kathi mahesh

చంద్ర‌బాబు కంట‌త‌డిపై క‌త్తిమ‌హేష్ సెటైర్లు

Submitted by lakshman on Wed, 03/14/2018 - 03:36


ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు కొన‌సాగుతున్నాయి.  ఈ సెష‌న్స్ లో మాట్లాడిన చంద్ర‌బాబు భావోద్వేగంతో క‌న్నీరుపెట్టుకున్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా, రైల్వే జోన్ ప్ర‌క‌ట‌న‌ల‌తో కేంద్రంపై అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కిన చంద్ర‌బాబు.  నాడు రాష్ట్ర‌విభ‌జ‌న సంద‌ర్భంగా ఇచ్చిన హామీల్ని నెర‌వేరుస్తామ‌ని పీఎం మోడీ తెలిపార‌ని అన్నారు.  కానీ ఇప్పుడు మాత్రం అమ‌రావతి నిర్మాణ కోసం స‌హ‌క‌రించాలని కేంద్రాన్ని కోరుతుంటే ..బీజేపీ నేత‌లు మాత్రం డ్రీమ్ సిటీ అని హేళన చేస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానికి సహకరించాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా అన్నారు.

కామినేని రాజీనామాపై కత్తి సంచలన ట్వీట్

Submitted by arun on Sat, 03/10/2018 - 11:12

అధిష్టానం ఆదేశాలతో ఏపీ కేబినెట్‌లో తన మంత్రి పదవికి కామినేని శ్రీనివాస్ గురువారం రాజీనామాను చేశారు. ఈ నేపథ్యంలో అతడి రాజీనామాపై ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్ సంచలన ట్వీట్ చేశారు. ‘‘శ్రీ కామినేని గారి రాజీనామాతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలుకలు కొరికి పసికందులు మరణించిన వైభవ శకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య రంగంలో ముగిసిందని భావిస్తున్నాను. చంద్రబాబు గారికి అభినందనలు’’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.
 

పవన్ ను.. కత్తి వదిలేశాడు!

Submitted by arun on Fri, 03/09/2018 - 14:24

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై.. విమర్శకుడు కత్తి మహేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హోదాకన్నా ప్యాకేజీ మిన్న అని జనాన్ని నమ్మబలికిన చంద్రబాబు.. ఇప్పుడు అదే జనానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు తీరుతో నాలుగేళ్లుగా ఆంధ్రా ప్రజలు.. తమ హక్కులను కోల్పోతున్నారని కూడా కామెంట్ చేశారు.

తుప్పు ప‌ట్టిన‌ప్పుడే సాన‌బెట్టాలి క‌త్తి ఎప్పుడు ప‌డితే అప్పుడు కాదు

Submitted by lakshman on Wed, 02/28/2018 - 06:22

క్రిటిక్ క‌త్తిమ‌హేష్ న‌వ్వుల పాల‌య్యారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ - క‌త్తిమ‌హేష్ మ‌ధ్య జ‌రిగిన వివాదం మ‌న‌కు తెలిసిన విష‌య‌మే. అంత‌కుముందు ఆ త‌రువాత అనేలా ...ప‌వ‌న్ క‌ల్యాణ్ ను విమ‌ర్శించ‌క ముందు క‌త్తిమ‌హేష్  అంటే పెద్ద‌గా ప‌రిచ‌యం లేని పేరు. కానీ ప‌వ‌న్ క‌ల్యాణ్ ను విమ‌ర్శించిన  తరువాత ఆయ‌న్ని ఫాలో అయ్యే అభిమానుల సంఖ్య‌ పెరిగిపోయింది. ఏదైనా స‌మ‌స్య‌పై స్పందిస్తారా..?

‘‘అ! సినిమాకు కత్తిమహేష్ రివ్యూ

Submitted by lakshman on Fri, 02/16/2018 - 22:38


 క్రిటిక్ కత్తిమహేష్ హీరో నాని నిర్మాతగా తెరకెక్కించిన " ఆ " సినిమాపై రివ్యూ ఇచ్చాడు.  కథను నమ్ముకున్న నాని ధైర్యం చేసి ఈ సినిమాను తెరకెక్కించడం విశేషం . ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉండడంతో సినిమాపై అంచనాలు భారీ గా పెరిగాయి. కొత్త డైరక్టర్ ప్రశాంత్ వర్మ  సహా కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, రెజీనా, ఈషారెబ్బా, అవసరాల శ్రీనివాస్, ప్రియదర్శి, మురళీశర్మ నటించడం సహా నాని, రవితేజల వాయిస్ ఓవర్ సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. 

