Woman

లిఫ్ట్‌లో చిన్నారిపై మహిళ అరాచకం

Submitted by arun on Fri, 11/16/2018 - 12:47

నాలుగేళ్ల చిన్నారి ధరించిన చెవి రింగులపై కన్నేసిన ఓ మహిళ, అత్యంత పాశవికంగా ఆ పాపను హింసించింది. ముంబైలోని ఓ అపార్టుమెంట్ లిఫ్ట్ లో ఈ ఘటన జరుగగా, దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ముంబయి శివారులోని ట్రాంబే ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్‌లోని లిఫ్ట్‌లో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. రెండు నిమిషాల నిడివి గల ఈ వీడియోలో రిజ్వానా బేగం(36) అనే నిందితురాలు నాలుగేళ్ళ చిన్నారిని అత్యంత దారుణంగా కొట్టింది. బాలిక చెవి రింగులు దొంగతనం చేయడం కోసమే రిజ్వానా ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. రిజ్వానా దగ్గర నుంచి బాలికకు చెందిన చెవి రింగులను స్వాధీనం చేసుకున్నారు.

నైటీ ధరిస్తే రూ.2 వేలు జరిమానా

Submitted by chandram on Sat, 11/10/2018 - 13:12

సర్వ సాధారణంగా అయితే  ట్రాఫిక్ పోలీసుల వద్ద, ప్రభుత్వ పరమైన చర్యలను ఉల్లగిస్తే జరిమానా విధింపు ఉంటుంది. అయితే ఒక ఊరిలో అయితే ఆడవాళ్లు నైటీలు ధరిస్తే మాత్రం అక్కడ జరిమాన చెల్లించల్సిందే. ఇందంత ఏ ప్రపంచంలోనో, దేశంలోనో కాదు మన పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని పశ్చిమగోదావరి జిల్లా తోకలపల్లి గ్రామంలో ఈ వింత ఆచారం ఉంది. ఈ ఉరిలో తొమ్మండుగురు మంది పెద్ద మనుషులు కలిసి కమిటీ ఏర్పాటు చేశారు. ఈ తీర్మాణంలో పొద్దుగల 7 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్య ప్రాంతానా ఆడవాళ్లు నైటీ వేసుకోరాదని ఖరాఖండిగా అందరి సమక్షంలో  తీర్మానించింది. ఒకవేళ ఈ నిబంధనలను ఉల్లగిస్తే రూ. 2వేల రూపాల జరిమాన విధించారు.

రోడ్డుపై ఇద్దరు భర్తల బాహాబాహీ...భార్య మూడో వ్యక్తితో లేచిపోయింది...

Submitted by arun on Tue, 08/07/2018 - 11:34

ఓ మహిళ తన భార్య అంటే తన భార్యే అంటూ రోడ్డుపైనే కొట్టుకోవడం చూసిన ఇద్దరు భర్తల ముద్దుల భార్యామణి...ఇద్దరికీ షాక్ ఇచ్చి మూడో వ్యక్తితో లేచిపోయిన విచిత్ర ఘటన బెంగళూరు నగరంలో సంచలనం రేపింది. బెంగళూరు శివారు ప్రాంతానికి చెందిన రంగస్వామి అనే వ్యక్తితో ఈ కిలాడీ లేడీ శశికళకు 2010లో వివాహయ్యింది. కొద్ది రోజులు కాపురం సాఫీగా సాగిపోగా.. తర్వాత కుటుంబ కలహాలతో భర్తను విడిచి వెళ్లింది. తర్వాత నగరంలోని గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే రమేష్‌కుమార్‌తో ఆమె సహజీవనం చేసింది. 2015లో అతడ్ని వదిలేసి కుమార్ అనే మరో వ్యక్తిని బుట్టలో వేసుకుంది. అతడి దగ్గర కూడా ఆరు నెలలు గడిపిన శశికళ మళ్లీ హ్యాండిచ్చింది.

గర్భిణీని 12 కిలోమీటర్లు భుజాలపై మోసిన భర్త

Submitted by arun on Tue, 07/31/2018 - 15:38

స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్ధాలు గడుస్తున్నా అడవి బిడ్డల తలరాతలు మారడం లేదు. అడవులనే ఆవాసాలుగా చేసుకుని జీవిస్తున్న గిరిపుత్రులకు కనీస వసతులు కూడా కరువయ్యాయి. విద్య, వైద్య అవసరాలు కూడా లేక నేటికి ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలోని గిరిజన ప్రాంతంలో ఓ బాలింతను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు నరక యాతను అనుభవించారు. సాలూరు మండలం సిరివరకు చెందిన జిందమ్మ అనే గిరిజన మహిళ నెలలు నిండకుండానే ప్రసవించింది. తీవ్ర రక్తస్రావం కావడంతో బిడ్డ మృతి చెందగా తల్లి అపస్మారక స్ధితిలోకి వెళ్లింది. 

ప్రాణం తీసిన పురుడు

Submitted by arun on Thu, 07/26/2018 - 17:24

ఇది సోషల్ మీడియా యుగం. అందరూ సామాజిక మాధ్యమాలను ఫాలో అవ్వడం ఎక్కువైపోయింది. ఏ పని చేయాలనుకున్నా యూ ట్యూబ్ వీడియోలు చూడటం వెంటనే చేసేయడం, అలా ఇద్దరు దంపతులు  యూ ట్యూబ్ వీడియోలను చూసి..ప్రమాదకర ప్రయోగం చేయాలనుకున్నారు. భార్యకు ఇంట్లోనే తానే డెలివరీ చేయలనుకున్నాడు భర్త. యూ ట్యూబ్ సూచనలు పాటిస్తూ ఇంట్లోనే బిడ్డకు జన్మనివ్వాలన్న ఆ దంపతుల వింత ఆలోచన కారణంగా నిండు ప్రాణం పోయింది. పురిటి నొప్పులతో బాధపడుతూ ప్రసవ వేదన అనుభవించిన ఆ తల్లి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తీవ్ర రక్తస్రావం కారణంగా మృతి చెందింది.

