raktha sambandham movie

రక్తసంబంధం సినిమా

Submitted by arun on Sun, 11/04/2018 - 15:39

రక్తసంబంధం 1962లో విడుదలైన తెలుగుచిత్రం. వి.మధుసూదనరావు దర్శకత్వంలో, ఎన్టీ రామారావు, సావిత్రి (నటి) ముఖ్యపాత్రల్లో నటించారు.ఈ సినిమాను డూండీ నిర్మాణం చేశారు. తమిళంలో శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, సావిత్రి ప్రధాన పాత్రల్లో నటించగా విజయవంతమైన పాశమలర్ దీనికి మాతృక.. అన్నాచెల్లెళ్ళ అనుబంధం నేపథ్యంలో సాగే భారీ నాటకీయ చిత్రం ఇది. సినిమా నిర్మాత డూండీ తమిళ చిత్రం హక్కులు కొని, రచయితగా అప్పటికి సినీరంగానికి పూర్తి కొత్తవారైన ముళ్ళపూడి వెంకటరమణను నియమించుకున్నారు.