CM Chandrababu

పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు కౌంటర్

Submitted by arun on Sat, 04/21/2018 - 10:08

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. ధర్మపోరాట దీక్ష వేదికపైన ఆయనకు పరోక్షంగా చురకలు అంటించారు. ఎవరి వ్యక్తిత్వాన్ని కించపరచే అలవాటు లేదన్న చంద్రబాబు పవన్ కల్యాణ్ తన దీక్షను పక్కదోవ పట్టించే యత్నం చేశారని ఆరోపించారు. అటు మంత్రి లోకేష్ కూడా జనసేనాని ట్వీట్లపై స్పందించారు. 

చింతమనేనిపై సీఎం సీరియస్‌

Submitted by arun on Thu, 04/19/2018 - 10:29

దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై సీఎం చంద్రబాబు మరోసారి సీరియస్‌ అయ్యారు. విజయవాడ హనుమాన్‌ జంక్షన్‌లో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ పట్ల చింతమనేని వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా ప్రవర్తన వల్ల ప్రజల్లో పార్టీకి చెడ్డపేరు వస్తుందని మండిపడ్డారు. ఇవాళ తనను కలిసి ఘటనపై వివరణ ఇవ్వాలని చింతమనేని ఆదేశించారు. 

పదవుల పండగ...17 సంస్థలకు చైర్మన్ల నియామకం

Submitted by arun on Wed, 04/11/2018 - 11:17

నామినేటెడ్ పదవుల భర్తీపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ సహా 17 కార్పొరేషన్ల చైర్మన్లను భర్తీ చేస్తూ జాబితా విడుదల చేశారు. పదవుల పందేరంలో అన్ని ప్రాంతాలు, వర్గాల సమీకరణాలను పరిగణనలోకి తీసుకున్నారు. ముందు నుంచి అనుకుంటున్నట్టే ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్‌కు టీటీడీ చైర్మన్ పదవి దక్కింది. 

రాష్ట్రంలో పలు నామినెటెడ్ పోస్టులను సీఎం చంద్రబాబు నాయుడు భర్తీ చేశారు. టీటీడీ సహా పలు కార్పొరేషన్లకు చైర్మన్ల నియమించారు. చాలా వరకు ముందు అనుకున్న వారికే పదవులు దక్కాయి. కొందరికి ఆఖరి క్షణంలో అదృష్టం వరించింది. 

ఒకే నియోజకవర్గంలో చంద్రబాబు, జగన్‌

Submitted by arun on Tue, 04/10/2018 - 12:37

ఏపీ సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన‌ ఒకే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్స్ హాల్లో మూడు రోజుల పాటు జరిగే హ్యాపి సిటీ సెమినార్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సీఆర్డీఏ, సీఐఐ, లివబుల్ సిటీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు వివిధ దేశాల ప్రతినిధులతో ప్రతిష్టాత్మక సంస్ధల అధినేతలు రానున్నారు.  

మరో పోరాటానికి తెరతీసిన టీడీపీ

Submitted by arun on Fri, 04/06/2018 - 14:52

తెలుగు ప్రజలతో పెట్టుకుంటే ఖబడ్దార్ అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీని బలహీన పరచడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని బాబు ఆరోపించారు. బీజేపీ ప్రయత్నాలు ఎప్పటికి సఫలం కావన్ని ప్రధాని మోడీకి పరోక్షంగా సైకిల్ తొక్కి వార్నింగ్ ఇచ్చారు. విభజన ద్వారా ఏపీకి తీవ్రనష్టం కలిగించిన కాంగ్రెస్‌ పార్టీ నేడు రాష్ట్రంలో నామరూపాలు లేకుండా పోయిందని గుర్తు చేశారు. బీజేపీకి అదే పరిస్థితి తప్పదని హెచ్చరించారు. 

