kodandaram-visit-to-delhi

ఢిల్లీకి కోదండరాం.. పోటీ అక్కడేనా?

Submitted by nanireddy on Fri, 11/09/2018 - 09:32

మహాకూటమిలో ఆశించినన్ని సీట్లు ఇవ్వకపోవడంతో కోదండరాం నేతృత్వంలోని టీజెఎస్ పార్టీ అసంతృప్తిగా ఉంది. దాంతో అయన మరోసారి ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరపాలని నిర్ణయించుకున్నారు. తమకు 12 సీట్లు కావాలని కాంగ్రెస్‌ హైకమాండ్‌కు జాబితా సమర్పించామన్నారు.. కుదరని పక్షంలో కాంగ్రెస్‌ ప్రకటించిన 8 సీట్లలో కోరిన స్థానాలే ఇవ్వాలని కోదండరాం కాంగ్రెస్‌ను డిమాండ్‌ చేసినట్టు తెలుస్తోంది. ఇదిఅలావుంటే ఈ ఎన్నికల్లో కోదండరాం జనగామ నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యాలని అనుకుంటున్నట్టు సమాచారం. మరోవైపు.. సీపీఐ కూడా కాంగ్రెస్‌ తీరుపై అసంతృప్తిగానే ఉంది.