telanagana assembly elections

తెలంగాణలో టీఆర్ఎస్‌దే ప్రభంజనం: ఎగ్జిట్‌ పోల్స్

Submitted by chandram on Fri, 12/07/2018 - 20:54

శాసన సభ ఎన్నికల్లో గులాబీ ప్రభంజనం తప్పదని, జాతీయ ఛానెళ్ల ఎగ్జిట్‌ పోల్స్ తేల్చేశాయి. కేసీఆర్‌కు జనం బ్రహ్మరథం పట్టారని అంచనా వేశాయి. దాదాపు అన్ని జాతీయ ఛానెల్స్‌, కేసీఆర్‌ గెలుపు ఖాయమని తేల్చేయగా, ఒక్క రిపబ్లిక్‌ టీవీ మాత్రం హోరాహోరి తప్పదని లెక్కకట్టింది. చంద్రబాబుతో కాంగ్రెస్‌ పొత్తును జనం తిరస్కరించారని, కేసీఆర్ పథకాలు కొనసాగాలని, మెజారిటీ జనం గులాబీ పార్టీకే ఓట్లేశారని ఛానెల్స్ విశ్లేషించాయి. ఏ ఛానెల్‌, ఏ పార్టీకి ఎన్ని సీట్లిచ్చిందో ఒక్కసారి చూద్దాం.

కేటీఆర్ లెటెస్ట్ ట్వీట్.. 100సీట్లు..

Submitted by chandram on Fri, 12/07/2018 - 20:12

తెలంగాణలో ఎన్నికల మహాయుద్ధం ముగిసింది. ఎన్నికల రణక్షేత్రంలో విజేతలెవరో. పరాజితులెవరో ఇప్పటికే సర్వేలన్నీ వెల్లడించాయి. కాగా తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముగిసిన నేపథ్యంలో మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ట్వీట్టర్ వేదికగా స్పందించారు. గడిచిన మూడు నెలలుగా పార్టీ కోసం నిరంతరం పార్టీకోసం లక్షలాదీ మంది టీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముగిసిన పోలింగ్ నుండి వివరాలు సేకరించనని వెల్లడించారు. ఈ విరరాలలో టీఆర్ఎస్ పార్టీ దాదాపు 100సీట్ల సంఖ్యతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం అని కెటిఆర్ ధీమా వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

ఐమ్యాక్స్‌ వద్ద ప్రేక్షకుల ఆందోళన

Submitted by chandram on Fri, 12/07/2018 - 13:11

డిసెంబర్ 7కోసం అందరూ ఉత్కంఠగా ఎదురుచూశారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ అంతటా జోరుగా ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా ఎన్నికల సందర్భంగా నేడు అన్ని  ప్రయివేటు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ప్రయివేట్ సంస్థలకు సెలవు దినంగా ఈసి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ అంతటా ఎక్కడిక్కడ బంద్ వాతావరణం కనిపిస్తుంది. అయితే కొందరు సెలువు దినాన్ని అదునుగా చేసుకొని సినిమా థియేటర్ల వైపు బాట పట్టారు. కాగా నగరంలోని ఐమ్యాక్స్ థియేటర్ కు కొందరు సినీ అభిమానులు చేరుకున్నారు. ఎన్నిల కోడ్ నేపథ్యంలో నేటి ఉదయం షో ను ప్రదర్శించలేదు.

తెలంగాణ ఎన్నిక‌లు.. గెలుపోటములపై 'నారీ' ఓటర్లే కీలకం

Submitted by santosh on Thu, 12/06/2018 - 18:56

స్త్రీలు-పురుషులు ఇద్దరూ సమానమే కానీ. పురుషులు కాస్త ఎక్కువ సమానమని, సినిమాలో ఓ డైలాగ్‌ ఉంది. కానీ తెలంగాణలో దాదాపు 50 నియోజకవర్గాల్లో, పురుషుల కంటే మహిళల కాస్త ఎక్కువ సమానమని, ఏకంగా ఎన్నికల కమిషన్‌ తేల్చింది.తెలంగాణలోని అత్యధిక నియోజకవర్గాల్లో, మహిళా ఓటర్లే అధికం. ఈ విషయం చెబుతున్నది సాక్షాత్తు ఎన్నికల కమిషన్. మొత్తం ఓటర్ల డేటా విశ్లేషించిన ఈసీ, రాష్ట్రంలోని 50 నియోజకవర్గాల్లో పురుషుల కంటే, మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారని లెక్క తేల్చేసింది.