Khammam

ఖమ్మం సభలో కేసీఆర్‌కు చంద్రబాబు కౌంటర్

Submitted by arun on Wed, 11/28/2018 - 16:44

ఖమ్మంలో నిర్వహిస్తున్న మహాకూటమి బహిరంగసభ సందర్భంగా సరికొత్త ఘట్టం ఆవిష్కృమైంది. మొన్నటిదాకా ఉప్పూనిప్పుగా ఉన్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులు ఒకే వేదికపై ఆశీనులయ్యారు. పక్కపక్కనే కూర్చుని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ప్రజాకూటమి సభలో మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబు కేసీఆర్‌కు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్‌ను నిర్మించినట్లు తాను చెప్పినట్లు అంటున్నారని, తాను నిర్మించలేదని, సైబరాబాద్‌కు తన హయాంలో రూపకల్పన చేశామని చంద్రబాబు చెప్పారు. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు రూపకల్పన చేశామని గుర్తుచేశారు.

రాహుల్, బాబు సభపై ఉత్కంఠ

Submitted by arun on Wed, 11/28/2018 - 11:22

మహాకూటమి ప్రచారం ముమ్మరం చేసింది. ఇప్పటికే సోనియాను తీసుకొచ్చి సెంటిమెంట్‌ను పారించిన కూటమి పార్టీలు ఇవాళ్టి నుంచి రాహుల్‌గాంధీతో ప్రచారం నిర్వహించనుంది. తొలుత కొడంగల్‌లో నియోజకవర్గంలోని కోస్గీ బహిరంగ సభకు హాజరుకానున్నారు. తర్వాత ఖమ్మం సభలో చంద్రబాబుతో కలిసి వేదికను పంచుకోనున్నారు. తెలుగు రాజకీయాల్లో ఆసక్తికరమైన సన్నివేశం మరికొన్ని గంటల్లోనే ఆవిష్కృతం కానుంది. ఒకే వేదికపైకి టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల అధ్యక్షులు చంద్రబాబు, రాహుల్‌గాంధీ కనిపించబోతున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇవాళ ఖమ్మంలో జరగనున్న మహాకూటమి సభలో ఇద్దరు నాయకులు కీలక ప్రసంగాలు చేయనున్నారు.

ఖమ్మలో టీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ...పార్టీ వీడుతున్న...

Submitted by arun on Mon, 11/26/2018 - 11:04

ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఖమ్మం టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఇండస్ట్రియల్ డెవలెప్‌మెంట్ కార్పొరేఫన్ చైర్మన్ బుడాన్‌ బేగ్ పార్టీ వీడేందుకు రంగం సిద్ధమైంది. టీఆర్ఎస్‌లో ఆత్మగౌరవం లేవనే కారణంగా ఆయన పార్టీ వీడాలని ఆయన నిర్ణయించుకున్నారు. టీడీపీలో చేరేందుకు బేగ్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. దీనిపై ఆయన ఇవాళ సాయంత్రం అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.  ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా ఉన్న బేగ్.. గత లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు.  

దేశ పరిరక్షణ కోసమే టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిశాయి-భట్టి

Submitted by chandram on Sat, 11/10/2018 - 10:19

దేశ పరిరక్షణ కోసమే తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు కలిశాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రచార కమిటీ ఛైర్మన్ భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా పరిధిలోని టీడీపీ కార్యకర్తల సమన్వయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, టీడీపీ కలయిక అధికారం కోసమో, పదవుల కోసమో కాదని తెలిపారు. దేశం, రాజ్యాంగం కోసం కలిశామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీతో కేసీఆర్ కలిసి, దేశాన్ని కుల, మత, వర్గ, ప్రాంతాలుగా విభజించారని విమర్శించారు. 
 

ప్రజల్లో దైర్యం నింపడానికే కవాతు:సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌

Submitted by arun on Thu, 11/08/2018 - 16:43

ఎన్నికల సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కేంద్ర బలగాలు ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించాయి. సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ నేతృత్వంలో జరిగిన ఈ కవాతులో ఐటీబీటీ కంపెనీతో పాటు 15 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, 22 ఎస్‌ఎస్‌ టీ టీమ్‌లో పాల్గొన్నాయి. ఎన్నికలు ప్రశాంతం నిర్వహించేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఖమ్మం ఎస్పీ తెలిపారు. 

