Yadadri Bhuvanagiri

రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ భర్త.. తాట తీసిన భార్య!

Submitted by arun on Sat, 07/07/2018 - 13:51

వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తకు భార్య బుద్ధి చెప్పిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. కలెక్టరేట్‌లో ఏఓగా పనిచేస్తూ సస్పెండ్‌కు గురైన హరిప్రసాద్‌  గత కొద్ది కాలంగా మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. విషయం తెలుసుకున్న భార్య నిలదీయడంతో వేధించడం ప్రారంభించాడు.  నిన్న రాత్రి ఇంటికి రాకపోవడంతో విషయం గ్రహించిన భార్య   తల్లిదండ్రులతో కలిసి భర్త ఉన్న చోటుకు వెళ్లి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది. పారిపోయేందుకు ప్రయత్నించిన భర్తతో పాటు వివాహేతర సంబంధం సాగిస్తున్న మహిళకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.  

ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి

Submitted by arun on Fri, 12/22/2017 - 11:15

యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రాజపేట మండల శివారులోని ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. నాగభూషణం అనే వ్యక్తికి చెందిన కోళ్ల ఫారంలో పనిచేస్తున్నారు. కోళ్లఫారానికి దగ్గర్లో ఉన్న ఇంట్లో నివాసముంటూ జీవనం సాగిస్తున్నారు. మృతులు బాలనర్సయ్య, భారతమ్మ, వారి కూతురు తిరుమల, అల్లుడు బాలరాజు, పిల్లలు శ్రావణి, చింటూ, బన్నిలుగా గుర్తించారు. నాగభూషణం అనే వ్యక్తికి చెందిన కోళ్లఫారంలో కూలీలుగా పనిచేయడానికి కొద్ది రోజులు క్రితమే వచ్చారు. కూతురు, అల్లుడు, పిల్లల్ని చూసేందుకు రెండు రోజుల క్రితమే బాలనర్సయ్య, భారతమ్మ రాజపేటకు వచ్చారు.