Mahesh Kathi

‘ఇంటిలిజెంట్’కి కత్తి రివ్యూ

Submitted by arun on Fri, 02/09/2018 - 14:52

మూడు హ్యాట్రిక్ హిట్ల తర్వాత.. వరుసగా నాలుగు ఫ్లాపులు తిన్నాడు మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్. ఈ పరిస్థితుల్లో అతడి ఆశలన్నీ ‘ఇంటిలిజెంట్’ మీదే నిలిచాయి. స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ‘ఖైదీ నంబర్ 150’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రూపొందించిన చిత్రమిది. తాజాగా కత్తి మహేష్ ఈ సినిమాకు రివ్యూ ఇచ్చారు. ‘సినిమాలోని 5 పాటలూ సౌండ్ పొల్యూషన్‌కు కారణమవుతున్నాయి. ఉన్న ఒక్క రీమిక్స్ సాంగ్.. అసలైన పాత పాటని స్పాయిల్ చేస్తోంది. పెద్దగా ఆకట్టుకోని ఫైట్స్. నవ్వురాని కామెడి. లవ్ లేని రొమాంటిక్ ట్రాక్. పూర్తిగా అన్ ఇంటిలిజెంట్ స్టోరి.

నీ కెరియ‌ర్ బాగుండాలి క‌త్తి..!

Submitted by lakshman on Sat, 01/20/2018 - 10:32

క‌త్తిమ‌హేష్ కు -ప‌వ‌న్ క‌ల్యాణ్ కు మ‌ధ్య జ‌రుగుతున్న వివాదం ముగిసిన‌ట్లేన‌ని తెలుస్తోంది. త‌న‌పై కోడిగుడ్ల‌తో దాడిచేసినందుకు ప‌వ‌న్ అభిమానుల‌పై క‌త్తిమ‌హేష్ కేసు పెట్టారు. అయితే ఆ కేసును ఉప‌సంహ‌రించుకున్నట్లు, క‌త్తి -  ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు క‌లిసి పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. 

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కత్తి మహేశ్ తీవ్ర విమర్శలు

Submitted by arun on Wed, 01/17/2018 - 16:03

సినీ విమర్శకుడు కత్తి మహేష్ బుధవారం చంచల్‌గూడ జైలులో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అప్రజాస్వామిక శక్తులు రాష్ట్రంలో రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. సీఎం కేసీఆర్‌పై తిరుగుబాటు తప్పదని పేర్కొంటూ ఎమ్మార్పీఎస్‌కు తన మద్దతు ప్రకటించారు.

200 మంది అమ్మాయిలకి కత్తి మహేష్ ఆడిషన్

Submitted by lakshman on Sun, 01/14/2018 - 15:09

ప‌వ‌న్ క‌ల్యాణ్ ను టార్గెట్ చేస్తూ క్రిటిక్ క‌త్తిమ‌హేష్ విమ‌ర్శిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో క‌త్తిమ‌హేష్ గురించి కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. క‌త్తిమ‌హేష్ గురించి  ఆయ‌న గురువు, సినీ నటుడు, నిర్మాత రాంకీ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కత్తి మహేష్‌ని ఇండ‌స్ట్రీకి తీసుకొచ్చి త‌ప్పు చేసిన‌ట్లు చెప్పుకొచ్చారు. ‘రిపోర్టర్’ అనే సినిమాతో ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇచ్చిన క‌త్తి మ‌హేష్ త‌న విచిత్ర‌మైన ప్ర‌వ‌ర్త‌న‌తో యూనిట్ మొత్తానికి విసుగుతెప్పించాడ‌ని ..అందుకే ఆ సినిమా నుంచి మహేష్‌ని తప్పించి.. ఎన్. శంకర్‌తో ప్రస్తుతం చిత్రీకరణను పూర్తి చేసినట్లు చెప్పారు.

క‌త్తి మ‌హేష్ మ‌రో ట్వీట్‌!

Submitted by arun on Sat, 01/13/2018 - 11:51

ఇటీవలి కాలంలో ప‌వ‌న్‌ క‌ల్యాణ్ పై, ఆయన అభిమానులపై విమర్శలతో విరుచుకుపడి, నాలుగైదు రోజులుగా సైలెంట్‌ గా ఉన్న సినీ విశ్లేషకుడు క‌త్తి మ‌హేష్ తాజాగా మ‌రో ట్వీట్ చేశాడు. జనవరి 15 వరకూ సైలెంట్ గా ఉంటే ఆ తరువాత సమస్య పరిష్కారం అవుతుందన్న నిర్మాత కోన వెంకట్ సలహాను పాటిస్తున్నానని చెప్పిన ఆయన, గత రాత్రి ఓ ట్వీట్ వదిలాడు. `ఖాళీ పాత్ర‌లే ఎక్కువ శ‌బ్దం చేస్తాయి. నిజాల కోసం జ‌న‌వ‌రి 16 వ‌ర‌కు ఆగండి` అని ట్వీట్ చేశాడు. కాగా, సంక్రాంతికి విడుద‌లైన `అజ్ఞాత‌వాసి`, `జైసింహా` సినిమాల‌పై క‌త్తి మ‌హేష్ రివ్యూలు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

‘అజ్ఞాతవాసి’ గురించి మహేశ్‌ కత్తి చెప్పిందే నిజమైందా?

