telangana

తెలంగాణలో కలయికల లుకలుకలు

Submitted by arun on Sat, 06/16/2018 - 12:56

ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, తెలంగాణలోనూ ఎవర్ని ఎవరు కలిసినా అపార్థాలు కొత్త వాదనలు వెతుక్కుంటున్నాయి. సమావేశాల మీద రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. రిజర్వేషన్లు, జోన్లపై చర్చించేందుకు ఢిల్లీవెళ్లిన కేసీఆర్‌పైనా ఆరోపణలు చేసింది కాంగ్రెస్. బీజేపీతో కేసీఆర్‌ జట్టుకట్టారని విమర్శిస్తోంది. ఈ ఆరోపణల్లో వాస్తవముందా? కేవలం రాజకీయమేనా?

15 యేళ్ల సంప్రదాయానికి మంగళం పాడనున్న కేసీఆర్ ...ఆశావహుల్లో కొనసాగుతున్న ఉత్కంఠ

Submitted by arun on Fri, 06/15/2018 - 13:35

గత 15 యేళ్లుగా వస్తున్న సంప్రదాయానికి మంగళం పాడేందుకు టీఆర్ఎస్ సిద్ధమైంది. ఆఖరు నిముషంలో అభ్యర్థులను ప్రకటించే రివాజును పక్కన పెట్టేందుకు రెడీ అయ్యింది. గత మూడు ధఫాలుగా చివరి నిముషంలో జాబితాను ప్రకటించి ఇబ్బందులను ఎదుర్కోవడం.. ఈ సారి ఆ సంప్రదాయాన్ని కాదని.. కనీసం రెండు నెలల ముందే టిక్కెట్ల లిస్టు వెలువరించేందుకు సిద్ధం చేసుకుంటున్నారు.. గులాబీ బాస్. దీంతో సిట్టింగులతో పాటు, ఆశావహుల్లో ఆందోళన కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. 

తెలంగాణ ఎన్నికల సంఘం ఊహించని షాక్

Submitted by arun on Thu, 06/14/2018 - 13:29

పంచాయతీ ఎన్నికల ముందుకు...రాజకీయ నేతలకు ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఎన్నికల్లో వేలం ద్వారా ఎన్నికయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోంది. తెలంగాణ నూతన పంచాయతీ రాజ్‌ చట్టంలోని అంశాల ఆధారంగా...రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త నిబంధనలను వెల్లడించింది.

మోత్కుపల్లికి ఆంధ్రా నేతల నుంచి మద్దతు

Submitted by arun on Wed, 06/13/2018 - 10:21

సీనియర్‌ లీడర్‌ మోత్కుపల్లి నర్సింహులు‌ రాజకీయ జీవితం అయోమయంలో పడింది. తెలుగుదేశం నుంచి బహిష్కరణకు గురైన మోత్కుపల్లిని తెలంగాణలో ఏ పార్టీ పట్టించుకోవడం లేదు. కనీసం పలకరించడానికి కూడా ఎవరూ సాహసించడం లేదు. అయితే పొరుగు రాష్ట్రం... ఏపీ నుంచి మాత్రం మోత్కుపల్లికి అనూహ్య మద్దతు లభిస్తోంది. హైదరాబాద్‌కి వచ్చి మరీ... మోత్కుపల్లిని కలిసి సంఘీభావం ప్రకటించడం హాట్‌ టాపిక్‌గా మారింది.

తెలంగాణలో తెలుగు తప్పనిసరి

Submitted by arun on Mon, 06/11/2018 - 16:46

తేనెలొలికే భాష.. అమ్మదనం నిండిన కమ్మనైన భాష.. ప్రాచీన హోదా కలిగిన భాష తెలుగు. అంత గొప్ప బాష.. ఇకనుంచి తెలంగాణలో వెలిగిపోనుంది. మాతృభాష తెలుగుకు పట్టం కట్టేందుకు.. సర్కార్ సిద్ధమయ్యింది. సీబీఎస్‌ఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ, కేంబ్రిడ్జి తదితర సిలబస్‌ను అనుసరించి నడిచే పాఠశాలల్లో కూడా.. ఒకటో తరగతి నుంచి తెలుగు తప్పనిసరిగా బోధించనున్నారు. 

