Chandrababu Naidu

చంద్రబాబు నివాసంలో విందుకు హాజరుకానున్న రాహుల్‌గాంధీ

Submitted by arun on Sat, 11/10/2018 - 11:40

కాంగ్రెస్‌ అధ్యక్షుడు  రాహుల్‌ గాంధీ ఏపీలో పర్యటించనున్నారు. డిసెంబర్‌ 23న అమరావతికి రానున్నారు. చంద్రబాబు నివాసంలో ఏర్పాటు చేయనున్న విందులో రాహుల్‌ గాంధీ పాల్గొనున్నారు. ఈ విందు కార్యక్రమంలో రాహుల్‌తో పాటు మమతా బెనర్జీ, కుమారస్వామి, అఖిలేష్‌యాదవ్‌, ఫరూక్‌ అబ్దుల్లా, తేజస్వి యాదవ్‌ సహా 10 మంది జాతీయ నేతలు పాల్గొన్నారు. అదే రోజు టీడీపీ నిర్వహించే ధర్మపోరాట దీక్షలో జాతీయ నేతలు పాల్గొనున్నారు. 
 

‘కాంగ్రెస్‌తో దోస్తీ​.. ఎన్టీఆర్‌ ఫొటో, పేరు వాడుకోవద్దు’

Submitted by arun on Sat, 11/03/2018 - 14:47

తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఎన్టీఆర్ టీడీపీని నెలకొల్పారని కానీ, నీచ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నేడు కేంద్ర నాయకుల వద్ద వంగివంగి దండాలు పెడుతున్నారని ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతి అన్నారు. కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తుపొట్టుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న లక్ష్మీపార్వతి  ఎన్టీఆర్‌కు చంద్రబాబు మరోసారి వెన్నుపోటు పొడిచారని నిప్పులు చెరిగారు. ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని ఆమె నిరసన తెలిపారు. చంద్రబాబు దుష్టరాజకీయాలపై లక్ష్మీపార్వతి ఒక లేఖ రాసి ఎన్టీ రామారావు సమాధి వద్ద ఉంచారు.

దేశ భవిష్యత్, రాజ్యాంగాన్ని కాపాడతాం...మేము గతాన్ని తవ్వుకోవాలనుకోవడం లేదు

Submitted by arun on Thu, 11/01/2018 - 17:45

దేశ భవిష్యత్, రాజ్యాంగాన్ని కాపాడతామని చెప్పారు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ. బీజేపీని వ్యతిరేకించే అన్ని పార్టీలను ఒకే వేదికపైకి తీసుకొస్తామని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు.. బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసేందుకు వివిధ పార్టీల నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. అందులో భాగంగా రాహుల్ గాంధీ నివాసానికి వెళ్లిన చంద్రబాబు గంటసేపు పైగా ఆయనతో భేటీ అయ్యారు. దేశ, రాష్ట్ర రాజకీయాలపై ఇరువురు నేతలు చర్చించారు. అనంతరం రాహుల్, చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. బీజేపీని గద్దె దించేందుకు కలిసి పనిచేస్తామని చెప్పారు.

రాహుల్‌తో చంద్రబాబు భేటీ

Submitted by arun on Thu, 11/01/2018 - 16:26

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటుపై వివిధ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే ఎన్సీపీ నేత శరద్‌పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ అజాద్‌తో భేటీ అయిన చంద్రబాబు కొద్ది సేపటి క్రితం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాసానికి వెళ్లారు. మోడీ వ్యతిరేక పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాల్లో భాగంగా ఆయన రాహుల్‌తో చర్చలు జరుపుతున్నారు. అనంతరం ఆయన సీతారాం ఏచూరి, ములాయంసింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, తేజశ్వితో భేటీ అయ్యే అవకాశం కనిప్తోంది. 

బీజేపీపై బాబు దండయాత్ర

Submitted by arun on Thu, 11/01/2018 - 13:13

సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. కాసేపట్లో శరద్ పవార్ నివాసంలో జరగనున్న విందు సమావేశంలో పాల్గోనున్నారు. సేవ్‌ నేషన్‌ పేరుతో  ఢిల్లీ వేదికగా చంద్రబాబు బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. జాతీయ పొత్తులే ఎజెండాగా బాబు ఢిల్లీ టూర్‌  సాగనుంది. మరికాసేపట్లో కాంగ్రెస్ అధ్యక్షుడు 
రాహుల్ తో భేటీకానున్నారు. అనంతరం, ఫరూక్‌ అబ్దుల్లా, సీతారాం ఏచూరి, తేజస్వి యాదవ్‌‌తోనూ సమావేశంకానున్నారు. 

