telanagana

వర్కింగ్‌ ప్రెసిడెంట్‌‌గా కేటీఆర్‌‌ యాక్షన్ ప్లాన్ ఏంటి?

Submitted by chandram on Tue, 12/18/2018 - 21:48

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ పార్టీపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. బాధ్యతలు చేపట్టిన మర్నాడే పార్టీ బలోపేతం కోసం యాక్షన్ మొదలుపెట్టారు. ఇంతకీ కేటీఆర్‌‌ యాక్షన్ ప్లాన్ ఏంటి? కేటీఆర్‌ టీమ్‌లో ఎవరెవరు ఉండబోతున్నారు? పంచాయతీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కేటీఆర్ చేస్తోన్న వ్యూహరచన ఏంటి? టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన కేటీఆర్‌‌ అప్పుడే యాక్షన్‌ మొదలుపెట్టారు. పార్టీ బలోపేతం దిశగా చర్యలు చేపట్టారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ నిర్మాణంపై దృష్టిపెట్టిన కేటీఆర్‌‌ కార్యవర్గ సమావేశం నిర్వహించి ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేశారు.

20న హోంమంత్రిగా మహమూద్ అలీ బాధ్యతలు స్వీకరణ

Submitted by chandram on Tue, 12/18/2018 - 21:22

ఇటివలే రాష్ట్ర హోంమంత్రిగా మహమూద్‌ అలీ  సీఎం కేసీఆర్‌ గురువారం రాత్రి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా ఈనెల 20న తెలంగాణ రాష్ట్రహోంమంత్రిగా మహమూద్ అలీ బాధ్యతలు స్వీకరించనున్నారు. గురువారం నాడు నాంపల్లిలోని యూసుఫైన్ దర్గాకు పగలు 3గంటలకు వెళ్లి మహమూద్ అలీ చాదర్, పూలు మహమూద్ అలీ సమర్పించనున్నారు. అక్కడ అన్ని కార్యక్రమాలు ముగిసిక దేవుడి ఆశీర్వాదం తీసుకోని ఇక సక్కగా  సచివాలయానికి వెళ్లనున్నారు. 4గంటలకు డీ బ్లాక్‌లోని 3వ అంతస్తులోని రూమ్ నెంబర్ 440లో రాష్ట్ర హోంమంత్రిగా మహమూద్ అలీ బాధ్యతలు చేపట్టనున్నారు.

తెలంగాణను వణికిస్తున్న చలి

Submitted by chandram on Tue, 12/18/2018 - 20:46

తెలంగాణపై చలి పంజా విసిరింది. రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు కూడా పడిపోవడంతో రాత్రి సమయంలోనే కాదు పగటిపూట కూడా చలి ఎక్కువగా ఉంటోంది. చలిపులి దెబ్బకు చిన్నారులు, వృద్ధులు వణికిపోతున్నారు. ఇళ్లలో నుంచి అడుగు బయటపెట్టాలంటేనే భయపడిపోతున్నారు. పెథాయ్‌ తుపాను ప్రభావం తెలంగాణపై పడింది. తెలంగాణను చలి గజగజ వణికిస్తోంది. కొద్దిరోజులుగా సాధారణ స్థాయిలో ఉన్న ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంతో పోలిస్తే 2-3 డిగ్రీలు తగ్గాయి. మరో రెండు మూడు రోజులు ఇదే వాతావరణం ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

పన్ను వసూళ్ళపై జీహెచ్‌ఎంసీ దృష్టి

Submitted by chandram on Tue, 12/18/2018 - 19:29

బల్దియా ఆదాయంపై ఫోకస్ పెట్టారు జీహెచ్ఎంసీ అధికారులు. అసెంబ్లీ ఎన్నికల్లో బిజీబిజీగా గడిపిన గ్రేటర్ అధికారులు పన్నుల వసూళ్లపై దృష్టి మళ్లించారు. గ్రేటర్ ఆదాయాన్ని భర్తీ చేసేందుకు కసరత్తు మొదలు పెట్టారు. టాక్స్ వసూళ్ల కోసం టార్గెట్లు ఫిక్స్ చేశారు.  మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లో క్షణం తీరిక లేకుండా గడిపిన జీహెచ్ఎంసీ యంత్రాంగం నిలిచిపోయిన పన్నుల వసూళ్లకు కసరత్తు ముమ్మరం చేసింది. ప్రధానంగా జీహెచ్ఎంసీకి రావాల్సిన ప్రాపర్టీ టాక్స్ వసూలు మొదలు కొని ఇతర బిల్లుల వసూళ్లపై ఫోకస్ పెట్టారు. ప్రతి ఏడాది జనవరి వస్తుందంటే డే టూ డే కలెక్షన్లపై ప్రత్యేక చర్యలు చేపడుతుంది జీహెచ్ఎంసీ.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హరీశ్‌రావు

