harishrao letter to ap cm chandrababu naidu

చంద్రబాబుకు హరీష్‌రావు లేఖ... సారాంశం యథాతథం

Submitted by santosh on Thu, 11/08/2018 - 16:31

తెలంగాణలో తెలుగుదేశం పోటీ చేయడంపై ప్రజలకు తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయన్న మంత్రి హరీష్‌రావు... చంద్రబాబుకు 19 ప్రశ్నలను సంధించారు. నరనరాన తెలంగాణ వ్యతిరేకతను నింపుకున్న వ్యక్తి చంద్రబాబు అన్నారు. అసలు చంద్రబాబుకు తెలంగాణ పదమే గిట్టదన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని హరీష్‌ ఆరోపించారు. కేంద్రానికి రాసిన లేఖలను బయటపెట్టారు. చంద్రబాబును చూసి... ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతోందని, అంతలా రంగులు మారుస్తున్నారంటూ హరీష్‌ ఎద్దేవా చేశారు.. బాబుది ఎంత సంకుచిత ధోరణో, ఎంత మరుగుజ్జుతనమో... హైదరాబాద్‌లో ఏపీకి కేటాయించి భవనాలను చూస్తే తెలుస్తుందన్నారు. . చంద్రబాబు...