arjun reddy

అర్జున్ రెడ్డి ని మిస్ అయ్యిన..శర్వానంద్!

Submitted by arun on Mon, 11/05/2018 - 16:48

ఒకో సారి... ఒకరి... నో ..మరొకరికి ఎస్ .. అవుంతుంది... అలా ఎన్నో సినిమాలు ఒకరు చెయ్యాల్సినవి, ఇంకొకరు చేసే అవకశాలు వచ్చుయి... అలాగే...అర్జున్ రెడ్డి సినిమా స్క్రిప్ట్ రాసుకొని హీరో పాత్రకోసం శర్వానంద్ ను సంప్రదించాడు. కానీ, అతను వేరే సినిమా చేస్తుండడంతో విజయ్ దేవరకొండను తీసుకున్నారు. ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఏ నిర్మాత ముందుకురాకపోవడంతో సందీప్ తండ్రి, అన్న కలిసి భద్రకాళి పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థ ఏర్పాటుచేసి, ఈ చిత్రాన్ని నిర్మించారు ఈ చిత్రం యువతను బాగా ఆకట్టుకుంది. బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టింది. ఈ ఒక్క సినిమాతోనే... విజయ్ టాప్ స్టార్స్ లిస్టు లోకి వెళ్ళిపోయాడు...శ్రీ.కో.

పెళ్ళి పీట‌లెక్క‌బోతున్న యువ కమెడియన్‌..!

Submitted by arun on Tue, 10/23/2018 - 14:52

సైన్మా అనే షార్ట్ ఫిలింతో అంద‌రి దృష్టిలో ప‌డి ఆ త‌ర్వాత అర్జున్‌ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో స్టార్‌ ఇమేజ్‌ అందుకున్న కమెడియన్‌ రాహుల్ రామకృష్ణ. డిఫరెంట్ డైలాగ్‌ డెలివరీ లుక్‌తో ఆకట్టుకుంటున్న ఈ యువ నటుడు త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ విషయాన్ని కూడా తనదైన స్టైల్‌లో సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు రాహుల్. త‌న‌కి కాబోయే భార్యా తో బీచ్ ప‌క్క‌న ఫోటో దిగిన రాహుల్ రామ‌కృష్ణ ఆ ఫోటోని ట్విట్ట‌ర్‌లో షేర్ చేస్తూ .. ‘జనవరి 15న నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఎవరికీ చెప్పకండి’ అంటూ కామెంట్‌ చేశాడు. 

‘అర్జున్ రెడ్డి’ షూటింగ్‌లో నరకం అనుభవించా!

Submitted by arun on Tue, 05/29/2018 - 11:34

తనకెంతో పేరు తెచ్చిపెట్టిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా వల్ల ఒకవిధంగా తనెంతో నరకయాతన అనుభవించానని ఈ మూవీ హీరోయిన్ షాలినీ పాండే తెలిపింది. ఈ చిత్రం షూటింగ్ సమయంలో నేను పడిన నరకయాతన చెప్పలేను. గతంలో నేను కాలేజీలో చదువుతున్నప్పుడు రెండు సార్లు ప్రేమలో పడి విఫలమయ్యా. 'అర్జున్ రెడ్డి' షూటింగ్ సమయంలో ప్రేమ వైఫల్యంలో ఉన్న తాను హీరోతో సన్నిహిత సన్నివేశాల్లో నటించాల్సి వచ్చిందని గుర్తు చేసుకుంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా… లవ్‌లో ఫెయిల్ అయిన నేను హీరోతో రొమాంటిక్ సీన్స్‌లో నటించాల్సి వచ్చింది. అప్పటి నా పరిస్థితి వర్ణనాతీతం..అని శాలిని ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాపోయింది.

బ్యాక్ లాగ్ క్లియర్ చేసుకుంటున్న అర్జున్ రెడ్డి!

Submitted by arun on Sat, 03/03/2018 - 07:39

అర్జున్ రెడ్డి.. అదేనండీ. మన లేటెస్ట్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ. సినిమాల్లో బ్యాక్ లాగ్స్ క్లియర్ చేసుకుంటున్నాడు. మామూలుగా అయితే మనకు పరీక్షల్లో బ్యాక్ లాగ్స్ ఉంటాయి. అలాగే.. విజయ్ దేవరకొండ సినిమాల్లో బిజీ కాకముందు.. ఏం మంత్రం వేశావే అంటూ ఓ సినిమా మొదలు పెట్టాడు. 2014 నుంచి అది అలా ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కు అంటూ లేట్ అవుతూ వచ్చి.. కొన్నాళ్లకు ఆగిపోయింది.

