New Delhi

క‌దం తొక్కిన రైతులు..ఢిల్లీలో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న

Submitted by chandram on Thu, 11/29/2018 - 13:49

రుణా మాఫీ, పండించిన పంటలకు కనీస మద్దరు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీలో అన్నదాతలు కదం తొక్కారు. రాంలీలా మైదాన్ వద్దకు పెద్దఎత్తున రైతులు ఆందోళన బాట పట్టారు. పలు రాష్ట్రాలకు చెందిన రైతులు ఆందోళన బాగంగా భారీ సంఖ్యలో హాజరై ఢిల్లీలో రెండ్రోజులపాటు నిరసన కార్యక్రమం చేపట్టారు. దింతో దేశ రాజధానిలో రోడ్లపై ఎర్రజెండాలతో కదం తొక్కడంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పిడిందని ట్రాఫిక్ అధికారులు వెల్లడించారు. రాబోయే పార్లమెంట్ స‌మావేశంలో రెండు బిల్లులు ప్రవేశ‌పెట్టాల‌ని డిమాండ్ చేస్తున్నారు. గ‌త స‌మావేశాల్లో ఆ రెండు బిల్లుల‌ను ప్రైవేట్ మెంబ‌ర్ బిల్లులుగా ప్రవేశ‌పెట్టారు.

ఏటా 18 లక్షల మంది మృత్యుఒడికి...

Submitted by chandram on Fri, 11/09/2018 - 18:20

రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏకంగా బడులకు సెలవులు ప్రకటించేఅంతగా. ఇంటి నుండి బయటికి రాకుండా ఇంటికే పరిమితం కావాలని పిల్లలకు ప్రభుత్వం హెచ్చరికలు కూడా జారిచేసింది. ఇక ప్రభుత్వ, ప్రయివేట్ ఉద్యోగులైతే కాలుష్యం నుండి కొద్దిపాటి ఉపశమనం కోసం మెడికల్ మాస్క్ లు తప్పనిసరిగా ధరించాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారి చేశారు. అసలు వాతావరణ కాలుష్యానికి అంతా ఇంత కాదు ఒక్క భారతదేశంలో వాయు కాలుష్యం కారణంగా ఏటా 18లక్షల మంది నవాజాత శిశువులు, పసిపిల్లులు మరణిస్తున్నరని లాన్ సెట్ మాగజైన్ నివేదిక వెల్లడించింది.

చట్టమా, ఆర్డినెన్సా? : తేల్చండి

Submitted by arun on Mon, 11/05/2018 - 10:16

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి చట్టమైనా చేయాలని లేకపోతే ఆర్డినెన్స్‌ అయినా తీసుకురావాలని అఖిల భారతీయ సంత్‌ సమ్మేళనం కేంద్రానికి అల్టిమేటం జారీ చేసింది. ఢిల్లీలో జరిగిన సంత్‌ సమ్మేళనం సదస్సులో సుమారు 3 వేలకు పైగా సాధువులు పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి కేంద్రం ఇంకా తీర్మానం చేయకపోవడం బాధించిందన్న సంత్‌లు గాయ్‌, గంగా, గోవింద్‌ను రక్షించే వారికే ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. 

అవిశ్వాసానికి మద్దతు కూడగట్టే పనిలో సీఎం చంద్రబాబు

Submitted by arun on Wed, 07/18/2018 - 17:21

అవిశ్వాసంపై చర్చకు లోక్‌సభ స్పీకర్ అనుమతించడంతో టీడీపీ ఢిల్లీ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు అవిశ్వాసానికి మద్దతు కూడగట్టే పనిలో బిజీబిజీగా ఉన్నారు. బీజేపీ, కాంగ్రెసేతర పార్టీ అధినేతలతో బాబు మంతనాలు సాగిస్తున్నారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా, ఏపీకి జరిగిన అన్యాయంపై అందరికీ వివరిస్తున్నారు. ఇప్పటికే నరేంద్రమోడీ సర్కార్‌పై అవిశ్వాసానికి కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, ఆర్‌ఎస్పీ, ఆప్‌, ఎస్పీ, ఎన్సీపీ, టీఎంసీ, ఆర్జేడీ మద్దతు తెలిపాయి. ఐతే టీఆర్ఎస్ మాత్రం టీడీపీ అవిశ్వాసంపై తటస్థంగా ఉంది. ఇదిలా ఉంటే పార్టీ ఎంపీలకు టీడీపీ 3 లైన్ల విప్ జారీ చేసింది.

