election commission

టోల్‌ప్లాజాలు ఎత్తివేయాల‌ని ఈసీ ఆదేశం

Submitted by arun on Fri, 12/07/2018 - 11:43

ఓటు వేసేందుకు సొంత ఊర్లకు వెళ్లే వారి వాహనాలకు టోల్ ప్లాజాల వద్ద ఉచిత రవాణా కల్పించాలని సీఈఓ రజత్ కుమార్ సీఎస్‌ను ఆదేశించారు. ఉపాధి కోసం వివిధ ప్రాంతాల‌కు వెళ్లిన తెలంగాణ వాసులు ఓట్లు వేసేందుకు సొంతూళ్ల‌కు పరుగులు పెడుతున్నారు. చాలామంది ద్విచక్రవాహనాలు, కార్లలో వెళ్తుండ‌టంతో టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి. హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారిపై గల యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలం గూడూరు టోల్‌ప్లాజా వద్ద శుక్ర‌వారం వాహనాల రద్దీ బాగా పెరిగింది. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి ర‌జత్ కుమార్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

రూ.1000 కోట్ల పార్టీగా బీజేపీ...దేశంలోనే అత్యంత సంపన్నమైన పార్టీ

Submitted by chandram on Sun, 12/02/2018 - 17:57

దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ, జాతీయ పార్టీలలో అత్యంత ధనిక పార్టీగా బీజేపీ అవతరించింది. గత ఆర్థిక సంవత్సరానికి గాను బీజేపీకి విరాళాల రూపంలో మొత్తం 1000 కోట్లు నిధులు వచ్చాయి. బీజేపీ ఈ వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించిన వార్షిక ఆదాయ నివేదికలో వెల్లడించింది. దేశంలోనే అత్యంత సంపన్నమైన పార్టీగా బీజేపీ అవతరించింది. గత ఆర్థిక సంవత్సరం 2017-18లో బీజేపీకి విరాళాల రూపంలో వెయ్యి కోట్ల రూపాయలు వచ్చినట్లు వార్షిక ఆదాయ నివేదికలో ఎన్నికల సంఘానికి బీజేపీ వెల్లడించింది.. ఆర్థిక వ్యవహారాల్లో తాము పారదర్శకంగా వ్యవహరిస్తున్నందువల్లే తమ పార్టీకి ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు వస్తున్నాయని..

ఎన్నికల కోసం ఈసీ ప్రత్యేక కసరత్తు

Submitted by chandram on Sun, 12/02/2018 - 11:21

తెలంగాణ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ తీవ్ర కసరత్తులు చేస్తోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితుల దృష్ట్యా పోలింగ్‌ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. పోలింగ్‌ ప్రారంభం నుంచి ముగిసే వరకు బూత్‌ స్థాయిలో సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలోనే వార్‌ రూమ్‌ ఏర్పాటు చేస్తున్నారు. క్షణం క్షణం అప్‌డేట్స్‌తో పాటు ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనేందుకు వార్‌ రూమ్‌ సిద్ధంగా ఉంటోంది. ఎన్నికల ప్రక్రియ అంటే అదో సుదీర్ఘ ప్రహసనం. నోటిఫికేషన్‌ మొదలు నుంచి కౌంటింగ్ వరకు తలకుమించిన భారాలెన్నో.

అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం అప్రమత్తం..

Submitted by chandram on Thu, 11/22/2018 - 19:45

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. ఎన్నికల్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక అబ్జర్వర్లను నియమించింది ఈసీ. ఎలక్షన్ ముగిసే వరకూ మినిట్ టు మినిట్ రిపోర్ట్ అందించాలని అబ్జర్వర్లకు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు ప్రమత్తమయ్యారు. ఎన్నికల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కోసం ప్రత్యేక అబ్జర్వర్ లను నియమించారు. అభ్యర్థుల ప్రచారం, ఖర్చులు, పోలింగ్ వ్యవహారాలన్నింటిని క్షణాల్లో తెలియజేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్ తో పాటు తెలంగాణలో ఉన్న పలు జిల్లాలకు కేంద్ర ఎన్నికల సంఘం అబ్జర్వర్ లను నియమించింది. 

