Virat Kohli

ముంబై చెత్త వివాదంలో విరుష్క జోడీ

Submitted by arun on Mon, 06/18/2018 - 18:01

భారత సెలెబ్రిటీ జోడీ అనుష్కశర్మ- విరాట్ కొహ్లీ...ఓ చెత్త వివాదంలో చిక్కుకొన్నారు. లగ్జరీ కారులో ప్రయాణం చేస్తూ ముంబై రోడ్డుపై చెత్తవేసిన ఓ యువకుడిని అనుష్క మందలించడం దానిని వీడియో తీసి విరాట్ కొహ్లీ నెట్ లో పోస్ట్ చేయటం పట్ల మిశ్రమస్పందన వ్యక్తమయ్యింది. చివరకు అనుష్క పరిస్థితి తిట్టబోయి తిట్లుతిన్నట్లుగా తయారయ్యింది.

కోహ్లీ సవాలును స్వీకరించిన మోదీ

Submitted by arun on Thu, 05/24/2018 - 11:25

‘హమ్ ఫిట్‌ తో ఇండియా ఫిట్’ పేరిట కేంద్రమంత్రి రాజ్య వర్థన్ సింగ్ చేసిన ఫిట్‌నెస్ చాలెంజ్‌ను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వీకరించారు. వెంటనే తాను చేసిన ఓ వ్యాయామానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దానితో పాటు ఈ ఛాలెంజ్‌‌ను స్వీకరించాల్సిందిగా తన భార్య, నటి అనుష్క శర్మకు, ప్రధాని నరేంద్ర మోదీకి, టీమిండియా మాజీ కెప్టెన్ ధోని పేర్లను ట్యాగ్ చేశారు. అయితే కోహ్లీ సవాలుపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. విరాట్‌ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నానని, త్వరలోనే తన వీడియో పోస్ట్‌ చేస్తానని ట్వీట్‌ చేశారు. మనం ఫిట్‌గా ఇండియా ఫిట్‌గా ఉంటుందని వ్యాఖ్యానించారు. 

విరాట్ కళ కళ...బెంగళూరు వెల వెల

Submitted by arun on Wed, 04/18/2018 - 17:14

ఐపీఎల్ 11వ సీజన్ మొదటి 14 మ్యాచ్ లు ముగిసే సమయానికి...బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కొహ్లీ అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్ మన్ గా నిలిచాడు. ముంబై వాంఖెడీ స్టేడియం

విరాట్ కొహ్లీని ఊరిస్తున్న అరుదైన రికార్డు

Submitted by arun on Tue, 02/20/2018 - 16:34

ప్రస్తుత సౌతాఫ్రికా టూర్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీని ఓ అరుదైన అసాధారణ రికార్డు ఊరిస్తోంది. సఫారీలతో తీన్మార్ టీ-20 సిరీస్ చివరి రెండుమ్యాచ్ ల్లో కొహ్లీ 130 పరుగులు సాధించగలిగితే వెయ్యి పరుగుల మైలురాయిని చేరడమే కాదు గతంలో ఇదే రికార్డు సాధించిన కరీబియన్ దిగ్గజం ద గ్రేట్ వివియన్ రిచర్డ్స్ సరసన నిలువగలుగుతాడు. ప్రస్తుత టూర్ టెస్ట్ సిరీస్ నుంచి టీ-20 సిరీస్ తొలిమ్యాచ్ వరకూ విరాట్ కొహ్లీ మొత్తం 870 పరుగులు సాధించాడు. 1976 సీజన్లో వీవ్ రిచర్డ్స్ ఇంగ్లండ్ పర్యటనలో నాలుగు మ్యాచ్ ల టెస్ట్, వన్డే సిరీస్ ల్లో కలిపి ఏకంగా వెయ్యి పరుగులు సాధించడం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

కోహ్లీకి గాయం..తదుపరి టీ20కి అనుమానం!

Submitted by arun on Mon, 02/19/2018 - 12:21

ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్న డాషింగ్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ.. త‌ర్వాతి టీ-20 మ్యాచ్‌కు అందుబాటులో ఉండ‌డా? కోహ్లీ లేకుండానే బుధ‌వారం జ‌రుగ‌బోయే మ్యాచ్‌లో టీమిండియా బరిలోకి దిగుతోందా? ఈ ప్ర‌శ్న‌లకు స‌మాధానాల కోస‌మే అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. గాయం కార‌ణంగా త‌ర్వాతి మ్యాచ్‌కు కోహ్లీ అందుబాటులో ఉండ‌డం లేద‌ని తెలుస్తోంది.

