Agnathavasi

భరత్ అను నేను మరో అజ్ఞాతవాసా?

Submitted by lakshman on Tue, 01/30/2018 - 06:20

టాలీవుడ్ ఇండ‌స్ట్రీ కాపీ కంటెంట్ తో అష్ట‌క‌ష్టాలు ప‌డుతుంది. కోట్లు ఖ‌ర్చు చేసి సినిమా తీస్తే చివ‌రికి ఎవ‌రో ఒక‌రు వ‌చ్చి ఇది మా సినిమా నుంచి కాపీ చేశారంటూ డ‌బ్బులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం ఈ కాపీ కంటెంట్ ఊబిలో కొర‌ట‌ల శివ డైర‌క్ష‌న్ లో మ‌హేష్ బాబు హీరోగా వ‌స్తున్న భ‌ర‌త్ అను నేను చిక్కుకున్న‌ట్లు తెలుస్తోంది.

'అజ్ఞాతవాసి' తొలివారం వసూళ్లు!

Submitted by arun on Wed, 01/17/2018 - 17:41

ప‌వ‌న్ క‌ల్యాణ్ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో అజ్ఞాతవాసి ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. తొలి ఆటతోనే ఈ సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ, వసూళ్ల ప్రభావం మాత్రం బాగానే కొనసాగిందని చెప్పాలి. పవన్ సినిమా ఎలా వున్నా ఒకసారి చూడాలంటూ అభిమానులు థియేటర్స్ కి రావడమే అందుకు కారణం. తొలివారంలో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 39.15 కోట్ల షేర్ ను .. 59.7కోట్ల గ్రాస్ ను సాధించింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే .. 54.95 కోట్ల షేర్ ను .. 88.7 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. అదనపు షోలు ..

కర్ణుడి చావుకు బోలెడు కారణాలు అన్నట్లు

Submitted by lakshman on Tue, 01/16/2018 - 09:14

భారీ అంచ‌నాల‌తో విడుద‌లైన అజ్ఞాతవాసి డిజాస్ట‌ర్ టాక్ వ‌చ్చింది. మాట‌ల‌మాంత్రికుడు - ప‌వ‌న్ క‌ల్యాన్ డైర‌క్ష‌న్ లో ఇంత‌టి డిజాస్ట‌ర్ టాక్ సినిమా వ‌స్తుంద‌ని ఎవ‌రు ఎక్స్ ప‌ర్ట్ చేయ‌లేదు. అయితే ఇప్పుడు సినిమా పెయిల్ అయ్యింది  అనే విష‌యంపై టాలీవుడ్ క్రిటిక్స్ అన్వేషిస్తున్నార‌ట‌. ఈ అన్వేష‌ణ‌లో సినిమా ప్లాప్ అవ్వ‌డానికి కార‌ణం ఓ ర‌కంగా డైర‌క్ట‌ర్ త్రివిక్ర‌మ్ త‌ప్పిద‌మేన‌ని అంటున్నారు.

అయ్యా..మీరు దేవుడ‌య్యా

Submitted by lakshman on Sun, 01/14/2018 - 22:45

క‌ష్టాల్లో ఉన్నార‌ని తెలిస్తే ముందువెనుక ఆలోచించ‌కుండా సాయం చేసే గొప్ప‌గుణం ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఉంద‌నే చెప్పుకోవాలి. అలా బ‌య‌టే కాదు సినిమాల్లో కూడా అంతే ఔదార్య‌న్ని ప్ర‌ద‌ర్శిస్తారు. ప్ర‌తీనిర్మాత‌కు మంచి హిట్ అవ్వాల‌నే గుణం ఉన్న జ‌న‌సేనాని అందుకు చేయాల్సిన ప్ర‌య‌త్నాల‌న్నీ చేస్తాడు. ఒక్కోసారి ఆ ప్ర‌య‌త్నాల‌న్నీ బెడిసికొట్టి ప్లాపులు మూట‌గ‌ట్టుకోవాల్సి వ‌స్తుంది. అయినా నిర్మాత‌ను సేఫ్ చేసేందుకు రెమ్యూన‌రేష‌న్ త‌గ్గించేస్తాడు.

త్రివిక్ర‌మ్ విష‌యంలో హ్యాపీగా ఉన్న ఎన్టీఆర్

Submitted by lakshman on Sun, 01/14/2018 - 13:24

త్రివిక్రమ్ శ్రీనివాస్ - యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో కొత్త సినిమా షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులు ఆందోళ‌న‌లో ఉన్నట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. కొద్దిరోజుల క్రితం ఎన్నో అంచ‌నాల న‌డుమ‌ త్రివిక్ర‌మ్ డైర‌క్ష‌న్ లో   అజ్ఞాతవాసి సినిమా విడుద‌లై డిజాస్ట‌ర్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ ల సినిమా అంటే అనేక సందేహాలు వ‌చ్చిప‌డుతున్నాయి. కానీ ఎన్టీఆర్ మాత్రం పిచ్చ హ్యాపీగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఎన్టీఆర్  గ‌తంలో ఫ్లాపులు మూట‌గ‌ట్టుకున్న పూరిజ‌గన్నాథ్  కు అవ‌కాశం ఇస్తే  టెంప‌ర్ సినిమా తీసి  హిట్ ఇచ్చాడు.

ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తున్న `అజ్ఞాత‌వాసి` క‌లెక్ష‌న్లు

Submitted by lakshman on Sat, 01/13/2018 - 07:38

`అజ్ఞాత‌వాసి`క‌లెక్ష‌న్లు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తున్నాయని  బాలీవుడ్ విశ్లేష‌కుడు త‌రణ్ ఆద‌ర్శ్ ట్వీట్ చేశారు. అభిమానులు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తుంటే   అమెరికాలో హాలీవుడ్ దిగ్గ‌జాల‌తో పోటీప‌డి టాప్ ప్లేస్ లో ఉంద‌ని కొనియాడారు. తొలిరోజు ఏకంగా 1.5 మిలియ‌న్ డాల‌ర్లు, కేవ‌లం ప్రీమియ‌ర్ల ద్వారానే 9.65 కోట్లు కొల్ల‌గొట్టిందని అని అంటున్నారు.  వీకెండ్‌లో కాకుండా వ‌ర్కింగ్ డే రోజు ఈ స్థాయి క‌లెక్ష‌న్లు సాధించ‌డం అత్య‌ద్భుతమ‌ని వ‌ర్ణిస్తూ . దీన్ని సునామీ అనాలా..! `అజ్ఞాత‌వాసి` యూఎస్ బాక్సాఫీస్ వ‌ద్ద టాప్ ప్లేస్ ద‌క్కించుకుంద`ని త‌ర‌ణ్ ట్వీట్ చేశారు.

డెడ్ లైన్ 15నే..ఆ త‌ర్వాత ప‌వ‌న్

Submitted by arun on Fri, 01/12/2018 - 12:12

పవర్ స్టార్‌ పవన్ కళ్యాణ్‌కు వరుసగా కష్టాలు ఎదురవుతున్నాయా ?  ఒక వైపు రాజకీయంగా నిలకడ లేదనే విమర్శలు వస్తుంటే...మరోవైపు అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్‌ కావడంతో అభిమానులు తీవ్ర నిరాశలో మిగిలిపోయారు. అటు కత్తి మహేశ్‌ లాంటి వారు టార్గెట్‌ చేయడం...వ్యక్తిగతంగా, రాజకీయంగా ఇబ్బందిగా మారింది. 

బ‌హిరంగ వాసి భ‌లే ఉందే

Submitted by arun on Fri, 01/12/2018 - 11:40

అజ్ఞాతవాసి సినిమాపై ఆర్జీవీ ఎందుకు మాట్లాడ‌లేద‌ని అంద‌రు అనుకున్నారు. కానీ ఉన్న‌ట్లుండి అజ్ఞాతవాసి గెట‌ప్ లో రామ్ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌న‌మిచ్చాడు. ఈ సినిమా ఎలా ఉంది. క‌త్తిమ‌హేష్ రివ్యూ ఎలా ఇచ్చాడు. అంటూ అనే  విశేషాల్ని నెటిజ‌న్ల‌తో పంచుకున్న ఆర్జీవీ త‌న అభిమాని  అజ్ఞాతవాసి పోస్టర్ ని షేర్ చేశాడు. మార్ఫింగ్ చేసిన ఫోటోలో ప‌వ‌న్ కు బ‌దులు ఆర్జీవీ ఫోటోను ఎడిట్ చేశాడు. అంతేకాదు ఆ ఫోటో పై  అజ్ఞాతవాసి పోస్టర్ ని బహిరంగవాసి త‌గిలించారు. అసలే డివైడ్ టాక్ తో సతమతమవుతున్న అజ్ఞాతవాసికి వర్మ చేస్తున్న పోస్టులు  కొంత వెటకారంగానే ఉన్నాయి.

అజ్ఞాతవాసి "ఫస్ట్ డే" కలెక్షన్స్

Submitted by arun on Wed, 01/10/2018 - 17:02

ప‌వ‌న్ క‌ల్యాణ్ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో అజ్ఞాతవాసి విడుదలైంది. ఈ సినిమా వ‌సూళ్లు ఎలా ఉన్నా క‌లెక్ష‌న్లు మాత్రం క‌న‌క వ‌ర్షం కురిపిస్తున్నాయి. ఓవ‌ర్సీస్ లో 570థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ భారీగా వ‌సూళ్ల‌ను రాబ‌డుతున్న‌ట్లు ట్రేడ్ పండితులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతానికి ట్రేడ్ పండితులు అంచ‌నాల ప్ర‌కారం ఓవ‌ర్సీస్ లో 570 థియేట‌ర్ల‌లో విడుద‌లై వ‌న్ మిలియ‌న్ మార్క్ దాటినట్లు చెబుతున్నారు. ఇక 481 లొకేషన్స్ లో 1.3 మిలియన్  డాలర్లును దాటిన‌ట్లు టాక్ . దీంతో నాన్ బాహుబ‌లి రికార్డ్ ల‌ను బ్రేక్ చేసి రెండవ స్థానంలో అజ్ఞాతవాసి నిలిచింది.