కాంగ్రెస్‌ నుంచి మళ్లీ టీఆర్ఎస్‌లోకి వలసలు...ఓ ఎమ్మెల్సీ, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు జంప్‌

Submitted by arun on Fri, 06/08/2018 - 15:52

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి మరో కుదుపు తగిలింది. పాలమూరు నుంచి ఒకేసారి ఒక ఎమ్మెల్సీతో పాటు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌ పార్టీలో చేరనున్నారు. రేపు కేసీఆర్‌ సమక్షంలో... ప్రగతి భవన్‌లో గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. నాగం జనార్దన్‌ రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్సీ దామోదర్‌ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరేందుకు నిర్ణయించుకున్నారు. దామోదర్‌ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు ఎడ్మ కృష్ణారెడ్డి, అబ్రహం రేపు టీఆర్ఎస్‌లో చేరనున్నారు.
 

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

Submitted by arun on Fri, 06/08/2018 - 12:10

తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్య ఫలితాలు విడుదల చేశారు. ఫలితాలను bie.telangana.gov.in కు లాగిన్ అయి తెలుసుకోవచ్చు. తాజాగా విడుదల చేసిన ఫలితాలతో ఫస్టియర్‌ ఉత్తీర్ణత శాతం 72.2 శాతం, సెకండియర్‌ ఉత్తీర్ణత శాతం 78.7 శాతానికి చేరింది. ఈ నెల 18 వరకు రీవాల్యుయేషన్‌, కౌంటింగ్‌కు అవకాశముంది.

39 మంది ఎమ్మెల్యేల‌కు సీఎం కేసీఆర్ వార్నింగ్‌

Submitted by arun on Thu, 06/07/2018 - 15:01

39 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో వీరిలో చాలా మంది టికెట్ కోల్పోయే అవకాశాలు క‌నిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం...వీరిలో పలువురికి ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇక మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలకు స్వయంగా వారితోనే చెప్పించారట. పార్టీ బలంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో కూడా పరిస్థితి ఇలాగే ఉందని సమాచారం. సీఎం కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని కొన్ని సర్వేల ద్వారా తెలుకున్నారట.

సీఎం కేసీఆర్ సోషల్ ఇంజినీర్: హరీష్ రావు

Submitted by arun on Thu, 06/07/2018 - 14:30

గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేని పనిని సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా నాలుగేళ్లలో పూర్తి చేయించారన్నారు  భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్ రావు. ఖైరతాబాద్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ కార్యాలయంలో నాలుగేళ్ల ప్రగతి-ప్రాజెక్టులో సాగునీటి నిర్వహణపై రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన హరీశ్‌రావు..ముఖ్యమంత్రి కేసీఆర్ సోషనల్ ఇంజినీర్‌, సీఎం కేసీఆర్‌కు వ్యవసాయంపై మంచి అవగాహన ఉందన్నారు. కరువు జిల్లాగా పేరున్న మహబూబ్‌నగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, 6లక్షల 50 వేల ఎకరాలకు సాగునీరందించామన్నారు. గతంలో పరిపాలించిన కాంగ్రెస్ 50వేల ఎకరాలకు కూడా నీరందించలేకపోయిందన్నారు.

టీ కాంగ్ లీడర్లను వెంటాడుతున్న కన్నడ భయం

Submitted by arun on Thu, 06/07/2018 - 13:05

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త భయం వెంటాడుతోంది. అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అని.. వచ్చేది తమ ప్రభుత్వమే అని భరోసా ఇస్తున్న టీ కాంగ్రెస్ లీడర్లకు.. సరికొత్త టెన్షన్ పట్టుకుంది. యేళ్లుగా ఊరిస్తున్న అధికారం.. ఈ సారి వస్తే అది తమకే దక్కుతుందా..? లేదా..? అనే సమస్య పుట్టుకొచ్చింది. మరి టీ కాంగ్రెస్‌ నాయకులను అంతగా వేధిస్తున్న అంతర్మథనం ఏంటి..?