Suspicious Death

అన్నపూర్ణ స్టూడియోలో అనుమానాస్పద మృతి

Submitted by arun on Thu, 05/31/2018 - 15:15

హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో పని చేస్తున్న నారాయణరెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆయన వయసు 53 ఏళ్లు. అయితే, ఆయన మృతదేహాన్ని స్టూడియో సిబ్బంది గుట్టు చప్పుడు కాకుండా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బంధువులకు సైతం సమాచారం ఇవ్వకుండా డెడ్ బాడీని తరలించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎవరైనా హత్య చేసి ఉండవచ్చునని నారాయణరెడ్డి బంధువులు భావిస్తున్నారు. అయితే తమకు సమాచారం ఇవ్వకపోవడాన్ని వారు తప్పు పడుతూ ఉస్మానియా ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. అటు-సమాచారం అందుకున్న పోలీసులు అన్నపూర్ణ స్టూడియోకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు.
 

మిస్టరీ డెత్... లింగంపల్లిలో రైలెక్కిన తర్వాత ఏం జరిగింది..?

Submitted by arun on Thu, 04/19/2018 - 12:37

బ్యుటీషియన్ జ్యోతి మృతి కేసు విచారణలో ఒక్క అడుగు కూడా ముందుకు పడట్లేదు. దర్యాప్తు ముమ్మరం చేశామంటున్న పోలీసులకు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. జ్యోతి ట్రైన్ నుంచి ప్రమాదవశాత్తు పడిపోయిందా..? లేదా ఎవరైనా తోసేశారా..? ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లు.. లవర్ సందీప్‌కు నిజంగానే ప్రమేయం ఉందా..? ఆ రోజు జ్యోతి వెంట ఎవరైనా ఉన్నారా..? అసలు సోమవారం నాడు ఏం జరిగింది..? ఇప్పటివరకు సమాధానం దొరకని ఈ ప్రశ్నల చుట్టే.. పోలీసుల విచారణ సాగుతోంది. 

బ్యూటీషియన్‌ అనుమానాస్పద మృతి

Submitted by arun on Mon, 04/16/2018 - 14:54

వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ధారూర్ మండలం మైలారం రైల్వే స్టేషన్‌లో ఓ బ్యూటీషియన్ హత్యకు గురైంది. హైదరాబాద్ లో బ్యూటీషియన్  గా పనిచేస్తున్న జ్యోతి.. అమ్మమ్మ వాళ్లింటికి వెళ్తుండగా హత్యకు గురైంది. అయితే జ్యోతి హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. జ్యోతి ప్రేమికుడు సందీప్‌పై ఆమె అక్క శోభ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 

ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి

Submitted by arun on Fri, 12/22/2017 - 11:15

యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రాజపేట మండల శివారులోని ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. నాగభూషణం అనే వ్యక్తికి చెందిన కోళ్ల ఫారంలో పనిచేస్తున్నారు. కోళ్లఫారానికి దగ్గర్లో ఉన్న ఇంట్లో నివాసముంటూ జీవనం సాగిస్తున్నారు. మృతులు బాలనర్సయ్య, భారతమ్మ, వారి కూతురు తిరుమల, అల్లుడు బాలరాజు, పిల్లలు శ్రావణి, చింటూ, బన్నిలుగా గుర్తించారు. నాగభూషణం అనే వ్యక్తికి చెందిన కోళ్లఫారంలో కూలీలుగా పనిచేయడానికి కొద్ది రోజులు క్రితమే వచ్చారు. కూతురు, అల్లుడు, పిల్లల్ని చూసేందుకు రెండు రోజుల క్రితమే బాలనర్సయ్య, భారతమ్మ రాజపేటకు వచ్చారు.