Submitted by arun on Wed, 01/10/2018 - 13:11

‘అజ్ఞాతవాసి’ సినిమా గురించి ఫిలిం క్రిటిక్‌ మహేశ్‌ కత్తి చెప్పింది చెప్పినట్లే జరిగిందా? ‘త్రివిక్రమ్‌ కాపీ దెబ్బకి ప్రొడక్షన్‌ హౌస్‌ బలైపోయింద’న్న కత్తి వ్యాఖ్యలు మరోసారి నిజమయ్యాయా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.

పూన‌మ్ కౌర్ ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి ఎందుకు ప్ర‌య‌త్నించిందంటే

Submitted by lakshman on Mon, 01/08/2018 - 22:53

ప‌వన్ క‌ల్యాణ్ - క‌త్తిమ‌హేష్ వివాదంలో  పూన‌మ్ కౌర్ ఎంట‌ర్ అవ్వ‌డం. మ‌హేష్ పై కామెంట్స్ చేస్తూ ప‌వ‌న్ క‌ల్యాణ్ కు మ‌ద్ద‌తిస్తూ  ట్వీట్ చేయ‌డం. అందుకు ప్ర‌తిస్పంద‌న‌గా మ‌హేష్ స‌వాల్ విసరడం. అనంత‌రం ప్రెస్ మీట్ పెట్టీమ‌రి ప‌వ‌న్ -పూన‌మ్ వ్య‌క్తిగ‌త జీవితాల‌పై ఆరు ప్ర‌శ్న‌ల‌కు సంధించ‌డం జ‌రిగింది. అయితే మ‌హేష్ వేసిన ఆరు ప్ర‌శ్న‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. ముఖ్యంగా ఆరు ప్ర‌శ్న‌ల్లో కొన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం దొరికిన‌ట్లు తెలుస్తోంది.

కత్తి మహేష్ పై పరువు నష్టం దావా వేస్తాం

Submitted by arun on Mon, 01/08/2018 - 15:22

పవన్ కల్యాణ్, కత్తి మహేష్ మధ్య మొదలైన వివాదం ఓ మలుపు తీసుకుని... పూనం కౌర్, కత్తి మహేష్ మధ్య రాజుకున్న విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ కు మద్దతుగా, కత్తి మహేష్ ను ఫ్యాట్సో, బెగ్గర్ అని వ్యాఖ్యానిస్తూ పూనం కౌర్ ట్వీట్ చేయడంతో గొడవ పెద్దదైపోయింది. ఈ నేపథ్యంలో పూనం కౌర్ కు ఇవే తన ప్రశ్నలంటూ ఓ ఆరింటిని కత్తి మహేష్ సంధించారు. వీటికి పూనం కౌర్ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

క‌త్తికి మ‌ద్ద‌తుగా పూనమ్ ట్వీట్‌!

Submitted by arun on Mon, 01/08/2018 - 13:29

పవన్ కల్యాణ్-మహేష్ కత్తి వివాదం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు రావాలంటూ కత్తి విసిరిన సవాలుతో.. వివాదం క్లైమాక్స్‌కు చేరుకుందనే అంతా భావించారు. కానీ అనూహ్యంగా వివాదం మరో మెట్టు ఎక్కింది. కత్తి చేసిన సంచలన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఇలాంటి తరుణంలో హీరోయిన్ పూనమ్ కౌర్ క‌త్తి మ‌హేష్‌కు, ఆయ‌న త‌ల్లికి మ‌ద్ద‌తుగా పూన‌మ్ ఓ ట్వీట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఆదివారం జ‌రిగిన ఓ చ‌ర్చా కార్య‌క్ర‌మంలో డైరెక్ట‌ర్ వివేక్.. క‌త్తి మ‌హేష్ త‌ల్లి గురించి ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తాడు.

పూన‌మ్ కౌర్ కాదు ..కొంత‌మంది హీరోయిన్లు కూడా : క‌త్తి

Submitted by arun on Mon, 01/08/2018 - 11:51

తొండ‌ముదిరి ఊస‌ర‌వెల్లి అన్న చందంగా క్రిటిక్ క‌త్త‌మ‌హేష్ - పవ‌న్ క‌ల్యాణ్ ల మ‌ధ్య మాట‌ల యుద్ధం పాలిటిక్స్ నుంచి వ్య‌క్తిగ‌త జీవితాల్లోకి చేరింది. ముఖ్యంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ - హీరోయిన్ పూనమ్ కౌర్ కు మ‌ధ్య ఉన్న సంబంధాల గురించి ప్ర‌స్తావించ‌డ‌మే ఆస‌క్తిక‌రంగా ఉంది. అంతేకాదు ఆ ఆరు ప్ర‌శ్న‌లు పూన‌మ్ కౌర్ కు ప్ర‌శ్నించిన మ‌హేష్ ..మ‌రో ఐదారుగురు హీరోయిన్లు కూడా ఉన్నార‌ని వారి గురించి త్వ‌ర‌లో మీడియాకు వెల్ల‌డిస్తాన‌ని చెప్పుకొచ్చారు. ఈ సంద‌ర్భంగా ఫ్యాన్స్‌ను కాపాడలేని వ్యక్తి.. రాష్ట్రాన్ని ఎలా కాపాడతారని ప్రశ్నించారు కత్తి మహేష్.