ఇదేంది మ‌హేషా..ప‌వ‌న్ క‌ల్యాణ్ ని అంత‌మాట అనేశావ్

Submitted by lakshman on Wed, 02/14/2018 - 03:57

క‌త్తి మ‌హేష్ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై క‌త్తినూరుతున్నారు. గ‌తంలో కాట‌మ‌రాయుడి రివ్యూ నుంచి ఏదో ఒక‌సంద‌ర్భంలో క‌త్తిమ‌హేష్ ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నం చేశాడు.  ఒకానొక సంద‌ర్భంలో  పాలిటిక్స్ , సినిమాలతో మ‌మ అనిపించుకున్న క‌త్తి వ్య‌క్తిగ‌త జీవితాల్ని టార్గెట్ చేస్తూ వ‌చ్చాడు. దీంతో కొంత‌మంది పెద్ద‌మ‌నుషులు క‌ల‌గ‌జేసుకొని వివాదాన్ని స‌ద్దుమ‌ణిగేలా చేశారు. ఆ ప్ర‌య‌త్నాల‌న్నీ స‌ఫ‌లం అయ్యాయి. కానీ తాజాగా క‌త్తిమ‌హేష్ అగ్నికి ఆజ్యం పోసేలా ప‌వ‌న్ క‌ల్యాణ్ పై విమ‌ర్శ‌లు చేయ‌డం ప్రారంభించాడు. వ్య‌క్తిగ‌తం కాకుండా పొలిటిక‌ల్ ప‌రంగా విమ‌ర్శిస్తాన‌ని చెప్పిన విష‌యం తెలిసిందే. 

‘తొలిప్రేమ’పై కత్తి మహేశ్ రివ్యూ

Submitted by arun on Sat, 02/10/2018 - 12:30

ఫిదా సినిమా తర్వాత..మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ మరోసారి ఆడియన్స్ ఆకట్టుకున్నాడు. క్యూట్ అండ్ స్వీట్ లవ్ స్టోరీతో వచ్చిన తొలిప్రేమ సినిమాకి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. టైటిల్‌తోనే అంచనాలను మరింత పెంచిన ఈ సినిమా శనివారం విడుదలైంది. తొలిప్రేమపై సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్ రివ్యూ ఇచ్చాడు. తెలుగులో ఇప్పట్లో వచ్చిన మంచి ప్రేమకథా చిత్రాల్లో తొలిప్రేమ ఒకటి అని కత్తి మహేశ్ చెప్పాడు. బ్రిలియంట్ రైటింగ్ అంటూ దర్శకుడిపై ప్రశంసల జల్లు కురిపించాడు. హీరోహీరోయిన్లు, ఇతర నటులు ఆకట్టుకునే విధంగా నటించారని కత్తి చెప్పాడు.

‘గాయత్రి’ సినిమాపై కత్తి మహేశ్ రివ్యూ

Submitted by arun on Fri, 02/09/2018 - 17:32

మోహన్‌బాబు నుంచి ఫుల్ లెంగ్త్ రోల్ మూవీ రాక చాలా రోజులే అవుతోంది. ఒకప్పుడు కలెక్షన్స్ కు..అదిరిపోయే డైలాగ్స్ కు కేరాఫ్ గా మారిన మోహన్ బాబు, కొంత గ్యాప్ తర్వాత మళ్లీ గాయత్రి సినిమా చేశాడు. పవర్ ఫుల్ క్యారెక్టర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వినూత్న కథతో వచ్చిన గాయత్రి సినిమా ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. గాయత్రిలో మోహన్ బాబు మరోసారి తన నట విశ్వరూపం చూపించాడు. టూ డిఫరెంట్ క్యారెక్టర్ లో అదరగొట్టేశాడు. మోహన్ బాబు పవర్ ఫుల్ డైలాగ్స్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమాపై సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్ రివ్యూ ఇచ్చాడు.

పవన్ ఉద్యమం చేస్తే.. రావడానికి నేను సిద్ధం: కత్తి

Submitted by arun on Thu, 02/08/2018 - 12:58

ఏపీ ప్రజల ప్రయోజనాల కోసం నేను పోరాడుతానని ముందుకొచ్చారు సినిమా క్రిటిక్ కత్తి మహేష్. బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ జరుగుతున్న బంద్‌కు ఆయన మద్దతు పలికారు. విజయవాడలో వామపక్షాలు, జనసేన చేస్తున్న ఆందోళనలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ రాష్ట్రం పోరాటం చేస్తానంటే ఆయనతోపాటు ఉద్యమంలోకి రావడానికి తానూ సిద్ధమేనని ప్రకటించారు. ఏపీ ప్రజలంటే బీజేపీకి ఎలా కనిపిస్తున్నారని ప్రశ్నించారు.
 

పవన్ కల్యాణ్‌కు నా మద్దతు: కత్తి మహేష్

Submitted by arun on Wed, 02/07/2018 - 14:54

‘‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఈ నెల 21నుంచి న్యూఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేయనున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు నా మద్దతు తెలుపుతున్నాను’’ అని మహేష్ ట్వీట్ చేశారు. కొద్ది రోజుల క్రితం వరకూ పవన్‌పై కారాలు మిరియాలూ నూరిన మహేష్ ఇప్పుడిలా ట్వీట్ చేయడం ఆశ్చర్యపరుస్తోంది. అయితే మరికొద్ది సేపట్లో పవన్ ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారని వార్తలు వచ్చాయి. ఈ ప్రెస్‌మీట్‌లో పవన్ తన కార్యాచరణను వెల్లడిస్తారేమో వేచి చూడాలి.