Telangana Assembly polls

ఎన్నికల రణక్షేత్రంలో రియల్‌ టైమ్‌ సునామీ

Submitted by santosh on Thu, 12/06/2018 - 20:35

తెలంగాణలో మహా యుద్ధాని మరికొన్ని గంటలే మిగిలున్నాయి. ఎన్నికల రణక్షేత్రంలో విజేతలెవరో. పరాజితులెవరో తేలిపోయే సమయం వచ్చేసింది. ఆధిపత్యం ఎవరిదో ఆశలు గల్లంతెవరికో పాలకు పాలు నీళ్లకు నీళ్లలా తేటతెల్లం కానున్నాయి. ఎన్నికల యుద్ధానికి హెచ్‌ఎంటీవీ వైడ్ రేంజ్ నెట్‌వర్క్‌తో విస్తృతమైన కవరేజ్‌తో తెలంగాణను మీ ముందుంచేందుకు సంసిద్ధంగా ఉంది. మారే లెక్కల్ని జరిగే పరిణామాల్ని సరికొత్త సమీకరణలతో సరికొత్త ట్రెండ్‌తో సునామీ సృష్టించబోతోంది హెచ్‌ఎంటీవీ. కమాన్‌ ఈ ఫ్రైడే విస్తృతమైన నెట్‌వర్క్‌. పటిష్టమైన గ్రౌండ్‌ వర్క్‌, లోతైన పరిశీలన. అద్భుతమైన విశ్లేషణ సార్వత్రిక ఎన్నికల సమరానికి హెచ్‌ఎంటీవీ సిద్ధమైంది.

బరిలో 1825 మంది అభ్యర్థులు...8చోట్ల చతుర్ముఖ పోటీ, 36 చోట్ల త్రిముఖ పోరు

Submitted by arun on Fri, 11/23/2018 - 11:36

ఎన్నికల సంగ్రామంలో ఢీ అంటే ఢీ అనేది ఎవరో తేలిపోయింది. ఎవరెవరి మధ్య పోటీ ఉంటుందో స్పష్టమైంది. నామినేషన్ల తిరస్కరణలు, ఉపసంహరణలు ముగియడంతో బరిలో నిలిచిన అభ్యర్థులెవరో క్లారిటీ వచ్చేసింది. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో మొత్తం.. 18వందల 25 మంది  పోటీలో నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా 3వేల 583 నామినేషన్లు దాఖలు కాగా.. తిరస్కరణలు, ఉపసంహరణలో 17వందల 58 మంది పోటీ నుంచి తప్పుకున్నారు. సగటున ఒక్కో నియోజకవర్గం నుంచి 15 మంది బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో సగటున ఒక్కో సెగ్మెంట్ నుంచి 13 మంది బరిలో ఉండగా.. ఈసారి మరో ఇద్దరు అభ్యర్ధులు పెరిగారు. అత్యధికంగా మల్కాజిగిరిలో 42 మంది పోటీ చేస్తున్నారు.

కాంగ్రెస్ ఫైనల్ లిస్ట్ రిలీజ్‌..... బరిలో ఆర్‌. కృష్ణయ్య

Submitted by arun on Mon, 11/19/2018 - 10:20

కాంగ్రెస్‌ పార్టీ ఫైనల్‌ లిస్టును ప్రకటించింది. ఇప్పటివరకు 88మంది అభ్యర్ధులను అనౌన్స్ చేసిన కాంగ్రెస్‌ మిగిలిన ఆరుగురితో తుది జాబితా విడుదల చేసింది. అయితే ఎవరూ ఊహించని విధంగా టీడీపీ తాజా మాజీ ఎమ్మెల్యే ఆర్‌‌.కృష్ణయ్యకు మిర్యాలగూడ సీటును కేటాయించింది. ఇక ఫైనల్ లిస్ట్‌లోనైనా తమ పేరు ఉంటుందని ఆశించిన సీనియర్లకు మళ్లీ భంగపాటే ఎదురైంది.

నేడు తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Submitted by arun on Mon, 11/12/2018 - 10:17

తెలంగాణ‌లో ఎన్నికల ప్ర‌క్రియ ఇవాళ్టి నుంచి అధికారికంగా మొదలుకాబోతోంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌ నేడు నోటిఫికేషన్‌ ఇవ్వనుంది. దీంతో ఇవాళ్టి నుంచే నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. దీనికోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. తెలంగాణ అసెంబ్లీ రద్దైన నాటి నుంచి రాష్ట్రంలో ఎన్నిక‌ల హ‌డావుడి ప్రారంభ‌మైంది. ఇప్పటికే ఎన్నికలకు కవాల్సిన సమాగ్రి తెలంగాణకు చేరింది వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రాచారం ప్రారంభించారు ఇక ఇవాళ ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎలక్ట్రరోల్ అధికారి రజత్ కుమార్ సిద్ధమయ్యారు.

74 మందితో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రెడీ!...మరికొన్ని గంటల్లో జాబితాను...

Submitted by arun on Fri, 11/09/2018 - 11:13

కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు 74 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. సోనియా గాంధీ నివాసంలో నిన్న జరిగిన ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థుల జాబితాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మహాకూటమి పొత్తుల్లో భాగంగా 26 సీట్లను భాగస్వామ్య పక్షాలకు కేటాయించారు. ఈ జాబితాను అధికారికంగా నేడో, రేపో విడుదల చేయనున్న కాంగ్రెస్ అధిష్టానం పెండింగ్ స్థానాల్లో త్వరలోనే అభ్యర్థులను ఎంపిక చేస్తామంటోంది. మరి ఈ జాబితాలో ఎవరెవరు ఉన్నారు..? వారికి ఏ స్థానాలు దక్కాయి.