Saina Nehwal

నాన్నకు ప్రేమతో.....

Submitted by arun on Mon, 04/16/2018 - 16:31

కంటే కూతుర్నే కనాలి ...అన్నమాట...భారత బ్యాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్ తండ్రి హర్ వీర్ సింగ్ కు అతికినట్లు సరిపోతుంది. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదిగా ముగిసిన 2018 కామన్వెల్త్ గేమ్స్ లో టీమ్, వ్యక్తిగత విభాగాలలో స్వర్ణపతకాలు సాధించిన తన బంగారు కొండ సైనా ను చూసి ఆమెతండ్రి హర్ వీర్ సింగ్ మురిసిపోతున్నారు. పుత్రికోత్సాహంతో పొంగిపోతున్నారు.

సైనా వర్సెస్ పీవీ సింధూ...

Submitted by arun on Sat, 04/14/2018 - 13:00

కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం క్రీడాభిమానులకు పండగే. మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో భారత స్టార్‌ క్రీడాకారిణీలు సైనా నెహ్వాల్‌, పీవీ సింధు ఫైనల్స్‌కు చేరుకున్నారు. దీంతో ఈ ఇద్దరిలో ఒకరికి స్వర్ణం మరొకరికి రజతం ఖాయమయ్యాయి. కానీ, ఎవరికి ఏ పతకం దక్కుతుందో అని ఇప్పుడు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెమీఫైనల్లో ఈ ఇద్దరూ తమ ప్రత్యర్థుల్ని మట్టి కరిపించి ఫైనల్‌కు దూసుకెళ్లారు. 2010లో బంగారు పతకం సాధించి సంచలనం సృష్టించిన సైనా... గాయాల కారణంగా 2014 గ్లాస్గో కామన్వెల్త్‌లో నిరాశగా వెనుదిరిన సంగతి తెలిసిందే.

సైనా బెదిరింపులపై గుత్తా జ్వాలా సీరియస్

Submitted by arun on Wed, 04/04/2018 - 16:16

గోల్డ్ కోస్ట్ వేదికగా జరుగుతున్న 2018 కామన్వెల్త్ గేమ్స్ కు తనతోపాటు తన తండ్రిని అనుమతించకపోతే జట్టు నుంచి వైదొలగుతానంటూ సైనా నెహ్వాల్ బెదిరించడాన్ని భారత బ్యాడ్మింటన్ డబుల్స్ కోచ్ గుత్తా జ్వాల తప్పు పట్టింది. ఇప్పటికే పలుసార్లు కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొన్న సైనా లాంటి సీనియర్ ప్లేయర్ గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభానికి ముందు ఇలా హడావిడి చేయటం తగదని అవార్డుల కోసం, ఇళ్లస్థలాల కోసం, ప్రోత్సాహక నగదు బహుమతుల కోసం ట్విట్టర్ ద్వారా బెదిరించడం తనకు తెలియదని ట్విట్టర్ ద్వారానే సైనాను జ్వాల ఎద్దేవా చేసింది.

సింధుపై సైనా విజయం

Submitted by arun on Fri, 01/26/2018 - 15:23

ఇండోనేషియా మాస్టర్స్‌ టోర్నీలో అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన భారత క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌.. తన దేశానికే చెందిన మూడో ర్యాంక్‌ ప్లేయర్‌ పీవీ సింధుపై ఘన విజయం సాధించింది. మహిళల సింగిల్స్‌లో భాగంగా క్వార్టర్‌ ఫైనల్‌ పోరులో సైనా 21-13, 21-19 తేడాతో గెలిచి సెమీస్‌లోకి ప్రవేశించింది. తొలి గేమ్‌ను సునాయాసంగా గెలిచిన సైనా.. రెండో గేమ్‌లో శ్రమించాల్సి వచ్చింది. చివరకు తన అనుభవాన్ని ఉపయోగించిన సైనా రెండో గేమ్‌ను గెలవడంతో పాటు సెమీస్‌ బెర్తును కూడా ఖరారు చేసుకుంది.

బీడబ్ల్యూఎఫ్‌పై సైనా ఆగ్రహం..మద్దతు పలికిన మారిన్‌

Submitted by arun on Thu, 12/21/2017 - 12:21

అంతర్జాతీయ బ్యాడ్మింటన్ బిజీ షెడ్యూల్‌పై ఒక్కొక్కరు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అవసరానికి మించి ఆడుతున్నారంటూ నిన్న చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ వ్యాఖ్యానించగా, తాజాగా స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ గొంతు కలిపింది. 2018కి బీడబ్ల్యూఎఫ్‌ నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకా రం సింగిల్స్‌లో టాప్‌ 15మంది, డబుల్స్‌లో టాప్‌ పది జోడీలు కనీసం 12 టోర్నీలు ఆడాల్సి ఉంటుంది. అలా బరిలో దిగకపోతే షట్లర్లు జరిమానా ఎదుర్కోవాలి. ‘బీడబ్ల్యూఎఫ్‌ క్యాలెండర్‌ టాప్‌ ప్లేయర్లకు చేటుచేసే లా ఉంది. నా అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించేందుకు తగినంత విరామం ఉండాలి. ఒకదానివెంట ఓ టోర్నీ లో నేను పాల్గొనలేను. ఏదో ఆడాలి కాబట్టి..