telanagana2018 elections

భావోద్వేగంతో ముడిపడిన ఒక సమస్యని అలా నిలిపిన ధీరత్వం

Submitted by santosh on Thu, 12/13/2018 - 19:37

నాభాష నాయాస నాగోస అంటూ కేసిఆర్ తెలంగాణ ఉద్యమాన్ని పరుగులు పెట్టించారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం చేస్తున్న పోరాటం అని తెలంగాణ జనానికి భరోసా కలిగేలా ఆయన ప్రసంగాలు సాగాయి. ఆయన చేసిన విమర్శలకి, ఇచ్చిన స్ఫూర్తికి తెలంగాణ గజ్జెకట్టింది. తీన్మార్ ఆడింది. తెలంగాణ ఉద్యమాన్ని 14 ఏళ్ల పాటూ నిలబెట్టడం మాములు మాటేమీ కాదు. అది ఓ సామాన్య రాజకీయ నాయకుడి తరమూ కాదు. ఇంకా అందులోనూ భావోద్వేగంతో ముడిపడిన ఒక సమస్యని అన్నేళ్ల పాటూ కళ్లెం వేసి సరైన రీతిలో నడపడం మహామహులకి మాత్రమే సాధ్యపడుతుంది.. ఉద్యమాన్ని టోన్‌డౌన్ చేయాల్సి వచ్చినప్పుడు.. కొంతకాలం పాటూ విరామం ఇవ్వాల్సి వచ్చినప్పుడు కాడి వదిలేయకుండా..

వ్యూహాత్మక విరామం... ఎత్తుగడ మారుతుంటుంది

Submitted by santosh on Thu, 12/13/2018 - 19:32

కేసిఆర్‌కి ఎవరైనా ఒక్కరే లక్ష్యసాధనలో వ్యూహాత్మకంగా అడుగులు పడతాయి పెదాలు కదులుతాయి. సందర్భాన్ని బట్టి పదాలు పడతాయి. పరిస్థితులను బట్టి వేరియేషన్స్ మారతాయి. మూడ్స్ మారతాయి.. జనం దృష్టి ఎవరిపై టార్గెట్ చేయాలో వారిని వ్యూహాత్మకంగా మాటల చట్రంలో బంధిస్తారు.. ఒక విధంగా చెప్పాలంటే టార్గెట్ సెట్ చేసి వదిలేస్తారు. ఇక ఆ దాడిలోంచి బయటపడటం అన్నది ప్రత్యర్ధి సమస్య. ఉద్యమం అంటే కొలిమి కాదు. నిరంతరం రగిల్చేందుకు. ఇందులో వ్యూహాత్మక విరామం ఉంటుంది... ఎత్తుగడ మారుతుంటుంది... ఈ శైలే కారుకు విజయాన్నిచ్చింది. వివిధ సందర్భాల్లో  ఆయన ఏం మాట్లాడినా, ఎలా మాట్లాడినా దానిని సమర్ధించుకునే సత్తా ఆయనకుంది. 

పధ్నాలుగేళ్ల పాటూ ఉద్యమాన్ని నడపడం మాటలు కాదు

Submitted by santosh on Thu, 12/13/2018 - 19:27

పదిహేడేళ్లలో ఎంత తేడా? అప్పట్లో ఆయన ఆంధ్రుడి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన పార్టీలో సభ్యుడు.. తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలను పొగడుతూ పార్టీ కోసం పాటలే రాసిన అభిమాని.. కాలగమనంలో ఆ పార్టీనే సవాల్ చేసే ప్రత్యర్ధిగా మారిపోయారు.. టీఆర్‌ఎస్‌ ప్రస్థానం, కేసిఆర్ బ్యాక్‌డ్రాప్ ఓసారి చూద్దాం. కేసిఆర్ ప్రస్థానంలో ప్రతీ అడుగూ ప్రత్యేకమే. వేసే ప్రతీ అడుగు మాట్లాడే ప్రతీ మాట ప్రత్యేకమే. పధ్నాలుగేళ్ల పాటూ ఉద్యమాన్ని నడపడమంటే మామూలు వ్యక్తులకు సాధ్యం కాదు.. అందులోనూ భావోద్వేగంతో ముడిపడిన సమస్యని నిరంతరం లైమ్ లైట్‌లో ఉంచడం చిన్న విషయమేమీ కాదు 2001 ఏప్రిల్‌ 27కి ముందు ఆయన తెలుగుదేశం అభిమానిగా పార్టీలో చేరారు.