ఆ డైరెక్టర్‌ను చెప్పుతో కొట్టాలనిపించింది

Submitted by arun on Thu, 01/04/2018 - 11:37

సినీ పరిశ్రమలో మహిళలపై వేధింపుల గురించి ఇప్పటికే అనేక ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. తాము కూడా వేధింపులకు లోనయ్యామంటూ పలువురు హీరోయిన్లు కూడా ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో 'అర్జున్ రెడ్డి', 'పెళ్లిచూపులు' సినిమాలకు పాటలు రాసి, పాప్యులర్ అయిన మహిళా గేయ రచయిత శ్రేష్ఠ కూడా చేరారు. తాను కూడా పరిశ్రమలో వేధింపులకు గురయ్యానని ఆమె తెలిపారు. 

నా గర్ల్‌ఫ్రెండ్‌తో ఎప్పుడూ గొడవలే : విజయ్‌ దేవరకొండ

Submitted by arun on Tue, 12/19/2017 - 12:21

తక్కువ కాలంలో మొదటి అడుగుల్లోనే లైఫ్ లాంగ్ గుర్తుండి పోయే హిట్ అందుకున్న హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమా ఏ స్థాయిలో హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. సందీప్‌ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. కానీ అర్జున్‌రెడ్డి పాత్రలో నటించిన విజయ్‌కి మాత్రం సమస్యలు తెచ్చిపెట్టిందట. ప్రస్తుతం విజయ్‌ ‘ఏ మంత్రం వేశావె’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు పంచుకున్నారిలా..

మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌?

Submitted by nanireddy on Thu, 09/21/2017 - 16:29

'ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం', 'పెళ్లిచూపులు' చిత్రాల‌తో ప‌రిశ్ర‌మ దృష్టిలో ప‌డ్డ విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. 'అర్జున్ రెడ్డి' చిత్రంతో సంచ‌ల‌నం సృష్టించాడు. ఆ చిత్రంలోని టైటిల్ రోల్ లో విజ‌య్ న‌ట‌న విమ‌ర్శ‌కుల‌ను, ప్రేక్ష‌కుల‌నే కాదు సెల‌బ్రిటీల‌ను సైతం మెప్పించింది. ఈ సెల‌బ్రిటీల‌ జాబితాలో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం కూడా ఉన్నారు. కేవ‌లం విజ‌య్ న‌ట‌న‌ని మెచ్చుకోవ‌డ‌మే కాకుండా.. త‌న త‌దుప‌రి చిత్రంలో విజ‌య్‌కి ఆఫ‌ర్ కూడా ఇచ్చారని త‌మిళ‌నాట వార్త‌లు వినిపించాయి.  

కెఎల్‌ఎమ్ మాల్ బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ

Submitted by lakshman on Tue, 09/19/2017 - 19:10

ఒక్క చాన్స్ వస్తే నేనేంటో నిరూపించుకుంటానంటూ ఫిల్మ్ నగర్‌లో చెప్పులరిగేలా తిరిగే వాళ్లు ఈరోజుకూ ఉన్నారు. టాలీవుడ్‌లో చాలామంది ఆ ఒక్క చాన్స్ వల్లే ఈరోజు స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లుగా చలామణి అవుతున్నారు. ఎన్ని సినిమాలు తీసే సత్తా ఉన్నా ఒక్క హిట్ లేకపోతే ఇండస్ట్రీలో ఎన్నటికీ గుర్తింపు రాదు. ఆ ఒక్క హిట్ పడితే ఆ హీరో రేంజే మారిపోతుంది. టాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో అలా ఎదిగిన హీరో ఎవరైనా ఉన్నాడా అనే ప్రశ్నకు విజయ్ దేవరకొండ అని టక్కున సమాధానమొస్తుంది. పెళ్లిచూపులు సినిమాకు ముందు ఎన్ని సినిమాల్లో నటించినా విజయ్‌కు ఆశించిన గుర్తింపు రాలేదు.

New films that capture the telangana essence

Submitted by admin on Sun, 09/10/2017 - 18:11

హైదరాబాద్‌ః తెలుగు సినిమాల్లో ఇన్నాళ్లు హీరోహీరోయిన్లు ఒకలా, విలన్లు, కమెడియన్లు మరోలా మాట్లాడేవారు. తెలంగాణ యాసను కేవలం విలన్లు, కమెడియన్లు మాత్రమే మాట్లాడతారేమోనన్న భ్రమ కలిగేలా ఒకప్పటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు రోజులు మారాయి. తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయింది. తెలంగాణ యాసకు, తెలంగాణ చిత్రాలకు ప్రాంతాలతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. పెళ్లి చూపులు, ఫిదా, అర్జున్ రెడ్డి చిత్రాలకు లభించిన అపూర్వ స్పందనే ఇందుకు నిదర్శనం. ఒకప్పుడు శేఖర్ కమ్ముల చిత్రాలలో అడపాదడపా తెలంగాణ యాస హీరోల నోటి వెంట వినిపించేంది. పెళ్లి చూపులు సినిమా తర్వాత సీన్ మారింది.