AIADMK

బ్రేకింగ్‌ : ఎమ్మెల్యేల అనర్హత వేటు.. హైకోర్టు సంచలన తీర్పు

Submitted by arun on Thu, 10/25/2018 - 11:29

ఎమ్మెల్యేల అనర్హతపై చెన్నై హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలను అనర్హులగా ప్రకటిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం 18 ఎమ్మెల్యేలపై  స్పీకర్ వేటు వేయడాన్ని కోర్టు సమర్ధించింది.  న్యాయస్ధానం తీర్పుతో  దినకరన్ వర్గానికి చెందిన 18 మంది తమ అభ్యర్దిత్వాన్ని కోల్పోయారు.  తాజా తీర్పుతో పళనిస్వామి ప్రభుత్వం పూర్తి మెజార్టీకి చేరుకుంది. అయితే హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తానని ప్రకటించారు.  

అవిశ్వాస తీర్మానం.. మేం మద్దతివ్వం..

Submitted by arun on Thu, 07/19/2018 - 13:37

గత పార్లమెంటు సమావేశాల్లో అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టకుండా కావేరీ జలాల పేరుతో అన్నా డీఎంకే అనుక్షణం సభను అడ్డుకున్న సంగతి తెలిసిందే. బీజేపీ కనుసన్నల్లో మెలుగుతూ అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా విజయవంతంగా తన పాత్రను పోషించిందనే ప్రచారం కూడా జరిగింది. ఎన్‌డీఏ ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం శుక్రవారం చర్చకు రానుంది. టీడీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వడం లేదని తమిళనాడు సీఎం ఎడపాడి పళనిస్వామి స్పష్టం చేశారు. కావేరి జలాలపై మా పార్టీ చేసిన పోరాటానికి ఏ పార్టీ మద్దతివ్వలేదని సీఎం ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేశారు.

ఎమ్మెల్యేలపై అనర్హత కేసు.. దిమ్మతిరిగే ట్విస్ట్‌

Submitted by arun on Thu, 06/14/2018 - 14:41

తమిళనాడులో దినకనర్‌ వర్గానికి చెందిన 18మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కేసులో ఎవరూ ఊహించని ట్విస్ట్‌ చోటుచేసుకుంది. మద్రాసు హైకోర్టులో తమిళనాడు సర్కారుకు తాత్కాలిక ఉపశమనం దొరికింది. ఎమ్మెల్యేల అనర్హత వేటుపై హైకోర్టులో ఇద్దరు జడ్జిలు చెరో రకమైన తీర్పును ఇచ్చారు. దీంతో ఈ కేసు విస్తృత ధర్మాసనానికి మారింది. అయితే దినకరన్‌కు మద్దతుగా ఉన్న 18మంది ఏఐడీఎంకే ఎమ్మెల్యేలపై 2017 సెప్టెంబర్‌లో స్పీకర్ ధనపాల్ అనర్హత వేటు వేశారు. దీనిపై దినకరన్ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో కేసును విచారించిన చీఫ్ జస్టిస్, జస్టిస్ వేర్వేరుగా తమ తీర్పును ఇవ్వడంతో కేసు విస్తృత ధర్మాసనానికి చేరింది.
 

నవ్వుల పాలైన అన్నాడీఎంకే దీక్షలు

Submitted by arun on Wed, 04/04/2018 - 15:31

కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డ్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. అధికార పార్టీ అన్నాడీఎంకే రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఒక్కరోజు దీక్ష నవ్వుల పాలైంది. జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో సాక్ష్యాత్తూ సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం దీక్షలో కూర్చొన్నారు. అయితే వెల్లోర్, పుదుకొట్టాయ్, కోయంబత్తూర్, సాలెం సహా చాలాప్రాంతాల్లో అన్నాడీఎంకే కార్యకర్తలకు బిర్యానీ, మద్యంను పంపిణీ చేశారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్  అయ్యాయి. 

మోడీ సర్కారుకు అన్నాడీఎంకే షాక్

Submitted by arun on Mon, 04/02/2018 - 11:04

వరుస ఆందోళనలతో లోక్‌సభను స్తంభింపచేస్తూ అవిశ్వాసంపై చర్చ జరగకుండా అడ్డుకుంటున్న అన్నాడీఎంకే నుంచి మోడీ సర్కారుకు ఊహించని షాకిచ్చింది. కావేరి బోర్డు ఏర్పాటు డిమాండ్‌‌పై కేంద్రం స్పందించకపోతే తాము కూడా అవిశ్వాసానికి సిద్ధమంటూ అన్నాడీఎంకే ప్రకటించింది. కావేరి మేనేజ్‌మెంట్‌ బోర్డుపై కేంద్రం తేల్చకపోతే అవిశ్వాసం పెట్టడమో లేదంటే ఇతరులు పెట్టిన అవిశ్వాసానికి మద్దతు ఇవ్వడమో నిర్ణయిస్తామని లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌, ఏఐఏడీఎంకే ఎంపీ తంబిదురై తెలిపారు.

ఓటమితో డీలా పడ్డ పళని, పన్నీర్.. దినకరన్ కు పళని, పన్నీర్ దీటుగా బదులిస్తారా?

Submitted by arun on Tue, 12/26/2017 - 12:11

ఆర్కే నగర్ లో జయ వారసుడుగా దినకరన్ కు ప్రజలు పట్టం కట్టినట్లే భావించాలా? దినకరన్ గెలుపుతో శశికళ వర్గం పై చేయి సాధించినట్లేనా? మూడు నెలల్లో ప్రభుత్వం కుప్ప కూలుతుందన్న దినకరన్ వ్యాఖ్యలు ఎవరికి చేసిన హెచ్చరికలు.

అన్నాడీఎంకేలో సంచలనం; ఆరుగురిపై వేటు

Submitted by arun on Mon, 12/25/2017 - 14:21

తమిళ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఆర్కే నగర్‌ ఉప ఎన్నికలో ఓటమి నేపథ్యంలో అధికార అన్నాడీఎంకే పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. అన్నాడీఎంకే పార్టీ నుంచి ఆరుగురు నేతలకు ఆ పార్టీ పెద్దలు ఉద్వాసన పలికారు. పార్టీ సీనియర్ నేతల సమావేశమైన సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం కలిసి ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఓటమిపై చర్చించారు. ఈ సందర్భంగా ఆరుగురు నేతలను పార్టీ నుంచి తొలగించాలని పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. వెట్రివేల్, తంగ తమిళ్ సెల్వన్, రంగస్వామి, ముత్తయ్య, కలైరాజన్, షోలింగూర్, పార్థిబన్‌లను పార్టీ నుంచి తొలగించారు.

ఆసక్తి రేపుతున్న ఆర్కేనగర్‌ ఉప పోరు

Submitted by arun on Thu, 12/21/2017 - 10:36

తమిళనాడులోని ఆర్కేనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరుగుతోంది. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్‌లో 256 కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది. మొత్తం 59 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. డీఎంకే అభ్యర్థి మరుదుగణేశ్‌, అన్నాడీఎంకే అభ్యర్థి ఇ. మధుసూదన్‌, అన్నాడీఎంకే అసమ్మతినేత టీటీవీ దినకరన్‌, బీజేపీ నేత కరు నాగరాజన్‌లు ప్రధాన అభ్యర్థులుగా పోటీ పడుతున్నారు. అయితే ప్రధాన పోటీ మరుదుగణేశ్‌, దినకరన్‌, మధుసూదన్‌ల మధ్యనే ఉంటుందని అంచనా.