్ చేసింది.‘బయటకొచ్చి చూస్తే.. టైమేమో 3’0 క్లాక్‌’ అనే పాటకు డబ్‌స్మాష్‌ చేసి సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో అన‌సూయ ఎక్స్‌ప్రెష‌న్స్ అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కూడా అయింది.