Rajya Sabha

కేంద్రానికి ఝలక్ ఇచ్చిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్...తొలి రోజునే కీలక నిర్ణయం

Submitted by arun on Sat, 08/11/2018 - 10:52

 ఎన్డీయే అభ్యర్థిగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన హరివంశ్ సింగ్ బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ఓ ప్రైవేటు తీర్మానంపై ఓటింగ్‌కు అనుమతినిచ్చి కేంద్రాన్ని ఇరకాటంలోకి నెట్టేశారు. అయితే, ఆ సమయంలో విపక్ష సభ్యులు ఎక్కువమంది సభలో లేకపోవడంతో ప్రభుత్వం బయటపడగలిగింది.విషయమేంటంటే- ఒక రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలుగా రిజర్వేషన్‌ ఉన్నవారు మిగిలిన రాష్ట్రాల్లో సైతం ఎస్సీ ఎస్టీలుగా ఆ సౌలభ్యం అనుభవించేట్లు రాజ్యాంగాన్ని సవరించాలని విశ్వంభర్‌ ప్రసాద్‌ నిషాద్‌ అనే సమాజ్‌వాదీ సభ్యుడు ఓ ప్రైవేటు తీర్మానం ప్రవేశపెట్టారు.

ముసుగులు తొలగిపోయాయ్..2019లో ఎవరు ఎవరెవరితో ...

Submitted by arun on Fri, 08/10/2018 - 11:35

నిన్నటి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక 2019 ఎన్నికల తీరును కళ్లకు కడుతోందా?  ఇన్నాళ్లూ గుంభనంగా వ్యవహరించిన పార్టీలన్నీ రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా తమ వైఖరిని బయటపెట్టక తప్పలేదా?2019లో యూపీఏ వర్సెస్ ఎన్డీఏ యుద్ధంలో ప్రాంతీయ పార్టీలలో ఏ పార్టీ ఎటువైపు? ఈ అంశంపై క్లారిటీ వచ్చిందా?

వ్యూహాత్మకంగా అడుగేసిన బిజెపి

Submitted by arun on Thu, 08/09/2018 - 16:29

రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ ఎన్నికలో కాషాయదళం విజయం సాధించింది. అమిత్‌షా- మోదీల మంత్రాగం ముందు విపక్షాల ఐక్యత రాగం పనిచేయలేదు. సార్వత్రిక ఎన్నికల వ్యూహాన్ని వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చిన కమలదళం రాజ్యసభలోనూ తన ఆధిపతాన్ని నిరూపించుకుంది. ఈ సందర్భంగా విజయం సాధించిన హరివంశ్‌ నారాయణ్‌‌కు వివిధ పక్షాల నేతలు అభినందనలు తెలియజేశారు. 

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో ఊహించని మలుపులు

Submitted by arun on Thu, 08/09/2018 - 10:30

మరో గంటలో రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ ఎన్నిక జరగనున్న నేపధ్యంలో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి, ఈ ఎన్నికలో ఎలాగైన విజయం సాధించాలని భావిస్తున్న కాంగ్రెస్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. నిన్నటి వరకు కాంగ్రెస్ అభ్యర్ధికి మద్ధతిస్తామంటూ ప్రకటించిన మమత బెనర్జీ  మాటమార్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఓటింగ్‌కు గైర్హాజరు కావాలని ఎంపీలను ఆదేశించినట్టు సమాచారం. ఇక ఇదే సమయంలో  కాంగ్రెస్‌ అధినేత రాహుల్ గాంధీ ఫోన్ చేసినా  మద్ధతిచ్చేందుకు  ఆప్‌, పీడీపీలు నిరాకరించాయి. ఇక నిన్నటి వరకు కాంగ్రెస్‌కు మద్ధతిచ్చిన వైసీపీ కూడా ఓటింగ్‌కు దూరంగా ఉన్నట్టు ప్రకటించింది.