ఉత్తర తెలంగాణలో ఉరకలెత్తిన కారుజోరు

Submitted by chandram on Tue, 12/11/2018 - 21:49

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కొనసాగిన ఉత్కంఠకు తెరదించుతూ తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. క్లియర్ కట్ మెజార్టీతో అధికార పార్టీ మరోసారి విజయ ఢంకా మోగించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాల కన్నా ఎక్కువ సీట్లనే సాధించింది. అయితే, ఉత్తరతెలంగాణలో గతంలో కన్నా ఎక్కువ చోట్ల కారుజోరు కొనసాగింది. గులాబీ పార్టీ తన పట్టును మరింత పెంచుకుంది.  ఉద్యమాల పురిటిగడ్డ, రాజకీయ చైతన్యానికి జీవగడ్డ ఉత్తర తెలంగాణ. మొదట నుంచి ఈ ప్రాంతానికి తెలంగాణలో రాజకీయ చైతన్యం ఎక్కువ.

అన్నలు వద్దట.. తమ్ముళ్లకే పట్టం కట్టిన ప్రజలు

Submitted by chandram on Tue, 12/11/2018 - 19:54

తెలంగాణ ఎన్నికల్లో ఒకే కుటుంబం నుంచి ఎంతమంది పోటీ చేసినా గెలుపు మాత్రం ఒకరికే కట్టబెడతామంటున్నారు తెలంగాణ ప్రజలు. ఒక్క కేసిఆర్ కుటుంబానికి మాత్రం ఈ రూల్ నుంచి మినహాయింపు ఉందని తేల్చారు. కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులకు బ్రహ్మరథం పట్టిన ఓటర్లు మిగిలిన నేతలకు మాత్రం గెలుపు ఒకరికేనని తేల్చి చెప్పారు. ఈ ఎన్నికల్లో ముగ్గురు అన్నదమ్ముల జంటలు పోటీ చేయగా అన్నలందరినీ ఓడించి తమ్ముళ్లను మాత్రం గెలిపించారు ఓటర్లు.

కూటమి ఓటమికి గల కారణాలేంటి.? ముందస్తుకు సిద్దంగా లేకపోవడమేనా..?

Submitted by santosh on Tue, 12/11/2018 - 19:35

గులాబీ కోటను కూల్చేస్తామన్నారు. ఎగ్జిట్‌పోల్స్‌ పచ్చి బూటకమన్నారు. మెరుగైన పాలన అందిస్తామన్నారు. తెలంగాణ ఇచ్చింది, తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ కూటమే అన్నారు. కానీ కారు స్పీడ్‌కు కకావికలమయ్యారు. ఫార్ములా వన్‌ రేసులా దూసుకొచ్చిన కారు చక్రాల కింద పడి నలిగిపోయారు. ప్రజాకూటమి కొంప కొల్లేరు కావడానికి ఏడు కారణాలున్నాయి అవెంటో చూద్దామా?. ఒకవైపు కేసీఆర్‌ దండయాత్ర సంకేతాలు పంపిస్తూనే ఉన్నారు. ముందస్తు సమరం తప్పదని చెబుతూనే ఉన్నారు. కానీ ఇవన్నీ ప్రత్యర్థి కాంగ్రెస్‌ పసిగట్టలేకపోయింది. హఠాత్తుగా వచ్చిపడిన ముందస్తు యుద్ధానికి సిద్దంగా లేకపోవడమే కాంగ్రెస్‌ కూటమికి తొలి కారణం.