ఖమ్మంలో డాక్టర్ అనుమానాస్పద మృతి

Submitted by arun on Tue, 10/23/2018 - 17:17

ఖమ్మం జిల్లా పెద్ద గోపతిలో డాక్టర్ వీణ ఆత్మహత్య  స్థానికంగా తీవ్ర కలకల రేపుతోంది. గోపతి పీహెచ్‌సీ‌లో ఆయుర్వేద డాక్టర్ గా పనిచేస్తున్న వీణ.. ఆస్పత్రిలోనే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సూసైడ్ లెటర్ స్వాధీనం చేసుకున్న పోలీసులు వీణ మృతిపై విచారణ జరుపుతున్నారు. స్థానికులు మాత్రం, డాక్టర్ ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమంటున్నారు. 
 

కార్పొరేటర్‌ భర్తను చెప్పుతో కొట్టిన మహిళ..!

Submitted by arun on Sat, 05/26/2018 - 17:03

ఖమ్మంలోని అధికార పార్టీ కార్పోరేటర్లు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా కార్పోరేటర్ శశికళ భర్త వీరేందర్‌పై ఓ మహిళ చెప్పుతో కొట్టింది. తన ఇంటి ప్రహరిగోడను కూల్చి కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారంటూ వాదులాటకు దిగింది. దాడికి యత్నించిన మహిళపై తన జులుం ప్రదర్శించిన వీరేందర్  ..అంతుచూస్తానంటూ  బెదిరింపులకు దిగారు.

ఖమ్మం జిల్లాలో వింత...గుడ్లు పెడుతున్న కోడిపుంజు

Submitted by arun on Sat, 04/21/2018 - 12:50

అవును.. కోడిపుంజు గుడ్డుపెట్టిన అరుదైన సంఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ఆలస్యం శ్రీనివాసరావు ఇంట్లో ఓ కోడిపుంజు చిన్నగా ఉన్న గుడ్డు పెట్టింది. గత నెలలోనూ తోలు గుడ్డు ఒకటి పెట్టిందని, అది దానిదా? కాదా? అనే సందేహంతో ఈసారి పుంజును విడిగా పెట్టడంతో నిర్ధరణ అయిందని ఆయన చెప్పారు. ఇక దీనిని పరిశీలించిన వెటర్నరీ డాక్టర్ కె. కిశోర్.. జన్యు పరివర్తనాల వల్ల ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతుంటాయని తెలిపారు. కోడిపుంజు పెట్టే గుడ్డును విండ్‌ గుడ్డు అని, మొదటిసారి పెంకు లేకుండా పెట్టే గుడ్డును పుల్లెట్ గుడ్డు అని అంటారని తెలిపారు.

ఖమ్మం ప్రమాదం వెనుకు జీర్ణించుకోలేని చేదు నిజం

Submitted by arun on Sat, 03/10/2018 - 16:53

చావు. అందరికీ భయమే. ఎప్పుడైనా ఏ రూపంలోనైనా కాటేసే మరణమంటే చచ్చేంత భయం. ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోతామో...ఎవ్వరూ చెప్పలేరు. కనీసం ఊహకు కూడా అందదు. అలాంటి చావు దుర్మార్గమా చిదిమేస్తుంది. కారుణ్యం చూపించనంత కఠినంగా కాటేస్తుంది. ఖమ్మం జిల్లాలో నిన్న అదే జరిగింది. పెళ్లయిన కేవలం ఆరంటే ఆరు గంటల్లోనే మృత్యువు దారుణంగా పాశం వేసింది. పాశవికంగా ప్రాణాలు తీసేసింది. చావు ఎదురయ్యే ఆ క్షణం ముందే తెలిసిపోయిన ఆ ప్రాణాలు ఎంత అవిసిపోయాయో... ఎంతగా అల్లాడిపోయాయో పాపం.

చిట్టితల్లికి అంతులేని వేదన

Submitted by arun on Wed, 01/31/2018 - 11:18

100 రోజులు.  తన్విత తల్లికి దూరమై ఇవాళ్టికి సరిగ్గా 100 రోజులు. కన్న ప్రేమ..పెంచిన ప్రేమ మధ్య పోరాటంలో నలిగిపోతున్న చిన్నారి... అమ్మ ఒడికి దూరమై అప్పుడే మూడు నెలలు దాటి పోయింది. అమ్మ ప్రేమకు దూరమైన ఇల్లందు చిన్నారి తన్విత ఇంకా ఖమ్మం బాలసదనంలోనే గడుపుతోంది. ఎవరూ లేని అనాథలా..ఏకాకిలా.. బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతోంది. ఇప్పుడు అందరిలోనూ ఒకటే ప్రశ్న...తన్వితకు విముక్తి ఎప్పుడు..? తల్లి ఒడికి చేరేదెన్నడు.