గురువారం ఉదయం ఎన్ని- కలలో

Submitted by arun on Wed, 08/08/2018 - 17:40

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ పదవికై ఇక నిలిచే,

ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్‌ వలచే,

ఎంపీ బీకే హరిప్రసాద్‌ , తను బరిలోకి దిగుటచే,

గురువారం ఉదయం కొరకు అంతా వేచే! శ్రీ.కో

రాజ్యసభలో మరోసారి అధికార, విపక్షాలు ఢీ...డిప్యూటీ చైర్మన్ పదవి కోసం పోటా పోటీ వ్యూహాలు

Submitted by arun on Tue, 08/07/2018 - 11:02

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నగారా మోగింది. ఎల్లుండి జరిగే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. తగిన సంఖ్యాబలం లేకపోయినా..కీలక పదవిని దక్కించుకోవడానికి అధికార ఎన్డీఏ వ్యూహాలు రచిస్తోంది. పీజే. కురియన్ పదవీకాలం ముగియడంతో ఖాళీ అయిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి గురువారం ఎన్నిక నిర్వహిస్తున్నారు. 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకూ నామినేషన్లు వేసేందుకు గడువు ఉంది. ఇంతకాలం యూపీఏ చేతిలో ఉన్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలనే పట్టుదలతో బీజేపీ ఉంది. అయితే పెద్దల సభలో బీజేపీ అతిపెద్దగా పార్టీగా ఉన్నప్పటికీ పూర్తి స్థాయి మెజారిటీ లేకపోవడం ఇబ్బందిగా మారింది.

వెంకయ్యకు క్షమాపణలు చెప్పిన విజయసాయిరెడ్డి

Submitted by arun on Wed, 07/25/2018 - 14:28

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభకు క్షమాపణలు చెప్పారు. ఏపీ విభజన చట్టంపై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా తాను ప్రవర్తించిన తీరుకు విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతున్న సమయంలో సమయం అయిపోయిందంటూ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ఆయన్ని నిలువరించారు. దీంతో విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఛైర్మన్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ వెల్‌లోకి దూసుకెళ్లారు. విజయసాయి తీరును విపక్ష సభ్యులందరూ తప్పుబట్టారు. ఛైర్మన్‌పై అమర్యాదకరంగా ప్రవర్తించిన విజయసాయిరెడ్డి క్షమాపణలు చెప్పడానికి ఎందుకు వెనకాడుతున్నారని నిలదీశారు.

ఏపీని సానుభూతితో చూడాలి: ఆజాద్‌‌

Submitted by arun on Tue, 07/24/2018 - 17:36

విభజన సమస్యలు తెలిస్తేనే ఏపీ సమస్యలు తెలుస్తాయన్నారు కాంగ్రెస్‌ రాజ్యసభ పక్ష నేత గులాం నబీ ఆజాద్‌. ఏపీ విభజన చట్టంపై జరిగిన చర్చలో మాట్లాడిన ఆయన దేశం మొత్తం ఏపీపై సానుభూతితో వ్యవహరించాలని కోరారు. ఏపీ ప్రజలు అనేక ప్రాంతాల ప్రజలతో కలిసి ఉన్నారని రాజకీయ నేతగా వారితో తనకెంతో అనుబంధం ఉందన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలన్నారు. 1947లో కోస్తాంధ్ర, రాయలసీమ మద్రాస్‌లో భాగంగా ఉన్నాయని, హైదరాబాద్‌ ప్రత్యేక రాష్ట్రంగా ఉండేదని చెప్పారు.
 

ప్రమాణస్వీకారం చేసిన నూతన రాజ్యసభ సభ్యులు

Submitted by arun on Tue, 04/03/2018 - 13:07

రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన వారు ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. ఏపీకి చెందిన సీఎం రమేశ్.. రాజ్యసభ సభ్యుడిగా తిరిగి ప్రమాణస్వీకారం చేశారు. అలాగే టీడీపీకి చెందిన కనకమేడల రవీంద్రకుమార్ తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు. తర్వాత ఉత్తరప్రదేశ్  నుంచి ఎన్నికైన ఏపీకి చెందిన జీవీఎల్  నరసింహారావు కూడా తెలుగులోనే ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఛైర్మెన్  వెంకయ్యనాయుడు వీరికి పెద్దల సభకు స్వాగతం పలికారు. 

రాజ్యసభకే వన్నె తెచ్చిన మాస్టర్ సచిన్ టెండుల్కర్

Submitted by arun on Mon, 04/02/2018 - 16:18

భారత క్రికెట్ దేవుడు మాస్టర్ సచిన్ టెండుల్కర్ మరోసారి తన పెద్దమనసును చాటుకొన్నాడు. ప్రపంచ మేటి క్రికెటర్ గా మాత్రమే కాదు రాజ్యసభ సభ్యుడిగా కూడా భారత పార్లమెంట్ కే వన్నె తెచ్చాడు. పెద్దల సభలో సభ్యుడిగా ఆరేళ్ల తన ఇన్నింగ్స్ ను ఘనంగా ముగించాడు. కోట్లకు పడగలెత్తిన పార్లమెంట్ సభ్యులకే ఆదర్శంగా నిలిచాడు.