కేసీఆర్‌ మాటలు, చేతలూ నమ్మి వీరతిలకం దిద్దిన జనం

Submitted by santosh on Tue, 12/11/2018 - 18:50

ఒక్కడు. ఒకే ఒక్కడు. చరిత్ర సృష్టించిన మొనగాడు. అఖండ విజయాన్ని ముద్దాడిన తెలంగాణ సాధకుడు. సరికొత్త చరిత్ర లిఖించిన నాయకుడు. ముందస్తు యుద్ధంతో తొడగొట్టిన ధీరుడు. ఒక్కొక్కరూ కాదు, వందమందైనా ఒకేసారి రమ్మను అంటూ ఛాలెంజ్‌ విసిరి, దుమ్మురేపిన చింతమడక చిన్నోడు. తన పార్టీ అభ్యర్థులను కాదు, తనను చూసి ఓటేయ్యమని ధైర్యంగా అడిగిన వీరుడు. తన పాలనాదక్షతతో తెలంగాణ ప్రజల మనసు గెలిచిన ధీరుడు. ప్రజాకూటమి సైన్యంపై, గులాబీదళాధిపతి ఎలా విజయం సాధించాడు సకల జనుల ఆశీర్వాదం ఎలా పొందాడు? 

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పవన్ స్పందన

Submitted by chandram on Tue, 12/11/2018 - 18:21

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయవేత్తలు వరుస ట్వీట్ల, ఫోన్లతో అభినందనలు తెలిపుతున్నారు. తాజాగా టీఆర్ఎస్ పార్టీ విజయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్టర్ వేదికగా స్పందించారు. టీఆర్ఎస్ అధినేత కెసిఆర్, కెటిఆర్, హరీశ్ రావు పార్టీ శ్రేణులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భం పవన్ కళ్యాణ్ ఓ లేకను విడుదల చేశారు. ఎంత మంది అమరుల త్యాగాలతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి కూడా ప్రజలు టీఆర్ఎస్ కే ప్రజలు అధికార పగ్గాలు అందజేశారని ఈ తీర్పుతో తెలంగాణ ప్రజల విజ్ఞత మరోసారి రుజువైందని అన్నారు.

ఖమ్మంలో మా పార్టీని మా వాళ్లే చంపుకున్నారు: కేసీఆర్

Submitted by chandram on Tue, 12/11/2018 - 18:03

తెలంగాణ ఎన్నికల్లో భారీ మెజారిటీతో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మా పార్టీ నేతల చిన్న చిన్న పొరపాట్ల వల్లనే కొన్ని సీట్లు నష్టపోయామని, ఖమ్మంలో తమ పార్టీని తమ నేతలే చంపుకున్నారని  ప్రగతి భవన్ లో మీడియా సమావేశంలో కేసీఆర్ అన్నారు. ఎన్నికల ఫలితాలలో మా పార్టీకి చెందిన నలుగురు మంత్రులు, మాజీ స్పీకర్ ఓడిపోయారని వల్లకు స్వయంగా ఫోన్ చేసి వారితో మాట్లాడానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనత పార్టీ సహకారం లేకుండానే తెలంగాణ ప్రజలే ఏకతాటీగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చామని తెలిపారు.

చరిత్ర సృష్టించిన హరీశ్ రావు.. 1.20 లక్షల ఓట్ల మెజారిటీతో

Submitted by chandram on Tue, 12/11/2018 - 16:07

దేశంలోనే తక్కవ  వయసులోనే డబుల్‌ హ్యాట్రిక్‌ సాధించిన ఎమ్మెల్యేగా  ఆపద్ధర్మ మంత్రి  తన్నీరు హరీష్‌ రావు రికార్డు సృష్టించారు. గత 14 ఏళ్లలో సిద్దిపేట స్థానం నుంచి వరుసగా ఆరుసార్లు గెలుపొందారు. తెలంగాణ ఎన్నికల్లో హోరాహోరా పోటీలో టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు చరిత్ర సృష్టించాడు. ఎవరు అందుకోలేని ఎత్తులో హరీశ్ రావు చేరుకున్నారు. సిద్ధిపేట నియోజకవర్గం నుండి పోటీచేసిన హరీశ్ రావు వందలు, వేలు కాదు ఏకంగా 1.20.650 ఓట్ల మెజారిటీతో ప్రభంజనం సృష్టించారు. సిద్దిపేట ప్రజలు ఏకపక్షంగా తీర్పును కట్టబెట్టారు. దింతో గతంలో మరెవరికి సాధ్యం దేశంలోనే చరిత్ర సృష్టించారు హరీష్‌ రావు.