ఇక ఆగలేను

Submitted by arun on Thu, 02/15/2018 - 13:32

అనుష్క శర్మ నటించిన ‘పారి’ సినిమా టీజర్ తాజాగా విడుదల అయింది.. ఈ టీజర్ లో అనుష్క శర్మ అతి భయానకంగా కనిపిస్తూ భయపెడుతుంది.. మోస్ట్ థ్రిల్లర్ నేపథ్యంలో చిత్రించిన ఈ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది.. ఈ టీజర్ మీద అభిమానుల ప్రశంశల జల్లులు వెల్లువెత్తుతున్నాయి..తన భార్య అనుష్క శర్మ నటించిన 'పారి' సినిమాను వెంటనే చూసేయాలని ఉందని... ఆగలేకపోతున్నానని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఈ మేరకు అతను ట్విట్టర్ ద్వారా స్పందించాడు. 'నా జీవితంలో అత్యంత ప్రీతిపాత్రమైన అనుష్క నటించిన సినిమాను చూడటానికి ఆగలేకపోతున్నా. ఇంతకు ముందు ఏ సినిమాలో కనిపించనంత గొప్పగా ఈ సినిమాలో అనుష్క ఉంది.

విరాట్‌ కోసం మామగారి కానుక!

Submitted by arun on Fri, 02/09/2018 - 16:07

సుమారు రెండు నెలల క్రితం భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌​ కోహ్లి, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మలు వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోహ్లి దక్షిణాఫ్రికా పర్యటనలో బిజీగా ఉండగా, అనుష్క తన సినిమా పనుల్లో హడావుడిగా ఉంది. ఇదిలా ఉంచితే, అనుష్క తండ్రి అజయ్‌ కుమార్‌.. తన అల్లుడు కోహ్లికి ఒక ప్రత్యేకమైన కానుక ఇచ్చారు. విరాట్‌కి కవితలంటే చాలా ఇష్టం. అందుకని.. ప్రముఖ రచయిత్రి తేజశ్విని దివ్యా నాయక్‌ రచించిన ‘స్మోక్స్‌ అండ్‌ విస్కీ’ అనే పుస్తకాన్ని అజయ్‌ విరాట్‌కి కానుకగా ఇచ్చారు. గురువారం ముంబయిలో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అజయ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కోహ్లి సెంచరీకి అనుష్క ఫిదా

Submitted by arun on Fri, 02/02/2018 - 17:53

వన్డే క్రికెట్ టాప్ ర్యాంకర్ సౌతాఫ్రికాతో ఆరుమ్యాచ్ ల వన్డే సిరీస్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ సెంచరీతో అదరగొట్టాడు. డర్బన్ కింగ్స్ మీడ్ వేదికగా ముగిసిన తొలివన్డేలో అజింక్యా రహానేతో కలసి తనజట్టుకు 6 వికెట్ల అలవోక విజయం అందించాడు. కొహ్లీ 119 బాల్స్ లో 10 బౌండ్రీలతో 112 పరుగులు సాధించాడు. తన వన్డే కెరియర్ లో 203వ మ్యాచ్ లో విరాట్ 33వ శతకంతో ఈ ఘనత సాధించాడు. క‌ఠిన‌మైన డ‌ర్బ‌న్ పిచ్‌పై అద్భుత‌మైన ఆటతీరుతో కోహ్లీ అంద‌ర్నీ ఆకట్టుకున్నాడు. కోహ్లీ ఇన్నింగ్స్‌కు అన్నివైపుల నుంచి ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి. ప్రముఖులు కూడా ట్విట‌ర్ ద్వారా కోహ్లీకి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

"బలీ కా బకరా"

Submitted by lakshman on Sun, 01/14/2018 - 23:28

టీమిండియా కెప్టెన్ పై మాజీ క్రికెటర్లు మండిప‌డుతున్నారు. త‌ప్పుడు నిర్ణ‌యాల‌తో ఆట‌గాళ్ల ప్ర‌తిభ‌ను తొక్కే ప్ర‌య‌త్నం జ‌రుగుతుంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం టీమిండియా- సౌత్రాఫ్రికా ల మ‌ధ్య  టెస్ట్ మ్యాచ్ జ‌రుగుతుంది. అయితే టెస్ట్ కోసం జ‌ట్టులో మార్పులు జ‌రిగాయి. ఆ మార్పులపై సీనియ‌ర్లు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. ధవన్, భువనేశ్వర్‌లను తొలగించి వాళ్ల స్థానంలో రాహుల్, ఇశాంత్‌లను సెల‌క్ట్ చేసుకోవ‌డం స‌రైంద‌ని కాద‌నే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. జ‌ట్టు ఎంపిక విష‌యంలో కెప్టెన్ కోహ్లీని త‌ప్పుబ‌ట్టిన మాజీ కెప్టెన్ సునీల్ గ‌వాస్క‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.