విభజన హామీల అమలు కాంగ్రెస్‌తోనే సాధ్యం: కిరణ్ కుమార్ రెడ్డి

Submitted by arun on Fri, 07/13/2018 - 14:09

కాంగ్రెస్‌ పార్టీలోకి మళ్లీ చేరడం ఆనందంగా ఉందన్నారు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీ కండవా కప్పుకున్నారు కిరణ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్‌ పార్టీతో తన కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉందన్న ఆయన విభజన చట్టాన్ని అమలు చేయాలంటే కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమన్నారు. ఇందిరా గాంధీ కుటుంబానికి సన్నిహితుడు కాబట్టే ముఖ్యమంత్రి అయ్యాయని కిరణ్ కుమార్‌ రెడ్డి తెలిపారు. తన కుటుంబాన్ని కాంగ్రెస్‌ పార్టీ 8 సార్లు గెలిపించిందన్నారు. 30 నుంచి 40 మంది కాంగ్రెస్‌ నేతలు తిరిగి కాంగ్రెస్‌ పార్టీలోకి వస్తారని స్పష్టం చేశారు.

భార‌త్ లో విస్త‌రించ‌నున్న ట్రంప్ వ్యాపారాలు

Submitted by lakshman on Tue, 02/20/2018 - 01:33

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌న వ్యాపారాల్ని భార‌త్ లో విస్త‌రించే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. ఇప్ప‌టికే ట్రంప్ పెద్ద కుమారుడు జూనియ‌ర్ ట్రంప్ ఢిల్లీకి స‌మీపంలో విలాసవంత‌మైన ట్రంప్ ట‌వ‌ర్ను నిర్మిస్త‌న్నారు. 47అంత‌స్తుల ట‌వ‌ర్ లో మొత్తం 250 ఇళ్లు ఉండ‌గా ..దీన్ని 2023కి పూర్తి చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ట‌వ‌ర్ను స్థానిక డెవ‌ల‌ప‌ర్ల‌తో ఒప్పొందాలు కుదుర్చుకొని అడ్వాన్స్ బుకింగ్ ల‌ను మొద‌లు పెట్టిన‌ట్లు స‌మాచారం.

బీడబ్ల్యూఎఫ్‌పై సైనా ఆగ్రహం..మద్దతు పలికిన మారిన్‌

Submitted by arun on Thu, 12/21/2017 - 12:21

అంతర్జాతీయ బ్యాడ్మింటన్ బిజీ షెడ్యూల్‌పై ఒక్కొక్కరు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అవసరానికి మించి ఆడుతున్నారంటూ నిన్న చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ వ్యాఖ్యానించగా, తాజాగా స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ గొంతు కలిపింది. 2018కి బీడబ్ల్యూఎఫ్‌ నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకా రం సింగిల్స్‌లో టాప్‌ 15మంది, డబుల్స్‌లో టాప్‌ పది జోడీలు కనీసం 12 టోర్నీలు ఆడాల్సి ఉంటుంది. అలా బరిలో దిగకపోతే షట్లర్లు జరిమానా ఎదుర్కోవాలి. ‘బీడబ్ల్యూఎఫ్‌ క్యాలెండర్‌ టాప్‌ ప్లేయర్లకు చేటుచేసే లా ఉంది. నా అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించేందుకు తగినంత విరామం ఉండాలి. ఒకదానివెంట ఓ టోర్నీ లో నేను పాల్గొనలేను. ఏదో ఆడాలి కాబట్టి..

పార్లమెంటరీ మీటింగ్‌లో కేంద్రమంత్రికి అస్వస్థత

Submitted by arun on Wed, 12/20/2017 - 12:00

భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ సమావేశం బుధవారం ఉదయం ప్రారంభమైంది. పార్లమెంట్‌లోని లైబ్రరీ భవనంలో ఈ సమావేశం జరిగింది. అయితే సమావేశం మొదలైన కొద్ది సేపటికే కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి కృష్ణరాజ్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను వెంటనే ఆర్‌ఎంఎల్‌ ఆసుపత్రికి తరలించారు. పార్లమెంట్‌లోని గ్రంథాలయ భవనంలో జరుగుతున్న ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, పార్టీ సీనియర్‌ నేత ఎల్‌కె అద్వానీ, కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్‌, రవిశంకర్‌ ప్రసాద్‌, నితిన్‌ గడ్కరీ తదితరులు హాజరయ్యారు. ఈ భేటీకి కృష్ణరాజ్‌ కూడా హాజరయ్యారు.