Telangana2018 elections

గెలుపు ధీమాలో ఇరు పార్టీల హోరాహోరి.. గెలుపు ఎవరిని వరిస్తోందో?

Submitted by chandram on Sun, 12/09/2018 - 09:21


తెలంగాణ ఎన్నికల ఘట్టం ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం స్ట్రాంగ్ రూమ్ ల్లోకి చేరింది. గెలుపుపై ఎవరికి వారు ధీమాలో ఉన్నారు. తమ మ్యాజిక్ ఫిగర్ ఇదంటూ ప్రకటిస్తున్నారు. సంబరాలకు సిద్ధంగా ఉండాలంటూ కేటీఆర్ పిలుపునివ్వగా 12న ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు ఉత్తమ్ వెల్లడించారు. ఓ వైపు ఎగ్జిట్ పోల్ సర్వేలు మరోవైపు స్ట్రాంగ్ రూమ్ లకు చేరిన ఈవీఎంలు గెలుపుపై పార్టీలు ఎవరి ధీమాలో వారు ఉన్నారు. తమ మ్యాజిక్ ఫీగర్ ఇదంటూ పార్టీలు ప్రకటించుకుంటున్నాయి. స్ట్రాంగ్ రూమ్ లకు చేరిన ఈవీఎంలపై పార్టీలు ఓ కన్నేసి ఉంచాయి. 11న జరిగే కౌంటింగ్ అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నాయి. 

ఎన్నికల రణక్షేత్రంలో రియల్‌ టైమ్‌ సునామీ

Submitted by santosh on Thu, 12/06/2018 - 20:35

తెలంగాణలో మహా యుద్ధాని మరికొన్ని గంటలే మిగిలున్నాయి. ఎన్నికల రణక్షేత్రంలో విజేతలెవరో. పరాజితులెవరో తేలిపోయే సమయం వచ్చేసింది. ఆధిపత్యం ఎవరిదో ఆశలు గల్లంతెవరికో పాలకు పాలు నీళ్లకు నీళ్లలా తేటతెల్లం కానున్నాయి. ఎన్నికల యుద్ధానికి హెచ్‌ఎంటీవీ వైడ్ రేంజ్ నెట్‌వర్క్‌తో విస్తృతమైన కవరేజ్‌తో తెలంగాణను మీ ముందుంచేందుకు సంసిద్ధంగా ఉంది. మారే లెక్కల్ని జరిగే పరిణామాల్ని సరికొత్త సమీకరణలతో సరికొత్త ట్రెండ్‌తో సునామీ సృష్టించబోతోంది హెచ్‌ఎంటీవీ. కమాన్‌ ఈ ఫ్రైడే విస్తృతమైన నెట్‌వర్క్‌. పటిష్టమైన గ్రౌండ్‌ వర్క్‌, లోతైన పరిశీలన. అద్భుతమైన విశ్లేషణ సార్వత్రిక ఎన్నికల సమరానికి హెచ్‌ఎంటీవీ సిద్ధమైంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది గంటల్లో...

Submitted by chandram on Thu, 12/06/2018 - 18:49

తెలంగాణలో మహాయుద్ధాని మరికొన్ని గంటలే సమయం ఉంది. దీంతో పోల్ తెలంగాణ కోసం అధికారయంత్రాంగం సర్వం సిద్దం చేసింది. భారీ భద్రత మధ్య ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు.  ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. మరికొద్ది గంటల్లో తెలంగాణ ఎన్నికల సంగ్రామంలో ఆఖరి అంకానికి తెరలేవనుంది. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కు ఏర్పాటు పూర్తి చేసింది ఈసీ. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, పోలింగ్ సాఫీగా జరిగేలా అన్ని రకాల చర్యలను తీసుకుంది. ఈసీ రజత్ కుమార్ నుంచి కిందిస్దాయి ఉద్యోగి వరకు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు.

మద్యం సేవించి వస్తే కఠిన చర్యలు: రజత్‌కుమార్‌ 

Submitted by chandram on Thu, 12/06/2018 - 18:07

ఎన్నికల సమయానికి ఇంకా కొన్ని గంటలే మిగిలాయి. అయితే పోలింగ్ బూత్ వద్ద ఎలా వ్యవహరించాలో తెలంగాణ ఈసీ రజత్ కుమార్ తెలిపారు. ‌ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ వద్దకు సెల్ ఫోన్స్, కెమెరాలు నిషేధించామని, అలాగే మందు బాబులు మధ్యం సేవించి పోలింగ్ బూత్ వద్దకు వస్తే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చిరించారు, అలాగే ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని వృద్దులకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో ప్రతి ఏటా పోలింగ్ శాతం 55 కంటే ఎక్కవ లేనేలేదని, ఈసారి మాత్రం ఏడున్నర లక్షల మంది మొదటి సారి ఓటు వేస్తున్నారని తెలిపారు.

