aatagadharaa siva movie

అర్దవంతమైన సినిమా ...ఆటగదరా శివ!

Submitted by arun on Wed, 12/05/2018 - 16:49

ఆటగదరా శివ 2018 లో విడుదలైన తెలుగు సినిమా.కన్నడలో ఘనవిజయం సాదించిన రామ రామరే సినిమా దీనికి మాతృక. ఈ సినిమాలో కన్నడ నటుడు దొడ్డన్న, ఉదయ్‌ శంకర్‌, జబర్దస్త్‌ ఫేం హైపర్‌ ఆదిలు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా దర్శకత్వం వహించింది ప్రముఖ దర్శకుడు చంద్ర సిద్ధార్థ. అలాగే నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేష్‌ . ఈ సినిమాకి సంగీతం వాసుకి వైభవ్‌ అందించారు. ఈ సినిమా కథ చాల విభిన్నమైనది, విలక్షనమైనది.. జంగయ్య (దొడ్డన్న) తలారీ. ఊళ్లో పశువులకు వైద్యం చేస్తూ ఉండే జంగయ్య, ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చినప్పుడు వెళ్లి తలారీ బాధ్యతలు నిర్వహిస్తుంటాడు.