Praja Sankalpa Yatra

జగన్‌ విషయంలోనూ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

Submitted by arun on Wed, 06/13/2018 - 16:45

ఆంధ్రప్రదేశ్‌లో అధికారానికి గేట్‌ వే జిల్లాలు ఉభయ గోదావరి జిల్లాలు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్‌, ప్రజాసంకల్ప యాత్ర, తూర్పు గోదావరి జిల్లాలోకి నిన్న ప్రవేశించింది. పశ్చిమ గోదావరి జిల్లా బోర్డర్‌లోని కొవ్వూరు గోష్పాద క్షేత్రం నుంచి, గోదావరి బ్రిడ్జి మీదుగా, వంలాది కార్యకర్తల నినాదాలు, స్వాగతాల మధ్య రోడ్‌ కం రైలు బ్రిడ్జ్‌పై పాదయాత్ర చేస్తూ, తూర్పులోకి ప్రవేశించారు జగన్. 

జగన్ ఫ్లెక్సీలో బాలకృష్ణ ఫోటో

Submitted by arun on Mon, 06/11/2018 - 11:27

ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 186వ రోజు ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో ప్రస్తుతం కొవ్వూరులో కొనసాగుతోంది. అయితే వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా వైసీపీ కార్యకర్త ఒకరు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ చర్చనీయాంశమైంది. మల్లవరానికి చెందిన ఓ కార్యకర్త జగన్‌ పాదయాత్రకు స్వాగతం పలుకుతూ జగన్‌ ఫోటో పక్కన ఓ పక్క కృష్ణ, మరోపక్క నందమూరి బాలకృష్ణ ఫోటోలతో ఫ్లెక్సీ ఏర్పాటుచేశాడు. పాదయాత్రకు వచ్చిన వైకాపా కార్యకర్తలంతా ఆ ఫ్లెక్సీ చూసి షాకయ్యారు. ఈ ఫ్లెక్సీ ఏర్పాటుచేసిన వ్యక్తి వైకాపా కార్యకర్త అయినప్పటికీ బాలకృష్ణ అభిమాని అని..

జగన్ పాదయాత్రపై తేనెటీగల దాడి

Submitted by arun on Thu, 06/07/2018 - 11:37

జగన్ ప్రజా సంకల్పయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. కానూరు క్రాస్ రోడ్డు దగ్గర  పాదయాత్రగా వెళుతుండగా తేనేటీగలు దాడి చేశాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ...టవాళ్లు అడ్డం పెట్టి యాత్ర కొనసాగించారు. తేనేటీగల దాడిలో పది మందికి గాయాలయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం నడిపల్లికోట కొండాలమ్మ గుడి వద్ద జగన్ 183రోజు పాదయాత్రను ప్రారంభించారు. ఈ క్రమంలో ఓ ఆకతాయి అక్కడే ఉన్న తేనెతుట్టెను రాయితో కొట్టడంతో తేనెటీగలు దాడికి దిగాయి. దీంతో పాదాయత్రకు వచ్చిన కార్యకర్తలు పరుగులు పెట్టారు. ఈ ఘటనతో అప్రమత్తమైన జగన్ సెక్యూరిటీ సిబ్బంది ఆయనను సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు.

చంద్రబాబు వ్యాఖ్యలపై సెటైర్లు పేల్చిన జగన్‌‌

Submitted by arun on Tue, 06/05/2018 - 19:33

తన చేతికి గడియారం ఉండదు... వేలికి ఉంగరం ఉండదు.... మెడలో బంగారు గొలుసు ఉండదంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై... వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి సెటైర్లు వేశారు. వేలికి ఉంగరం, మెడలో గోల్డ్‌ చైన్‌ ఉండదు కానీ... రెండెకరాల నుంచి లక్షల కోట్ల రూపాయల ఆస్తి మాత్రం సంపాదించారని అన్నారు. చంద్రబాబు చేతికి గడియారం ఉండదు కానీ వేలకోట్ల హెరిటేజ్‌ కంపెనీ... రాజభవనంలాంటి ఇల్లు... ఎమ్మెల్యేలను కొనడానికి వందల కోట్ల నల్లధనం మాత్రం ఉన్నాయన్నారు. అమ్మాయిల వంక చూడనంటూ... 70ఏళ్ల వయసులో చంద్రబాబు చెప్పడం ఎబ్బెట్టుగా ఉందన్నారు. చంద్రబాబు మద్యం తాగరు కానీ...

