jayalalitha

తమిళనాడు అసెంబ్లీలో అమ్మ చిత్రపటం ఆవిష్కరణ

Submitted by arun on Mon, 02/12/2018 - 13:16

తమిళనాడు అసెంబ్లీలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఫొటోను ఆవిష్కరించడం వివాదానికి దారి తీసింది. ఓ నిందితురాలి ఫొటోను అసెంబ్లీలో పెట్టడమేంటంటూ డీఎంకే ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిరసన తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత ప్రధాన నిందితురాలని ఆమె చిత్రపటాన్ని అసెంబ్లీలో ఉంచడానికి వీల్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో జయలలిత ఫొటోను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. 
 

ఇదేం రాజకీయమప్పా

Submitted by lakshman on Wed, 12/20/2017 - 16:57

అనారోగ్యంతో బాధపడుతున్న జయలలిత.... గతేడాది సెప్టెంబర్‌ 22న చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు. రెండు నెలలకు పైగా ఆస్పత్రిలోనే ఉన్న జయ.... చికిత్స పొందుతూ గతేడాది డిసెంబర్‌ 5న తుదిశ్వాస విడిచారు. అయితే జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో.... ఆమె నెచ్చెలి శశికళ ఎవరినీ కలవనివ్వలేదనే ఆరోపణలు వచ్చాయి. దాంతో అమ్మ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ పన్నీర్‌ వర్గం ఆరోపించింది. అంతేకాదు జయను ఆస్పత్రిలో చేర్చేనాటికే జయలలిత మరణించారనే ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే ఆ ఆరోపణలను శశికళ వర్గం ఖండిస్తూ వచ్చింది. ఆస్పత్రిలో అమ్మ బతికే ఉందని చెప్పేందుకు తమ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని దినకరన్‌ చెప్పుకొచ్చారు.