పట్నంకు ప్రధాని మోడీ రాక..

Submitted by chandram on Mon, 12/03/2018 - 12:22

తెలంగాణలో బీజేపీ కూడా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. జాతీయ నాయకులనే నమ్ముకున్న కమలం పార్టీ ఛరిష్మా ఉన్న నాయకులను రప్పిస్తూ ప్రచారాన్ని వేడెక్కిస్తోంది. నిన్నంతా అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్‌, గడ్కరీతో ప్రచారం నిర్వహించిన కాషాయం పార్టీ ఇవాళ హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ సాయంత్రం ఎల్‌ బీ స్టేడియంలో 4 గంటలకు సభకు ప్రధాని మోడీ హాజరుకానున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సభకు రాష్ట్ర బీజేపీ క్యాడర్‌ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోని శివారు ప్రాంతల పరిధి నుంచి జనసమీకరణ చేస్తున్నారు.

టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే అకౌంట్‌లో డబ్బులు వేస్తామంటూ...

Submitted by chandram on Mon, 12/03/2018 - 11:06

ఖమ్మం జిల్లా ముదిగొండ పోలీస్ స్టేషన్ ఎదుట టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క, స్థానిక టీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది. టీఆర్‌ఎస్‌ నేతలు డబ్బులు పంచుతున్నారంటూ భట్టి విక్రమార్క ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. కాంగ్రెస్‌కు పోటీగా టీఆర్‌ఎస్‌ నేతలు కూడా ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇరువర్గాలను అదుపు చేయడానికి పోలీసులు భారీగా మోహరించారు. టీఆర్ఎస్‌ కార్యకర్తలు ఓటర్ల నుంచి ఆధార్ కార్డుల జిరాక్స్‌లు, బ్యాంక్ అకౌంట్, ఫోన్ నెంబర్లను సేకరిస్తున్నారంటూ ఆదివారం ఉదయం కాంగ్రెస్ కార్యకర్తలు ముదిగొండ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు.

తెలంగాణ ఎన్నికలతో మద్యం షాపులకు బ్రేక్..

Submitted by chandram on Mon, 12/03/2018 - 10:55

తెలంగాణ ఎన్నికలతో మద్యం అమ్మకాలకు ఎలక్షన్ కమిషన్ బ్రేక్ వేసింది. 5వ తేదీ సాయంత్రం నుండి ఏడవ తేదీ వరకు 48 గంటలు మద్యం దుకాణాలతో పాటు బార్లు, క్లబ్ లు మూసివేయాలని ఈసీ ఆదేశించింది. మద్యం అమ్మకాలపై పోలీస్, ఎక్సైజ్ శాఖ ఫోకస్ పెట్టాలని ఈసి కోరింది. ఎన్నికల వేళ మద్యం దుకాణాలు మూతపడుతున్నాయి. ఏడవ తేదీన జరిగే పోలింగ్ దృష్ట్యా 48 గంటలు మద్యం అమ్మకాలు నిలిపివేసింది ఈసీ, ఎక్సైజ్ శాఖ.  డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 7వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలన్నీ మూసి వేయాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి దాన కిశోర్ ఆదేశాలు జారీ చేశారు. 

నిరుద్యోగ యువతను టీఆర్ఎస్ మోసం చేసింది..: అమిత్ షా

Submitted by chandram on Sun, 12/02/2018 - 17:27

నిరుద్యోగ యువతను టీఆర్‌ఎస్ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా నిరుద్యోగులకు మేలు చేయలేకపోయారంటూ విమర్శించారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకర్తిలో నిర్వహించిన మార్పు కోసం బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. తమ పార్టీని గెలిపిస్తే అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్ధానానికి చేరుస్తామంటూ హామి ఇచ్చారు . మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న కేసీఆర్ ఎవరికి రిజర్వేషన్లు తగ్గిస్తారో చెప్పాలంటూ అమిత్ షా డిమాండ్ చేశారు.