fiziabad renamed ayodhya..

పేరులో నేముంది... ఆ ఊరిలో ఏముంది!!

Submitted by santosh on Thu, 11/08/2018 - 15:10

రోమియో అండ్ జూలియట్ చాలా మందికి తెలిసే ఉంటుంది. షేక్ స్పియర్ ప్రసిద్ధ రచన అది. అందులో వాట్స్ ఇన్ ఎ నేమ్ ? అనే డైలాగ్ ఉంటుంది. అక్కడి సమయ సందర్భాలు ఎలా ఉన్నా భారతదేశంలో మాత్రం పేరుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. మరీ ముఖ్యంగా నగరాల పేర్లకు... శతాబ్దాల క్రితం నాటి పేర్లు ఇప్పుడు మళ్లీ వాడుకలోకి వస్తున్నాయి.నిజానికి ఈ ఆట ఇప్పటిదేమీ కాదు....బ్రిటిష్ హయాం నుంచీ కొనసాగుతూ వచ్చిన ఈ ఊరి పేర్ల ఆట....మారిపోతున్న ప్రజల మనోభావాలకు అనుగుణంగా  ఇప్పుడు తారస్థాయికి చేరుకుంటోంది.  పేరులో ఏముంది ? అని ఒక వర్గం నిలదీస్తుంటే.... పేరులోనే ఎంతో ఉంది అంటూ మరో వర్గం బదులిస్తోంది.