జగన్ సంచలన ప్రకటన

Submitted by arun on Thu, 05/31/2018 - 11:45

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర లో జగన్ సంచలన ప్రకటన చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతీ పేదవాడికి 10 వేల చొప్పున పింఛన్లు ఇస్తామంటూ హామీలు గుప్పించారు. అంతేకాదు ఉచితంగా ఆపరేషన్ చేయించడమేకాకుండా, ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకున్న సమయంలో పేషెంట్‌కి ఉచితంగా డబ్బులు ఇస్తామని తెలిపారు.

వైఎస్ జగన్ కు అస్వస్థత...

Submitted by arun on Wed, 05/30/2018 - 11:21

సుమారు ఆరు నెలలుగా ప్రజాసంకల్ప పాదయాత్రలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఎండ వేడిమి ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆయన పాదయాత్ర కొనసాగిస్తున్నందున వడదెబ్బ తగిలిందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ వెల్లడించారు. ఆయన జలుబు, జ్వరం, తలనొప్పితో బాధపడుతున్నారని, అయినప్పటికీ, తన యాత్రను కొనసాగించారని తెలిపారు. మంగళవారం పాదయాత్ర ముగిసిన తర్వాత జగన్‌ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు మూడు రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు సూచించారు. 

అందుకే పాదయాత్రలో పాల్గొన్నా: పోసాని

Submitted by arun on Sat, 05/26/2018 - 14:59

ప్రముఖ సినీదర్శకుడు, విలక్షణ నటుడు పోసాని కృష్ణమురళి ... ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా  పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జగన్ తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాసేపు ఇరువురి కలిసి మాట్లాడుకున్నారు. అనంతరం పోసాని మాట్లాడుతూ..‘జగన్‌లోని ధృడ సంకల్పం నన్ను ఆకర్షించింది. అందుకే ఆయనకు మద్దతుగా పాదయాత్రలో పాల్గొన్నాను.  అన్ని వర్గాల సమస్యలు పరిష్కరించే నాయకుడు వైఎస్‌ జగన్‌. ఆయనలో సంకల్పం చూసి ఆశ్చర్యం వేసింది.

వైఎస్ జగన్‌ను కలిసిన పోసాని కృష్ణమురళి

Submitted by arun on Sat, 05/26/2018 - 10:45

ప్రముఖ సినీదర్శకుడు, విలక్షణ నటుడు పోసాని కృష్ణమురళి ... ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా  పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జగన్ తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాసేపు ఇరువురి కలిసి మాట్లాడుకున్నారు. అయితే పార్టీలో చేరేందుకే పోసాని జగన్‌ను కలిసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.  

రొయ్యలు పట్టిన వైసీపీ అధినేత

Submitted by arun on Fri, 05/25/2018 - 12:18

ప్రజాసంకల్పయాత్రలో వైసీపీ అధినేత జగన్‌ సరదాగా గడుపుతున్నారు. ప్రజా సమస్యలపై  సర్కారుపై విరుచుకుపడుతూనే...జనంతో జాలీగా గడుపుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెదకాపవరంలో సాగుతున్న యాత్రలో రొయ్యల చెరువు దగ్గర రైతులతో ముచ్చటించారు. సమస్యలను తెలుసుకుంటూనే వలవేసి రొయ్యలను పట్టుకున్నారు. యువనేత రొయ్యలు పడుతున్న సీన్‌ను చూసి అభిమానులు, కార్యకర్తలు కేరింతలు కొట్టారు. 

హోదా పోరులో వైసీపీ దూకుడు...మరో సంచలన నిర్ణయం దిశగా జగన్‌‌

Submitted by arun on Thu, 04/19/2018 - 10:41

చంద్రబాబు దీక్ష నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. కృష్ణా జిల్లా పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్ పార్టీ ఎంపీలతో ఇవాళ భేటీ అయ్యారు. ఆగిరిపల్లి మండలం ఈదరలో జగన్‌తో పార్టీ ఎంపీలు సమావేశమయ్యారు. సీఎం దీక్షతో ఒత్తిడి పెరుగుతుందని భావిస్తున్న వైసీపీ.. ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎంపీల రాజీనామాతో రాజకీయంగా కలిసొచ్చిందని భావిస్తున్న వైసీపీ.. ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తే మరింత మైలేజ్ వస్తుందన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. 2019 ఎన్నికలలో హోదా అంశాన్నే ఎన్నికల ప్రచారాస్త్రంగా మలుచుకోవాలని వైసీపీ భావిస్తోంది.