women voters in telangana

పట్టం కట్టాలంటే... పడతులే దిక్సూచీలు... ఎన్నికల రాజకీయం

Submitted by santosh on Thu, 11/08/2018 - 14:05

స్త్రీలు-పురుషులు ఇద్దరూ సమానమే కానీ. పురుషులు కాస్త ఎక్కువ సమానమని, సినిమాలో ఓ డైలాగ్‌ ఉంది. కానీ తెలంగాణలో దాదాపు 50 నియోజకవర్గాల్లో, పురుషుల కంటే మహిళల కాస్త ఎక్కువ సమానమని, ఏకంగా ఎన్నికల కమిషన్‌ తేల్చింది. తెలంగాణలోని అత్యధిక నియోజకవర్గాల్లో, మహిళా ఓటర్లే అధికం. ఈ విషయం చెబుతున్నది సాక్షాత్తు ఎన్నికల కమిషన్. మొత్తం ఓటర్ల డేటా విశ్లేషించిన ఈసీ, రాష్ట్రంలోని 50 నియోజకవర్గాల్లో పురుషుల కంటే, మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారని లెక్క తేల్చేసింది. రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గంగా నిజామాబాద్‌ జిల్లాలోని బాల్కొండ రికార్డుకెక్కింది.