ఈసీ కొరఢా.. చిక్కుల్లో హరీశ్, ఉత్తమ్, రేవంత్

Submitted by chandram on Thu, 11/22/2018 - 15:05

తెలంగాణలో ఎన్నికల ప్రచారం కాక రేపుతోంది. గెలుపు కోసం ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. అయితే వివిధ వర్గాలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ఎన్నికల కోడ్‌ను పదేపదే ఉల్లంఘిస్తున్నాయి. కులం, మతం, ప్రాంతం ఆధారంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని వచ్చిన ఫిర్యాదుల మేరకు తెలంగాణలోని ఐదుగురు ప్రముఖ రాజకీయ నాయకులకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది.మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ)ని అతిక్రమించడంతో ఈసీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

ఈసీని ఆశ్రయించిన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి

Submitted by arun on Sat, 11/17/2018 - 15:39

తన నామినేషన్‌ ర్యాలీకి అనుమతి ఇవ్వాలంటూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఈసీని ఆశ్రయించారు. సీఎం కేసీఆర్ ఒత్తిడితో అధికారులు తన ర్యాలీకి అనుమతి నిరాకరిస్తున్నారంటూ ఆదనపు ఎన్నికల కమిషనర్‌ జ్యోతి బుద్ద ప్రకాష్‌కు ఫిర్యాదు చేశారు. తాను అనుమతి కోరితే శాంతి భద్రతలు అంటున్న అధికారులు ఇతర పార్టీల నేతలకు మాత్రం అడిగిందే తడవుగా అనుమతులు ఇస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంలో ఈసీ జోక్యం చేసుకోవాలంటూ ఆయన కోరారు.   
 

స్టార్ క్యాంపేయినర్లకు ఈసీ షరతులు

Submitted by arun on Thu, 11/15/2018 - 10:57

ఎన్నికలు వచ్చాయంటే చాలు స్టార్ క్యాంపేనర్లు తెరపైకి వస్తుంటారు తమకున్న షరిష్మ వాగ్దాటి. పదునైన మాటలతో అభ్యర్ధుల తరపున ప్రచారంలో ఆకట్టుకుంటారు. అయితే ఈసారి ఎన్నికల్లో స్టార్ కాంపేనర్లు ఈసీ కొత్తగా సూచనలు జారీ చేసింది. అనుమతి పొందిన తర్వాతే  క్షేత్రస్థాయిలో ప్రచారంలోకి వెళ్లాలంటోంది.

తెలంగాణలో ఎన్నికల కోడ్‌ కష్టాలు...నగదు, బంగారం తీసుకెళ్తున్నారా? అయితే జాగ్రత్త!

Submitted by arun on Fri, 11/02/2018 - 10:50

విలువైన వస్తువుల్ని కొనుగోలు చేశారా? పెద్ద మొత్తంలో లావాదేవీలు చేశారా? పెద్ద మొత్తంలో నగదు మీ వెంట తీసుకెళ్తున్నారా? మీ ఇంట్లో శుభకార్యాల కోసం బంగారం కొనుగోలు చేశారా? మీ రోజువారీ అవసరాల కోసం చిన్న మొత్తం డబ్బు క్యారీ చేస్తున్నారా? అయితే జాగ్రత్త? మీ వెంట తీసుకెళ్తున్న నగదు, బంగారానికి ఆధారాలు లేకుంటే చిక్కుల్లో పడతారు. బ్యాంకు నుంచి డబ్బు తీసుకెళ్తున్నా? ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేసినా సరే ప్రతి రూపాయికీ మీరు లెక్క చెప్పాల్సిందే. ఒకవేళ మీరు వ్యాపారులైతే అమ్మకాలు కొనుగోళ్లపై కచ్చితంగా రసీదులు చూపాలి. ఆస్పత్రి బిల్లు కట్టేందుకు తీసుకెళ్తున్న డబ్బుకి కూడా లెక్క చెప్పాల్సి ఉంటుంది.

ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు...ఈసీ తీపి కబురు

Submitted by arun on Thu, 11/01/2018 - 11:37

ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు.. ఈసీ తీపి కబురు అందించింది. రోజూవారీ ఖర్చులకు సంబంధించిన ధరలను భారీగా తగ్గించింది. ఉదయం తీసుకునే టీ నుంచి రాత్రి బిర్యాని వరకు అన్నింటి రేట్లను మార్కెట్‌ ధరల కంటే చాలా తక్కువకే నిర్ధారించారు. దీంతో ఈసీ ధరలు అన్ని పార్టీల అభ్యర్థులకు కలిసివచ్చే అంశంగా చెబుతున్నారు. 

టీఆర్‌ఎస్‌కు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నోటీసులు

Submitted by arun on Sat, 10/27/2018 - 10:25

టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసు ఇచ్చింది. మంత్రుల నివాస ప్రాంగణం, ఇతర అధికారిక భవనాల్లో పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారని మహాకూటమి నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో టీఆర్ ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావుకు సీఈవో నోటీసులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చాక తొలిసారిగా, అది కూడా అధికార పార్టీకి నోటీసులు జారీ అయ్యాయి. టీఆర్ఎస్‌కు అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తోందంటూ ఫిర్యాదు వస్తున్న నేపథ్యంలో ఈ నోటీసులు చర్చనీయాంశమయ్యాయి.