కొత్త కాపురంలో చిచ్చురేపిన పచ్చబొట్టు!

Submitted by arun on Fri, 07/20/2018 - 16:20

ఎంతో ముచ్చటపడి ఓ వ్యక్తి వేయించుకున్న పచ్చబొట్టు.. వాళ్ల కాపురంలో చిచ్చు రేపింది. కట్టుకున్న భర్త అని కూడా చూడకుండా భార్య.. నడిరోడ్డు పై భర్త దుమ్ముదులిపి వదిలిపెట్టింది. అందుకు కారణం ఏంటో తెలుసా..? భర్త చేతిపై పచ్చబొట్టే. తన భర్త చేతిపై మరో యువతి పేరుండటంతో సహించలేకపోయిన నవ వధువు దుమ్ము రేపేసింది. పెళ్లయిన ఐదోరోజే.. అది కూడా ఆలయమని కూడా చూడకుండా భర్తను చెడుగుడు ఆడేసింది. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా మేట్టుపాళయంలోని సాయిబాబా ఆలయంలో గురువారం ఈ సంఘటన జరిగింది. ఆలయంలో బాబా దర్శనం తర్వాత ఆ జంట ఆలయమెట్లపై కూర్చుని కబుర్లాడుకున్నారు.

యువతి కొంప ముంచిన హైహీల్స్‌

Submitted by arun on Mon, 07/02/2018 - 11:07

హైహీల్స్‌ ఓ యువతి కొంప ముంచాయ్‌. వేగంగా రోడ్డు దాటుతుండగా హైహీల్స్‌ చెప్పుల కారణంగా స్లిపయి కింద పడిపోయింది. ఇంతలోనే కారు ఆమెను ఢీకొంది. కారు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బ్రేకులు వేయడంతో ప్రమాదం తప్పింది. మెక్సికోలో 22 ఏళ్ల మినెర్వా ఫోన్లో మాట్లాడుతూ వేగంగా రోడ్డు దాటుతోంది. హైహీల్స్ కారణంగా పట్టుతప్పి పడిపోయింది. దీంతో అటుగా వస్తున్న కారు ఆమెను ఢీకొంది. అయితే కారు స్పీడుగా వెళ్లకపోవడం, డ్రైవర్ ప్రమాదాన్ని గ్రహించి వెంటనే బ్రేక్ వేయడంతో మినెర్వాకు ప్రమాదం తప్పింది. మినర్వాకు ప్రమాదం తప్పినా ఆమె కాలికి తీవ్ర గాయమైంది. దీంతో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

కర్నూలు జిల్లాలో కీచకపర్వం...ఒంటరి మహిళపై ఇద్దరు పోలీసుల అత్యాచార యత్నం

Submitted by arun on Mon, 07/02/2018 - 10:50

కర్నూలు జిల్లాలో ఇద్దరు పోలీసులు కీచకులుగా మారారు. ఒంటరిగానున్న మహిళపై అత్యాచారయత్నం చేశారు. 

బెజవాడలో సెక్స్ రాకెట్ గుట్టురట్టు

Submitted by arun on Thu, 06/21/2018 - 16:39

విజయవాడ జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో వ్యభిచారకూపం గుట్టు రట్టైంది. యువతులను ట్రాప్ చేసి.. వ్యభిచారకూపంలోకి దించుతున్న శోభారాణి అనే మహిళ బండారం బయటపడింది. ఏడాది క్రితం ఇంటి నుంచి పారిపోయి వచ్చిన ఓ యువతికి.. పని ఇప్పిస్తానని చెప్పి ఓ ఆటో డ్రైవర్ ఆమెను వ్యభిచారగృహానికి 20 వేలకు అమ్మేశాడు. అలా.. ఏడాదిగా ఆ యువతి నరకం అనుభవిస్తోంది. ఇప్పుడు స్థానికుల సాయంతో.. వ్యభిచారకూపం నుంచి బయటపడింది.

టెన్త్ క్లాస్ స్టూడెంట్‌కు ఎదురింటి ఆంటీ షాక్

Submitted by arun on Sat, 06/09/2018 - 12:35

దేశ వ్యాప్తంగా మహిళలు, బాలికలపై అత్యాచారాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కానీ, విజయవాడలో సీన్ రివర్స్ అయింది. 14 ఏళ్ల బాలుడిపై 40 ఏళ్ల ఓ వివాహిత లైంగిక దాడికి యత్నించింది. తన ఇంట్లోకి పిలిచి, అత్యాచారయత్నం చేసింది. నగరంలోని నున్నలో నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఈ ఘటన విజయవాడ పాయకాపురంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పాయకాపురం వాంబే కాలనీకి చెందిన ఓ మహిళ (45) భర్త ఎనిమిదేళ్ల క్రితం మరణించాడు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వాళ్లిద్దరికీ వివాహం చేసి అత్తారింటికి పంపేసింది. అప్పటి నుంచి ఆమె ఒంటిరిగా ఉంటోంది.