అమరావతిలో సైకిల్‌ యాత్ర

Submitted by arun on Fri, 04/06/2018 - 11:13

తెలుగు వారిని దెబ్బతీయాలని చూస్తే ఖబడ్డార్ అంటూ సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్రమోడీని హెచ్చరించారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఎంపీలు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా చేపట్టిన సైకిల్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. వెంకటపాలెం నుంచి అసెంబ్లీ వరకు సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన తెలుగుదేశంపై  కుట్రలు కొత్తకాదన్నారు. ఇందిరా గాంధీ మెడలు వంచిన చరిత్ర తమదన్నారు. తెలుగు వారికి అన్యాయం చేసిన సోనియా గాంధీని రాష్ట్ర ప్రజలు మట్టికరిపించారన్న చంద్రబాబు రాష్ట్రానికి అన్యాయం చేస్తే నరేంద్ర మోడీకి అదే గతి పడుతుందంటూ హెచ్చరించారు. 

ఎవరు నిప్పు..?ఎవరు పప్పు..?

Submitted by arun on Wed, 04/04/2018 - 11:49

ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా సెంటిమెంట్ బలపడటం, 2019 ఎన్నికల్లో అది ప్రభావం చూపనుండటంతో ప్రధాన పార్టీలైన టీడీపీ-వైసీపీ మధ్య మాటల వార్ కోటలు దాటుతోంది. ముఖ్యంగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకొని విజయసాయి చేస్తున్న విమర్శలు.. ఒక్కోసారి హద్దులు దాటుతూ మంటలు రేపుతున్నాయి.

ఢిల్లీలో బాబు హోదా పోరు

Submitted by arun on Tue, 04/03/2018 - 10:37

ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ప్రత్యేక హోదా పోరును జాతీయ స్థాయిలో లేవనెత్తేందుకు సిద్ధమయ్యారు. ఏపీ భవన్‌లో పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. తొమ్మిది రోజులుగా అవిశ్వాసం నోటీసు ఇస్తున్నా అన్నాడీఎంకే ఎంపీల ఆందోళనను సాకుగా చూపి సభను వాయిదా వేయడంపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరో మూడు రోజులే పార్లమెంట్‌ సమావేశాలు కొనసాగనున్నందున ఇవాళ, రేపులోగా అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చేలాగా చూడాలని పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.

రాయలసీమపై చంద్రబాబుకు ప్రేమ లేదు: సోము వీర్రాజు

Submitted by arun on Sat, 03/31/2018 - 15:55

సీఎం చంద్రబాబుకు రాయలసీమపై ప్రేమలేదన్నారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిధులతో ఎలా పూర్తి చేస్తామంటున్నారో.. మిగిలిన ప్రాజెక్టులను కూడా అలాగే పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.  కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్న ఆయన ... చంద్రబాబు సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని చెప్పారు. రాష్ట్రంలో ఏ మంత్రికీ అధికారం లేదని, కేవలం సీఎం, ఆయన తనయుడి కనుసన్నల్లోనే పాలన నడుస్తోందని మండిపడ్డారు.

మరోసారి తప్పులో కాలేసిన చంద్రబాబు

Submitted by arun on Sat, 03/31/2018 - 15:24

నోరు జారడంలో తన తనయుడు నారా లోకేశ్‌ను మించిపోయారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. శుక్రవారం కడపలోని ఒంటిమిట్టలో జరిగిన కోదండరామస్వామి కల్యాణానికి సతీసమేతంగా వెళ్లిన చంద్రబాబు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్రమైన వ్యాఖ్యలు చేశారు. ‘కోదండరామస్వామి దేవాలయం.. ఒక చరిత్ర కలిగిన దేవాలయం. ఒక చరిత్ర ఉండే దేవాలయం ఇది. ఆ చరిత్రను ఇంకా ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతోని ఈ టెంపుల్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నాం. ఇక్కడ చూస్తే ఆ రోజు బమ్మెర పోతన ఇక్కడనే రామాయణం రాసి.. ఈ దేవునికి అంకితం చేసిన విషయం కూడా మనమందరం గుర్తుపెట్టుకోవాలి’ అని చెప్పుకొచ్చారు.