Submitted by chandram on Mon, 12/17/2018 - 17:57

తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గంలో తన్నీరు హరీశ్‌ రావు భారీ ఆధిక్యంతో విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా సోమవారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీతిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామిని కుటుంబ సమేతంగా సదర్శించుకున్నారు. సిద్దిపేట నియోజకవర్గం నుంచి లక్ష ఓట్లకుపైగా భారీ మెజారిటీతో గెలుపొంది హరీశ్‌రావు సరికొత్త రికార్డులు నెలకొల్పిన సంగతి తెలిసిందే. అయితే తర్వలో ప్రకటించనున్న మంత్రివర్గంలో హరీశ్‌ రావుకు తాజాగా ఏ మంత్రిత్వశాఖ కేటాయిస్తారన్నది అందరిలోనూ ఆసక్తికరంగా మారింది.


 

రేపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ..విశ్వాసపాత్రులు, సీనియర్లకు క్యాబినేట్‌లో అవకాశం ?

Submitted by chandram on Sun, 12/16/2018 - 08:48

రేపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. క్యాబినేట్ లో బెర్త్ కోసం ఆశావ‌హులు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ కెటీఆర్ ను ప్ర‌స‌న్నం చేసుకుంటే, మరికొందరు సామాజిక సమీకరణాలను నమ్ముకున్నారు. ఏ జిల్లాలో ఏ ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కనుందో ? తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్య‌మంత్రిగా కెసీఆర్ ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఆయ‌న‌తో ప్రమాణస్వీకారంచేసిన  మ‌హమూద్ అలీకి  హోంమంత్రిగా బాద్య‌త‌లు క‌ట్ట‌బెట్టారు. ఇక పూర్తి స్థాయి క్యాబినెట్ విస్త‌ర‌ణ‌పై కేసీఆర్ దృష్టిసారించారు.

జూన్‌లో సీఎంగా రాబోతున్నారా?

Submitted by chandram on Sat, 12/15/2018 - 15:02

తాజాగా తెలంగాణ సిఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ నుంచే జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించనున్నారని ఆయన కొడుకు కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలన నడిపిస్తూనే జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తారని వెల్లడించారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీట్‌ ది ప్రెస్‌’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ విలేకరి కేటిఆర్‌ను వచ్చే ఏడాది మే లేదా జూన్‌లో మీట్‌ ది ప్రెస్‌కు ముఖ్యమంత్రిగా ఏమైనా కేటీఆర్‌ రాబోతున్నారా అని ఓ పాత్రికేయుడు ప్రశ్నించగా దానికి కెటిఆర్ స్పందిస్తూ అలాంటిదేమి లేదని కొట్టిపారేశారు. 

లగడపాటి సర్వేపై కేటీఆర్ సెటైర్లు..

Submitted by chandram on Sat, 12/15/2018 - 13:43

లగడపాటి రాజగోపాల్ సర్వేపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల 88సీట్లతో టీఆర్ఎస్ పార్టీ  భారీ విజయం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ ముగిసి ఎగ్జీట్ పోల్స్ తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. జాతీయ మీడియా సంస్థలన్ని తెలంగాణలో టీఆర్ఎస్ గెలుస్తుందనీ సర్వేలు బల్లగుద్ది చెబితే, ఆంథ్రా అక్టోపస్ లగడపాటి రాజ్ గోపాల్ మాత్రం తెలంగాణలో టీఆర్ఎస్ ఓడిపోతుంది, కూటమి గెలుస్తుందని విచిత్ర సర్వేను ప్రజల ముందు ఉంచారని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు.

తెలంగాణలో కాంగ్రెస్ నేతలు సహకరించలేదు..అందుకే ఓడిపోయా!: కూటమి నేత

Submitted by chandram on Sat, 12/15/2018 - 13:29

ఇటివల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు తనను చాలా మోసం చేశారంటూ మహాకూటమి వైరా అభ్యర్ధి విజయసాయి సంచలన ఆరోపణలు చేశారు. మహాకూటమి పొత్తు ధర్మానికి సరిగ్గా కట్టుబడి కాంగ్రెస్ నేతలు సహకరించి ఉంటే వైరాలో తప్పకుండా గెలుపుబావుట ఎగిరేసేవాళ్లమని విజయసాయి తెలిపారు. కాంగ్రెస్ నేతలు నాకు సహకరించకుండా స్వతంత్ర అభ్యర్థి రాములు నాయక్ కే పూర్తి మద్దతు ఇచ్చారని వాపోయారు. అయినా ఇప్పుడు ఎం జరిగిందో తెలుసుగా ఇండిపెండెంట్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ ఇస్తూ అధికార పార్టీ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారని పేర్కోన్నారు.