వేడెక్కిన హస్తిన రాజకీయం...జాతీయ రాజకీయాల్లో ఇవాళ కీలక పరిణామం

Submitted by arun on Thu, 11/01/2018 - 10:15

జాతీయ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇవాళ హస్తిన వేదికగా కీలక పరిణామాలకు తెరలేవబోతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఈ మధ్యాహ్నం సమావేశమవుతారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటు చేసే బాధ్యతను తీసుకుంటానని ప్రకటించిన చంద్రబాబు పలువురు విపక్ష నేతలతో కూడా మంతనాలు సాగిస్తారు.

సీమాంధ్రులకు నేనున్నా...

Submitted by arun on Mon, 10/29/2018 - 10:41

హైదరాబాద్‌లో స్థిరపడ్డ సీమాంధ్రులకు అండగా ఉంటామని మంత్రి కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌ నిజాంపేట్‌లో మన హైదరాబాద్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కుల, మత, ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల పాలన సాగిందని చెప్పారు. తెలంగాణను అస్తిర పర్చే వారిపైనే తమ పోరాటం అని చంద్రబాబుపై విమర్శలను రాజకీయ కోణంలో చూడాలని కేటీఆర్‌ అన్నారు.
 

గులాబీ తోటలో కూటమి మంటలు

Submitted by santosh on Mon, 10/15/2018 - 12:49

మహాకూటమి టార్గెట్‌గా టీఆర్ఎస్ విమర్శల దాడిని పెంచింది. కాంగ్రెస్, టీడీపీ మైత్రి బంధాన్ని ఎన్నికల ప్రచారంలో ఎండగడుతోంది. తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తోంది. మహా కూటమికి దమ్ముంటే తెలంగాణలో చంద్రబాబుతో ప్రచారం చేయాలని సవాల్ విసురుతోంది. తెలంగాణలో ఎన్నికల వాతావరణం రోజురోజుకీ వేడుక్కుతోంది.  మహాకూటమి ఇటు టీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నాడు తెలంగాణ ఏర్పాటును, ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నారని వ్యూహాత్మకంగా గులాబీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. 

ధర్మాబాద్ కోర్టుకు వెళ్లకూడదని చంద్రబాబు నిర్ణయం

Submitted by arun on Sat, 10/06/2018 - 14:05

బాబ్లీ ప్రాజెక్టు కేసులో ధర్మాబాద్‌ కోర్టుకు హాజరుకారాదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో రీకాల్ పిటిషన్ వేయాలని సీఎం యోచిస్తున్నారు. ధర్మాబాద్ కోర్టుకి హాజరయ్యే అంశం పై సీఎం చంద్రబాబు మంత్రులు కళా వెంకట్రావు,యనమల, అచ్చెన్నాయుడు, నారాయణ, నక్కా ఆనంద్, అమర్నాథ్ రెడ్డి, ఎంపీ కనకమేడల రవీంద్రబాబుతో పాటు అడ్వకేట్ జనరల్ తో మంతనాలు జరిపారు. బాబ్లీ కేసు  కేసు విషయంలో ధర్మాబాద్ కోర్టు జారీ చేసిన నాన్ బెయిల బుల్ అరెస్ట్ వారెంట్ ప్రకారం న్యాయస్థానానికి  హాజరు కావాలా లేదా అనే చర్చించారు.

పలు కీలక అంశాలపై చర్చించిన ఏపీ మంత్రివర్గం

Submitted by arun on Sat, 10/06/2018 - 10:17

ఐటీ దాడులు, కేసీఆర్‌ విమర్శల నుంచి బాబ్లీ కేసు వరకు పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన కేబినేట్‌ సమావేశంలో చర్చించారు. సుమారు రెండున్నర గంటలపాటు నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న కేంద్రంపై అన్ని స్థాయిల్లో పోరాటం చేయాలని నిర్ణయించారు.